కుమారి సెల్జా
కుమారి సెల్జా | |||
2011 లో కుమారి సెల్జా | |||
సమాజిక న్యాయ శాఖామంత్రి.
| |||
నియోజకవర్గం | అంబాలా లోక్‌సభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పరభురళ, హుషారు | 1962 సెప్టెంబరు 24||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | అవివాహిత | ||
నివాసం | హిస్సార్ , హర్యానా | ||
మతం | హిందూ మతం | ||
May 16, 2009నాటికి | మూలం | Shamsher patter & Vinayak Pattar |
కుమారి సెల్జా (జననం. సెప్టెంబర్ 24 1962) 15వ లోక్‌సభ సభ్యులు. ఈమె భారత జాతీయ కాంగ్రెస్ నాయకురాలు. ఆమె 15 వ లోక్‌సభలో యు.పి.ఎ ప్రభుత్వంలో సామాజిక న్యాయశాఖ, సాధికారత రంగానికి కేబినెట్ మంత్రిణిగా యున్నారు.[1] ఆమె 2014 జనవరి న రాజీనామా చేశారు.[2] ఈమె అతిపిన్న వయసులో భారతదేశంలో కేంద్ర మంత్రి పదవిని స్వీకరించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.[3]
ప్రారంభ జీవితం
[మార్చు]సెల్జా కుమారి చండీఘర్ లో దళిత నాయకుడైన దల్బీర్ సింగ్ కు జన్మించారు. ఆమె జేసస్, మేరీ కాన్వెంట్ లో విద్యాభ్యాసం చేశారు. ఆమె ఎం.అ, ఎం.ఫిల్ పంచాజ్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు.[4]
రాజకీయ జీవితం
[మార్చు]ఆమె 1990 లో మహిళా కాంగ్రెస్ కు అధ్యక్షురాలిగా తన రాజకీయాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ దళిత నాయకులుగా ఆమె 10 వ లోక్‌సభకు 1991 లో హర్యానాలోని సిర్సా నియోజకవర్గం నుండి గెలుపొందారు. పి.వి.నరసింహారావు ప్రభుత్వంలో ఆమె విద్య, సాంస్కృతిక శాఖలో యూనియన్ మంత్రిణిగా యున్నారు. 1996 లో హర్యానాలో కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉన్నప్పటికీ ఆమె 11 వ లోక్‌సభకు కూడా ఎన్నికైనారు.
2004 లో ఆమె హర్యానా లోని అంబాలా లోక్‌సభ నియోజకవర్గానికి ఎన్నికై ప్రాతినిధ్యం వహించారు. ఈమె మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో (యు.పి.ఎ-1 ప్రభుత్వం) గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖకు స్టేట్ మినిస్టర్ గా యున్నారు. 2009 మే 16 లో ఆమె అదే నియోజకవర్గంలో మరల ఎన్నికైనారు. అంబాలా నియోజకవర్గంలో వరుసగా రెండుసార్లు ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆమె హౌసింగ్, అర్బన్ పోవర్టీ, కల్చర్ శాఖలో మంత్రిణిగా యున్నారు.
ఆరోపణ
[మార్చు]2011 మార్చిలో, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కుమారి సెల్జా "ఫోర్జరీ, నేరపూరిత బెదిరింపు, కల్పన, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని" ఆరోపించిన పిటిషన్‌పై పంజాబ్, హర్యానా హైకోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్, న్యాయవాది బిఎస్ చాహర్, "మిర్చ్‌పూర్ కేసులో జాట్ నాయకులపై బాల్మీకి కమ్యూనిటీ నాయకులను, సభ్యులను ప్రేరేపించడంలో సాధన " సెల్జా, అండర్ ట్రయల్స్‌పై ఒత్తిడి చేసి సంతకం చేయమని బలవంతం చేయడం ద్వారా వ్యాజ్యం నుండి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఖాళీ, న్యాయ రహిత పత్రాలు.” [5]
మూలాలు
[మార్చు]- ↑ "Meet the Ministers - Cabinet Minister". Archived from the original on 2016-06-05. Retrieved 2014-03-19.
- ↑ "President accepts resignation of Kumari Selja from the Council of Ministers". Press Bureau of India. Retrieved 29 January 2014.
- ↑ The Economic Times (6 June 2024). "Bullish Wins & Bearish Losses: Here are the key contests and results of 2024 Lok Sabha polls". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ Detailed Profile: Kumari Selja Govt. of Indian portal.
- ↑ "HC notice to Kumari Selja for 'threatening' Mirchpur accused". The Indian Express. 11 March 2011. Retrieved 22 April 2012.