Jump to content

జోనితా గాంధీ

వికీపీడియా నుండి
జోనితా గాంధీ
2019లో జోనితా గాంధీ
వ్యక్తిగత సమాచారం
జననం (1989-10-23) 1989 అక్టోబరు 23 (వయసు 35)
న్యూ ఢిల్లీ, భారతదేశం
మూలంమిసిసాగా, అంటారియో, కెనడా
సంగీత శైలి
  • క్లాసికల్ మ్యూజిక్
  • పాశ్చాత్య సంగీతం (ఉత్తర అమెరికా)
  • పాప్ సంగీతం
  • జజ్
  • ప్లేబ్యాక్ సింగర్
వృత్తి
  • గాయని
వాయిద్యాలు
  • ఓకల్
  • కీబోర్డ్
క్రియాశీల కాలం2011 – ప్రస్తుతం

జోనితా గాంధీ (జననం 1989 అక్టోబరు 23) భారత సంతతికి చెందిన కెనడియన్ నేపథ్య గాయని.[1][2] ఆమె ప్రధానంగా హిందీ, తమిళ భాషలలో పాటలను రికార్డ్ చేస్తుంది. అయితే పంజాబీ, తెలుగు, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, కన్నడ, మలయాళ భాషలలో కూడా కొన్ని పాటలను ఆలపించింది.

ఆమె యూట్యూబ్ ద్వారా కూడా మంచి పేరు తెచ్చుకుంది.

సినిమాల్లో ఆమె తొలి పాట 2013లో చెన్నై ఎక్స్‌ప్రెస్ టైటిల్ ట్రాక్ తో ప్రారంభమైంది. కాగా హిందీ చిత్రం ఏ దిల్ హై ముష్కిల్ (2016) లోని ది బ్రేకప్ సాంగ్, ఓ కాదల్ కన్మణి (2015) లోని మెంటల్ మనదిల్, డాక్టర్ (2021) లోని చెల్లామా, బీస్ట్ (2022)లోని అరబిక్ కుతు వంటి అనేక అత్యంత ప్రజాధరణ పొందిన పాటలు ఆమె పాడింది. ఈ మూడు తమిళ చిత్రాలు వరుసగా తెలుగులో ఓకే బంగారం, వరుణ్ డాక్టర్, బీస్ట్ లుగా విడుదలైయ్యాయి.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె ఢిల్లీకి చెందిన పంజాబీ కుటుంబంలో జన్మించింది.[3] ఆమె తొమ్మిది నెలల వయస్సులో ఆమె కుటుంబం బ్రాంప్టన్, కెనడాకు వలసవెళ్లింది.[4][5] ఆ తరువాత ఆమె కుటుంబం మిస్సిసాగాలో స్థిరపడింది.[6]

ఆమె టర్నర్ ఫెంటన్ సెకండరీ స్కూల్‌లో చదువుకుంది. వెస్ట్రన్ అంటారియో విశ్వవిద్యాలయంలోని ఐవీ బిజినెస్ స్కూల్‌ నుంచి ఆమె 2012లో హెల్త్ సైన్స్, బిజినెస్‌లలో డిగ్రీలు పూర్తి చేసింది.[7] ఆమె పాశ్చాత్య సంగీతం, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో అధికారిక శిక్షణ పొందింది.[8][9]

కెరీర్

[మార్చు]

ఆమె తండ్రి, సోదరుడు ఆకాష్ గాంధీ ఇద్దరూ పార్ట్ టైమ్ సంగీతకారులు కావడంతో ఆమెకు సంగీతం పట్ల మక్కువ ఏర్పడింది. లైవ్ కమ్యూనిటీ ఈవెంట్‌లలో వారు తరచుగా కవర్ పాటలను కలిసి ప్రదర్శించేవారు.[10] ఈ నేపథ్యంలో ఆమె యూట్యూబ్ కవర్‌లను తయారు చేయడం ప్రారంభించింది. ఈ వీడియోలు వైరల్‌గా మారడంతో ఆమెకు అనేక అవకాశాలకు దారితీసింది. యూట్యూబ్‌లో పానీ ద రంగ్, తుజ్కో జో పాయా, తుమ్ హి హో, సుహానీ రాత్, యే హోన్స్లా ఇలా మరెన్నో హిట్‌లు ఆమె అందించింది.[11]

సోనూ నిగమ్‌తో కలిసి పాడే అవకాశం అందిపుచ్చుకున్న ఆమె ప్లేబ్యాక్ సింగర్ గా రష్యా, యూకె, యూఎస్, కరేబియన్‌లతో సహా వివిధ దేశాలకు పరిచయం అయింది. ఆ తరువాత, ఆమె దృష్టి బాలీవుడ్ పై మళ్ళింది. చెన్నై ఎక్స్‌ప్రెస్‌తో ఆమె ప్లేబ్యాక్ సింగింగ్ ప్రారంభించింది. 2014లో వచ్చిన హిందీ చిత్రం హైవేలోనూ పాడింది.[12]

డిస్కోగ్రఫీ

[మార్చు]

ఆమె పాడిన తెలుగు పాటలు..

