గల్లా జయదేవ్
గల్లా జయదేవ్ | |||
పదవీ కాలం 2 జూన్ 2014 – 28 జనవరి 2024 | |||
ముందు | రాయపాటి సాంబశివరావు | ||
---|---|---|---|
తరువాత | పెమ్మసాని చంద్రశేఖర్ | ||
నియోజకవర్గం | గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | దిగువమాఘం,చిత్తూరు | 1961 జూన్ 2||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | ఘట్టమనేని పద్మావతి | ||
బంధువులు |
| ||
సంతానం | 2 | ||
వృత్తి | వ్యాపారవేత్త రాజకీయ నాయకుడు | ||
మతం | హిందూ | ||
జూన్ 5, 2014నాటికి |
గల్లా జయదేవ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త, తెలుగుదేశం నాయకుడు. 2014 నుండి గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం సభ్యుడిగా ఉన్నాడు. ఈయన తల్లి [[గల్లా అరుణకుమారి]] మాజీమంత్రి, బావ మహేష్ బాబు నటుడు.
గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం అభ్యర్థిగా గుంటూరు నుండి పోటీ చేసి రెండు సార్లు ఎంపీగా ఎన్నికై 2024 జనవరి 28న రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు.[1][2]
వ్యక్తిగత జీవితం
[మార్చు]గల్లా జయదేవ్ 1961 జూన్ 2 న చిత్తూరు జిల్లా, దిగువమాఘంలో జన్మించాడు. తండ్రి [[గల్లా రామచంద్ర నాయుడు]] ప్రముఖ వ్యాపారవేత్త. ఈయన తిరుపతి సమీపంలో రేణిగుంట మండలం, కరకంబాడి దగ్గర అమరరాజా బ్యాటరీస్ అనే సంస్థ స్థాపించాడు. తల్లి [[గల్లా అరుణ కుమారి]] మాజీ శాసనసభ సభ్యురాలు. మొదట్లో ఈమె కంప్యూటర్ ప్రోగ్రామర్ కూడా పనిచేసింది. 1970 లో జయదేవ్ మూడేళ్ళ వయసులో ఉండగా వాళ్ళ కుటుంబం అమెరికాకు తరలి వెళ్ళింది.[3] 1984 లో తండ్రి భారత్ లో కంపెనీ పెట్టడం కోసం వచ్చేశాడు. అప్పుడు జయదేవ్ ఇల్లినోయ్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. తర్వాత మళ్ళీ పొలిటికల్ సైన్సు, ఎకనమిక్స్ కి మారాడు. ఈయనకు ఒక అక్క, పేరు : రమాదేవి. 1991 లో ప్రముఖ నటుడు కృష్ణ కుమార్తె ఘట్టమనేని పద్మావతితో ఈయన వివాహం జరిగింది.
జయదేవ్ తాత పాతూరి రాజగోపాల నాయుడు ఒక స్వాతంత్ర్య సమర యోధుడు. రెండు సార్లు ఎం. పిగా కూడా పనిచేశాడు.
వృత్తి
[మార్చు]చదువు పూర్తయిన తర్వాత జిఎన్బి అనే బ్యాటరీ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ఈసంస్థ అప్పట్లో అమరరాజాకు సాంకేతిక భాగస్వామి. అందులో రెండేళ్లపాటు పనిచేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ Namaste Telangana (29 January 2024). "రాజకీయాలకు [[గల్లా]] గుడ్‌బై". Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
{{cite news}}
: URL–wikilink conflict (help) - ↑ 10TV Telugu (28 January 2024). "టీడీపీ ఎంపీ [[గల్లా]] జయదేవ్ కీలక నిర్ణయం.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి" (in Telugu). Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
{{cite news}}
: URL–wikilink conflict (help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ సుంకరి, చంద్రశేఖర్. "రాజకీయాలు చిన్ననాటి కల!". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 26 February 2018. Retrieved 26 February 2018.