అక్షాంశ రేఖాంశాలు: 18°55′24″N 79°27′31″E / 18.92337°N 79.458705°E / 18.92337; 79.458705

క్యాతన్‌పల్లి (మంచిర్యాల జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్యాతన్‌పల్లి
క్యాతన్‌పల్లి is located in Telangana
క్యాతన్‌పల్లి
క్యాతన్‌పల్లి
తెలంగాణ, మంచిర్యాల జిల్లా పటంలో క్యాతన్‌పల్లి స్థానం
క్యాతన్‌పల్లి is located in India
క్యాతన్‌పల్లి
క్యాతన్‌పల్లి
క్యాతన్‌పల్లి (India)
Coordinates: 18°55′24″N 79°27′31″E / 18.92337°N 79.458705°E / 18.92337; 79.458705
భారతదేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామంచిర్యాల
Government
 • Typeపురపాలక సంఘం
 • Bodyక్యాతన్‌పల్లి పురపాలక సంఘం
విస్తీర్ణం
 • Total6.50 కి.మీ2 (2.51 చ. మై)
జనాభా
 (2011 జనాభా)[1]
 • Total32,275
 • జనసాంద్రత5,000/కి.మీ2 (13,000/చ. మై.)
భాష
 • అధికార భాషతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
504301
Vehicle registrationTS

క్యాతన్‌పల్లి, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా , మందమర్రి మండలం లోని చెందిన పట్టణం.[2] క్యాతన్‌పల్లి పట్టణ పరిధిలో మొత్తం 7,850 ఇళ్లకు పైగా పరిపాలనను కలిగి ఉంది.వీటికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను క్యాతన్‌పల్లి పురపాలక సంఘం అందిస్తుంది. సెన్సస్ టౌన్ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా పురపాలక సంఘానికి అధికారం ఉంది. 2016లో జరిగిన తెలంగాణ జిల్లాల,మండలాలు పునర్య్వస్థీకరణకుముందు క్యాతన్‌పల్లి పట్టణం అదిలాబాదు జిల్లాలో ఉండేది.[3] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న క్యాతన్‌పల్లి పురపాలకసంఘంగా ఏర్పడింది.[4]

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం క్యాతన్‌పల్లి పట్టణ పరిధిలో మొత్తం 7,850 కుటుంబాలు నివసిస్తున్నాయి. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 32,385, అందులో 16,773 మంది పురుషులు, 15,612 మంది మహిళలు.[5] క్యాతన్‌పల్లి సగటు సెక్స్ నిష్పత్తి 931.

పట్టణ పరిధిలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2320, ఇది మొత్తం జనాభాలో 7%గా ఉంది. 0 నుండి-6 సంవత్సరాల మధ్య 1223 మంది మగ పిల్లలు ఉండగా, 1097 మంది ఆడ పిల్లలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం క్యాతన్‌పల్లి పిల్లల సెక్స్ నిష్పత్తి 897, ఇది సగటు సెక్స్ నిష్పత్తి (931) కన్నా తక్కువ.2011 జనాభా లెక్కల ప్రకారం క్యాతన్‌పల్లి అక్షరాస్యత రేటు 71.7%గా ఉంది.పురుషుల అక్షరాస్యత రేటు 79.93%, స్త్రీ అక్షరాస్యత రేటు 62.87%గా నమోదుగా ఉంది.[5]

2001 జనాభా లెక్క ప్రకారం క్యాతన్‌పల్లి మొత్తం జనాభా 42275 అందులో పురుషులు 51% ఉండగా,స్త్రీలు 49% మంది ఉన్నారు.[6] క్యాతన్‌పల్లి సరాసరి అక్షరాస్యత రేటు 59%,ఇది జాతీయ సరాసరి అక్షరాస్యత రేటు 59% కన్నా తక్కువ.క్యాతన్‌పల్లి సరాసరి పురుషుల అక్షరాస్యత రేటు 67%,స్త్రీల అక్షరాస్యత రేటు 51%.క్యాతన్‌పల్లిలో 6 సంవత్సరాలలోపు జనాభా 11% మంది ఉన్నారు.

ప్రస్తావనలు

[మార్చు]
  1. 1.0 1.1 "District Census Handbook – mancherial" (PDF). Census of India. pp. 13, 30. Retrieved 10 June 2016.
  2. "Kyathanpalty Municipatity, Mancheriat District GO" (PDF). CDMA Telangana. Archived from the original (PDF) on 2020-07-03. Retrieved 2020-07-03.
  3. https://www.census2011.co.in/data/town/570569-kyathampalle-andhra-pradesh.html
  4. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 13 May 2021.
  5. 5.0 5.1 "Kyathampalle Population, Caste Data Adilabad Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2021-09-18. Retrieved 2020-10-03.
  6. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.

వెలుపలి లంకెలు

[మార్చు]