సంవత్సరం పాట ఫిల్మ్/సౌండ్‌ట్రాక్/ఆల్బమ్ స్వరకర్త నోట్స్
2015 నువ్వే నువ్వే కిక్ 2 ఎస్.ఎస్. తమన్
యే కదా కేరింత మిక్కీ జె. మేయర్
మెంటల్ మదిలో ఓకే బంగారం ఎ. ఆర్. రెహమాన్
2016 దైవం రాసిన కవిత 24 (తెలుగు వెర్షన్)
మనసుకే
2017 హంసరో చెలియా
ఎలా తేల్చాలి కాదలి ప్రసన్ ప్రవీణ్ శ్యామ్
2018 నిన్నే విడవనులే అనగనగా ఓ ప్రేమకథ కెసి అంజన్
OMG పిల్లా సర్కార్ ఎ. ఆర్. రెహమాన్
లవ్'ఉత్సవం నెక్ట్స్ ఏంటి రామజోగయ్య శాస్త్రి
అంతే కదా మరి లవర్ అంకిత్ తివారీ
2019 హే అమిగో బందోబస్త్ హారిస్ జయరాజ్
2021 ఏవో ఏవో కలలే లవ్ స్టోరీ పవన్ సీఎచ్
చిట్టెమ్మ వరుణ్ డాక్టర్ అనిరుధ్ రవిచందర్
2022 హలమతి హబీబో బీస్ట్
మ మ మహేశా సర్కారు వారి పాట ఎస్.ఎస్. తమన్
ఏంటో ఏంటో థ్యాంక్యూ
దేవ దేవ బ్రహ్మాస్త్రం ప్రీతమ్

మూలాలు

[మార్చు]
  1. ""Singing for a Bollywood number is a big deal", says Jonita Gandhi". Free Press Journal. 30 May 2019.
  2. Jetelina, Margaret (18 July 2017). "Jonita Gandhi highlights Canada's #BollywoodMonster Mashup this weekend". Canadian Immigrant. Archived from the original on 16 July 2018. Retrieved 24 March 2022.
  3. "People confuse my surname with Gujarati, but I am a Punjabi: Jonita Gandhi". The Times of India. 15 July 2021. Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.
  4. "A voice that touched Big B's heart". The Hindu.com. 21 October 2012. Archived from the original on 16 January 2017. Retrieved 13 July 2014.
  5. Panjwani, Radhika (16 April 2014). "Bollywood crooner from Brampton en route to stardom | BramptonGuardian.com". BramptonGuardian.com (in కెనడియన్ ఇంగ్లీష్). Archived from the original on 17 February 2017. Retrieved 26 September 2017.
  6. Khalil, Nouman. "Bollywood is a roller-coaster ride, says Mississauga's Jonita Gandhi". The Mississauga News. Retrieved July 26, 2018.
  7. "Winter 2015". Ivey. Retrieved 4 August 2022.
  8. "Jonita Gandhi: Lucky my first Bollywood song for Shah Rukh Khan-starrer". NDTV.com. 8 July 2013. Archived from the original on 12 July 2013. Retrieved 13 July 2014.
  9. "A voice that touched Big B's heart". The Hindu.com. 21 October 2012. Archived from the original on 16 January 2017. Retrieved 13 July 2014.
  10. Exclusive JONITA GANDHI Interview | In Conversation with Amin Dhillon (Ep. 5) (in ఇంగ్లీష్), archived from the original on 4 April 2022, retrieved 9 April 2021
  11. "Jonita Gandhi: Lucky my first Bollywood song for Shah Rukh Khan-starrer". NDTV.com. 8 July 2013. Archived from the original on 12 July 2013. Retrieved 13 July 2014.
  12. "My efforts have paid off with 'Highway', says singer Jonita Gandhi". IBN Live.in.com. 5 February 2014. Archived from the original on 7 March 2014. Retrieved 13 July 2014.