Jump to content

గవదబిళ్ళలు

వికీపీడియా నుండి
గవదబిళ్ళలు
ఇతర పేర్లుఅంటువ్యాధి పరోటిటిస్
గవదబిళ్లలు ఉన్న పిల్లవాడు
ప్రత్యేకతసంక్రమణ వ్యాధులు
లక్షణాలుజ్వరం, కండరాల నొప్పి, తలనొప్పి, ఆకలి తగ్గిపోతుంది, అనారోగ్యంగా ఉంటుంది , ఒకటి లేదా రెండు పరోటిడ్ లాలాజల గ్రంధులు వాచి నొప్పిగా ఉంటుంది .
సంక్లిష్టతలుమెనింజైటిస్ లేదా ప్యాంక్రియాటైటిస్
సాధారణ ప్రారంభం17 సంక్రమణం తరువాత
కాల వ్యవధి7–10 రోజులు
కారణాలుమంప్స్ వైరస్
రోగనిర్ధారణ పద్ధతిపరోటిడ్ గ్రంధి వాపు లక్షణం, పారోటిడ్ వాహిక స్వాబ్ మీద వైరస్ శ్వాబ్ పరీక్ష . రక్తంలో IgM ప్రతిరోధకాలను పరీక్షించడం
నివారణగవదబిళ్ళల టీకా రెండు మోతాదులు
చికిత్సలక్షణాలకు చికిత్స
ఔషధంపారాసెటమాల్ (ఎసిటమైనోఫెన్) వంటి నొప్పి మందులు
రోగ నిరూపణ10,000 లో ఒకరు మరణం
తరుచుదనముఅభివృద్ధి చెందుతున్న దేశాల్లో

గవదబిళ్ళలు వైరస్ వల్ల వచ్చే వ్యాధి[1]. దీనినే ఆంగ్లంలో మంప్స్ అని వ్యవహరిస్తారు .

సంకేతాలు, లక్షణాలు

[మార్చు]

ప్రారంభంలో తరచుగా జ్వరం, కండరాల నొప్పి, తలనొప్పి, ఆకలి తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. సాధారణంగా అనారోగ్యంగా అనిపిస్తుంది [2][3]. తరువాత ఇది ఒకటి లేదా రెండు పరోటిడ్ లాలాజల గ్రంధులు వాచి బాధాకరం గా ఉంటుంది[4][3]. వైరస్ కు గురి అయిన 16 నుండి 18 రోజుల తర్వాత లక్షణాలు బహిర్గతం అవుతాయి. ఏడు నుండి 10 రోజుల తర్వాత తగ్గుతుంది[2][5]. పిల్లలు కంటే పెద్దవారిలో ఈ లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మూడింట ఒక వంతు మందికి తేలికపాటి లక్షణాలు ఉంటాయి లేదా కొంతమందిలో ఎటువంటి లక్షణాలు ఉండవు[2]. మెనింజైటిస్ (15%), ప్యాంక్రియాటైటిస్ (4%), గుండె వాపు, శాశ్వత చెవుడు, వృషణాల వాపు వంటి సమస్యలు ఉండవచ్చు, ఇది అసాధారణంగా వంధ్యత్వానికి దారితీస్తుంది[2][3]. మహిళలలో అండాశయ వాపు ఏర్పడవచ్చు, కానీ ఇది వారిలో వంధ్యత్వానికి దారితీయదు[4].

కారణాలు, వ్యాధి నిర్ధారణ

[మార్చు]

ఇది అంటువ్యాధి. సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలలో వేగంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ శ్వాసకోశ బిందువులు ద్వారా లేక సోకిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం ద్వారా వ్యాపిస్తుంది[5].మానవులు మాత్రమే వ్యాధికి గురిఅవుతారు, ఇంకా వ్యాప్తి చేస్తారు[2]. పరోటిడ్ లాలాజల గ్రంధుల వాపు ప్రారంభానికి ఏడు రోజుల ముందు నుండి 8 రోజుల తరువాత వరకు వీరికి వైరస్ అంటుకుని ఉంటుంది[6]. ఒకసారి ఒక సంక్రమణం జరిగాక ప్రభావితుడైన ఒక వ్యక్తికి సాధారణంగా జీవితాంతం రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది[2]. తిరిగి సంక్రమించినప్పటికీ తదుపరి సంక్రమణ తేలికపాటిదిగా ఉంటుంది[7]. రోగనిర్ధారణ సాధారణంగా పరోటిడ్ గ్రంధి వాపు కారణంగా నిర్ధారించుతారు. నిర్ధారణ పారోటిడ్ వాహిక స్వాబ్ మీద వైరస్ ను తీసి పరీక్ష ద్వారా కూడా జరుగుతుంది. రక్తంలో IgM ప్రతిరోధకాలను (యాంటీబాడీస్) పరీక్షించడం చాలా ఉపయోగకరంగా ఉండవచ్చు, అయితే, ఒకసారి వచ్చి రోగనిరోధక శక్తిని పొందిన వారిలో ఇది తప్పుగా ప్రతిఫలిస్తుంది[5].

