Jump to content

కాదలి

వికీపీడియా నుండి
కాదలి
కాదలి సినిమా పోస్టర్
దర్శకత్వంపట్టాభి ఆర్ చిలుకూరి
రచనపట్టాభి ఆర్ చిలుకూరి (మాటలు)
స్క్రీన్ ప్లేపట్టాభి ఆర్ చిలుకూరి
ఆనంద్ రంగ (అదనపు స్క్రీన్ ప్లే)
నిర్మాతపట్టాభి ఆర్ చిలుకూరి
ఆనంద్ రంగ (ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్)
తారాగణంహరీష్ కళ్యాణ్, పూజా దోషి, సాయి రోనక్
ఛాయాగ్రహణంశేఖర్ వి. జోసఫ్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంప్రసన్ ప్రవీణ్ శ్యామ్
నిర్మాణ
సంస్థ
అనగనగన ఫిల్మ్ కంపెనీ
విడుదల తేదీ
16 జూన్ 2017 (2017-06-16)
సినిమా నిడివి
122 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కాదలి 2017, జూన్ 16న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] పట్టాభి ఆర్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హరీష్ కళ్యాణ్, పూజా దోషి, సాయి రొనాక్ తదితరులు నటించగా, ప్రసన్ ప్రవీణ్ శ్యామ్ సంగీతం అందించాడు. దర్శకుడు పట్టాభి ఆర్ చిలుకూరికి, నటుడు హరీష్ కళ్యాణ్ (తెలుగులో) తొలిచిత్రం.[2]

కథానేపథ్యం

[మార్చు]

డాక్టర్ బాంధవి (పూజా కె.దోషి) కి ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూస్తున్నా, అన్నీ పెళ్ళిచూపుల దగ్గరే ఆగిపోతుంటాయి. దాంతో స్నేహితురాలి సలహాతో కార్తీక్‌ (హరీష్‌ కల్యాణ్‌) ని చూసి ఇష్టపడుతుంది. విభిన్నమైన మనస్తత్వం గల కార్తీక్‌ కొన్నాళ్లు కనిపించకుండా వెళ్లిపోతాడు. అప్పుడు క్రాంతి (సాయి రోనక్‌) అనే మరో అబ్బాయిని ఇష్టపడుతుంది. ఈలోగా కార్తిక్‌ కనిపిస్తాడు. ఇద్దరూ బాంధవిని నిజాయతీగానే ప్రేమిస్తుంటారు. వీళ్లిద్దరిలో ఎవరిని పెళ్ళిచేసుకుంటుందనేది మిగతా కథ.[3]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: పట్టాభి ఆర్ చిలుకూరి
  • ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్, అదనపు స్క్రీన్ ప్లే: ఆనంద్ రంగ
  • సంగీతం: ప్రసన్ ప్రవీణ్ శ్యామ్
  • ఛాయాగ్రహణం: శేఖర్ వి. జోసఫ్
  • కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
  • నిర్మాణ సంస్థ: అనగనగన ఫిల్మ్ కంపెనీ

నిర్మాణం

[మార్చు]

అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెపితే బాగుంటుందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఆనంద్ రంగ, దర్శకుడు పట్టాభికి సూచించాడు. హరీష్ కల్యాణ్, పూజా దోషి, సాయి రోనాక్ లు ఎంపికయ్యారు.[4]

పాటలు

[మార్చు]

ప్రసన్ ప్రవీణ్ శ్యామ్ సంగీతం అందించారు. 2017, జూన్ 7నలో హైదరాబాదులోని పార్క్ హయత్ లో పాటల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐ.టి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రామ్ చరణ్, నిర్మాతలు దగ్గుబాటి సురేష్‌బాబు, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు దశరధ్ పాల్గొన్నారు.[5][6][7]

కాదలి
పాటలు by
ప్రసన్-ప్రవీణ్-శ్యామ్
Released2017
Recorded2017
Genreపాటలు
Labelఆదిత్యా మ్యూజిక్
Producerప్రసన్-ప్రవీణ్-శ్యామ్
ప్రసన్-ప్రవీణ్-శ్యామ్ chronology
యగవరయినమ్ నా కాక్క
(2015)
కాదలి
(2017)

ఈ చిత్రంలో అన్ని పాటలు రాసినవారు:

సం.పాటపాటలుపాట నిడివి
1."ఎలా తేల్చాలి"జోనితా గాంధీ3:32
2."కాదల్ కాదల్"క్లింటన్ సెరిజో, కృష్ణ అయ్యర్‌, ఫర్హాద్3:49
3."నువ్వంటే నేనని"విజయ్ యేసుదాస్3:58
4."లోకమా"నరేష్ అయ్యర్‌, సౌమ్య శర్మ4:41
5."వాలెంటైన్"కృష్ణ అయ్యర్‌3:35

విడుదల

[మార్చు]

ఈ చిత్రం విడుదలైన తర్వాత మిశ్రమ సమీక్షలను అందుకుంది.[8][9]

మూలాలు

[మార్చు]
  1. "Kaadhali censored; set to release on June 16th". Teluguglobal.in. Archived from the original on 25 జూలై 2017. Retrieved 7 April 2020.
  2. Anupama Subramanian (23 September 2016). "Harish Kalyan forays into Telugu". Deccan Chronicle. Retrieved 3 April 2020.
  3. ఆంధ్రప్రభ, సినిమా (16 June 2017). "కాద‌లి మూవీ రివ్యూ…". Archived from the original on 3 ఏప్రిల్ 2020. Retrieved 3 April 2020.
  4. Sangeetha Devi Dundoo (8 June 2017). "Journey towards the debut". The Hindu. Retrieved 3 April 2020.
  5. మనతెలంగాణ, సినిమా (8 June 2017). "'ఆరెంజ్'లాంటి కళ, కలర్స్ ఉన్న 'కాదలి': రాంచరణ్". సంపత్ రెడ్డి. Archived from the original on 3 ఏప్రిల్ 2020. Retrieved 3 April 2020.
  6. "Kaadhali Songs". Raaga.com. Archived from the original on 29 అక్టోబరు 2020. Retrieved 3 April 2020.
  7. The Times of India, Entertainment (8 June 2017). "Kaadhali's audio launch was a star studded affair". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 17 జూన్ 2017. Retrieved 3 April 2020.
  8. Sangeetha Devi Dundoo (16 June 2017). "Kaadhali Review: Choosing Mr. Right". The Hindu. Retrieved 3 April 2020.
  9. Ch Sushil Rao (16 June 2017). "Kaadhali Movie Review {2.5/5}". Times of India. Retrieved 3 April 2020.

ఇతర లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కాదలి&oldid=4266176" నుండి వెలికితీశారు