Jump to content

కురుక్షేత్రం (సినిమా)

వికీపీడియా నుండి
కురుక్షేత్రం
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
తారాగణం కృష్ణ,
విజయనిర్మల
సంగీతం ఎస్.రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ మాధవీ పద్మాలయ కంబైన్స్
భాష తెలుగు

1977 జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడదలైన చిత్రం కురుక్షేత్రం. పౌరాణిక బ్రహ్మ గా పేరుగాంచిన కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో , భారీ తారాగణంతో, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు,చంద్రమోహన్, మోహన్ బాబు, బాలయ్య, జమున,అంజలీ దేవి, విజయ నిర్మల, నటించగ సంగీతం, ఎస్ రాజేశ్వరరావు అందించారు.

వివాదం

[మార్చు]

ఈ చిత్రానికి పోటిగా దాన వీర శూర కర్ణ చిత్రంతో పోటీగా నిర్మితమైనదని ప్రతీతి.

చిత్ర సన్నివేశాలు

[మార్చు]

మహాభారత కథలోని సుభద్రాపరిణయం, రాజసూయం, మాయాజూదం, కౌరవపాండవ సంగ్రామం, పాండవ విజయం సన్నివేశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.

విశేషాలు

[మార్చు]

సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా రూపొందపడిందీ చిత్రం. కురక్షేత్ర సన్నివేశాల చిత్రీకరణ రాజస్ధాన్, అంబాలలో జరిపేరు. దానవీరశూర కర్ణ సినిమా నాటకీయత, సంభాషణలు, ముఖ్యంగా నందమూరి తారక రామారావు నటనా కౌశలం ముందు ఈ చిత్రం వెలవెలపోయిందని చెప్పక తప్పదు. తెలుగునాట అంతంత మాత్రంగా నడిచిన ఈ సినిమాను హిందీలో డబ్ చేస్తే ఉత్తరాదిన విజయ దుంధుబి మ్రోగించింది.

పాత్రలు - పాత్రధారులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

.దర్శకుడు : కమలాకర కామేశ్వరరావు

.కదా రచయిత : త్రిపురనేని మహారది

. నిర్మాణ సంస్థ: మాధవి పద్మాలయ కంబైన్స్

. నిర్మాత: ఏ.ఎస్.ఆర్ . ఆంజనేయులు

. ఎడిటింగ్: కోటగిరి గోపాలరావు

. గీత రచయితలు: శ్రీ శ్రీ, సి నారాయణ రెడ్డి, ఆరుద్ర , వేటూరి సుందర రామమూర్తి , సముద్రాల జూనియర్

గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , పి సుశీల .

పాటల జాబితా

[మార్చు]

1: ధర్మక్షేత్రం , రచన: శ్రీరంగం శ్రీనివాసరావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

2: అలుకల కులుకుల , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

3: ఇదే మయసభ మందిరం , రచన: సముద్రాల జూనియర్, గానం.పి సుశీల

4: హరివిల్లు దివినుంచి , రచన: ఆరుద్ర, గానం.పి సుశీల , వి.రామకృష్ణ

5: మ్రోగింది కళ్యాణవీణ , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి, సుశీల .



పద్యాలు జాబితా

[మార్చు]

1.అనికి వెన్నెచ్చి ధర్మజుడరుగకున్న , గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ

2.అనిముష దైత్య కింపు పురుషులాదిగా, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

3.అరధము నేలకృంగే రథమందు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.ఆకర్ణనాంత విశిష్ట విశ్వ విజయోత్సగాండీ, గానం.విస్సంరాజు రామకృష్ణ

5.ఆడి ఎన్నడు బొంకని వాడనేని , గానం:మంగళంపల్లి బాలమురళీకృష్ణ

6.ఇతర ప్రాణిక లభ్యమైన సిరిచే ఏకాదశ, గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ

7.ఎందరు రాజులు ఈ ధరణి ఏలగా, గానం.మాధవపెద్ది.

8.ఎగు భుజంబులవాడు మగఠీవి,గానం.పులపాకసుశీల

9.కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి, గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ

10.కురువృద్దులు గురువృద్ధ భాందవులనేకులు, గానం.మాధవపెద్ది

11.క్రీడి నిన్నేద నమ్మిన బృత్యుడేని, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

12.నిండిన పాప భాండమవనిన్ పడి , గానం.వి.రామకృష్ణ

13.చచ్చిరి సోదరులు సుతులు చచ్చిరి , గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ

14.నిండు రాజసభన్ పితామహుని, గానం.వి.రామకృష్ణ

15.పెల్చన జాలక ఆలమున పెక్కురుగుడి, గానం.వి.రామకృష్ణ

16.ప్రళయ కాలుడై విలయ రుద్రుడై , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

17.భారత వీరమాతయగు భాగ్యము ప్రాప్తియు, గానం.పి.సుశీల

18.ములుకులు నీ ధనస్సున విముక్తములై, గానం.ఎస్ .పి బాలసుబ్రహ్మణ్యం

19.యమగదా దండమున ఉపాద్యాయమైన, గానం.మాధవపెద్ది

20.రణకోభీదర తానుతార రుచిమద్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

21.రాచబిడ్డకు మరణంబు రణమునందు, గానం.వి.రామకృష్ణ

22.లేరా ఎవరులేరా ధర్మరక్షకులు , గానం.పి . సుశీల

23.వాసిగ భామనో బురద పామునో, గానం.

24.వృద్ధుండౌ వరజా మదద్ధుడనుకొంటే, గానం.వి.రామకృష్ణ

25.జపాకుసుమ సంక్రాశం కాస్యపేయం,(శ్లోకం), గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

26.పద్మాలయం దేవీ మాధవీం మాధవ(శ్లోకం),గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.