నివారణ

[మార్చు]

గవదబిళ్ళల టీకా రెండు మోతాదుల ద్వారా గవదబిళ్లలను నివారించవచ్చు. చాలా వరకు అభివృద్ధి చెందిన దేశాలలో దీనిని వారి రోగనిరోధక కార్యక్రమాలలో, తరచుగా తట్టు, రుబెల్లా, వరిసెల్లా వ్యాక్సిన్లతో కలిపి ఇస్తారు[2]. తక్కువ రోగనిరోధకత ఉన్న దేశాలు వృద్ధాప్యంలో కేసులలో పెరుగుదల, దుష్ఫలితాలు ఉంటాయి[4]. దీనికి నిర్దిష్ట చికిత్స లేదు[2]. పారాసెటమాల్ (ఎసిటమైనోఫెన్) వంటి నొప్పి మందులతో లక్షణాలను నియంత్రించుతారు. కొన్ని సమస్యలలో ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ ఉపయోగపడుతుంది[4]. మెనింజైటిస్ లేదా ప్యాంక్రియాటైటిస్ సోకితే వైద్యశాలలో చేరాల్సిన అవసరం ఉండవచ్చు[8][7].

వ్యాధి ప్రాబల్యం

[మార్చు]

వ్యాధి సోకిన ప్రతి 10,000 మందిలో ఒకరు మరణిస్తుంటారు. టీకాలు వేయకుండా ఉండడము వలన జనాభాలో సంవత్సరానికి సుమారు 0.1% నుండి 1.0% మంది ప్రభావితమవుతున్నారు[2]. విస్తృతంగా టీకాలు వేయడం వల్ల వ్యాధి కేసులు 90% పైగా తగ్గాయి[9]. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టీకాలు వేయడం సాధారణంగా తక్కువ కాబట్టి గవదబిళ్ళల వ్యాధి ప్రభావం ఇక్కడ సర్వసాధారణం[10]. అయితే, టీకాలు వేసిన జనాభాలో కూడా వ్యాప్తి ఇప్పటికీ సంభవించవచ్చు[4]. ప్రపంచవ్యాప్తంగా టీకా ప్రవేశపెట్టడానికి ముందు, గవదబిళ్ళలను ఒక సాధారణమైన చిన్నపిల్లల వ్యాధి అని భావించారు. సాధారణంగా ప్రతి రెండు నుండి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెద్ద ఎత్తున వ్యాధి వ్యాప్తి చెందుతుంది[11]. ఐదు నుండి తొమ్మిది సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు సాధారణంగా ఈ వ్యాధికి గురి అవుతున్నారు. టీకాలు అమలు చేసిన చోట , 20ల ప్రారంభంలో ఉన్న వారు కూడా తరచుగా ప్రభావితమయ్యారు[4]. ఇది తరచుగా ఏడాది పొడవునా భూమధ్యరేఖ చుట్టూ ప్రతి చోటా సంభవిస్తుంది, అయితే ప్రపంచంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో, ఇంకా శీతాకాలం, వసంతకాలాలలో ఎక్కువగా ఉంటుంది[2]. పారోటిడ్ గ్రంథులు, వృషణాల బాధాకరమైన వాపును క్రీ.పూ. ఐదవ శతాబ్దంలో హిప్పోక్రేట్స్ వివరంచాడు[5][12].

మూలాలు

[మార్చు]
  1. Kirby, Amber K.; Adams, Daniel J. (2022). "11. Mumps". In Jong, Elaine C.; Stevens, Dennis L. (eds.). Netter's Infectious Diseases (in ఇంగ్లీష్) (2nd ed.). Philadelphia: Elsevier. pp. 48–51. ISBN 978-0-323-71159-3. Archived from the original on 2023-10-20. Retrieved 2023-10-02.
  2. 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 "Mumps virus vaccines" (PDF). Weekly Epidemiological Record. 82 (7): 49–60. 16 ఫిబ్రవరి 2007. PMID 17304707. Archived (PDF) from the original on 16 మార్చి 2015.
  3. 3.0 3.1 3.2 Bailey's head and neck surgery—otolaryngology. Johnson, Jonas T., Rosen, Clark A., Bailey, Byron J., 1934- (5th ed.). Philadelphia: Wolters Kluwer Health /Lippincott Williams & Wilkins. 2013. ISBN 9781609136024. OCLC 863599053.{{cite book}}: CS1 maint: others (link)
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 Hviid A, Rubin S, Mühlemann K (March 2008). "Mumps". The Lancet. 371 (9616): 932–44. doi:10.1016/S0140-6736(08)60419-5. PMID 18342688. Archived from the original on 13 September 2020. Retrieved 26 June 2020.
  5. 5.0 5.1 5.2 5.3 Atkinson, William (మే 2012). Mumps Epidemiology and Prevention of Vaccine-Preventable Diseases (12th ed.). Public Health Foundation. pp. Chapter 14. ISBN 978-0-9832631-3-5. Archived from the original on 6 జూలై 2016.
  6. Kutty PK, Kyaw MH, Dayan GH, Brady MT, Bocchini JA, Reef SE, Bellini WJ, Seward JF (15 June 2010). "Guidance for isolation precautions for mumps in the United States: a review of the scientific basis for policy change". Clinical Infectious Diseases. 50 (12): 1619–28. doi:10.1086/652770. PMID 20455692.
  7. 7.0 7.1 Sen2008 SN (2008). "Mumps: a resurgent disease with protean manifestations". Med J Aust. 189 (8): 456–9. doi:10.5694/j.1326-5377.2008.tb02121.x. PMID 18928441. Archived from the original on 25 డిసెంబరు 2014.{{cite journal}}: CS1 maint: numeric names: authors list (link)
  8. Error on call to Template:cite paper: Parameter title must be specified
  9. Patel, Manisha; Gnann, John W. (2020). "345. Mumps". In Goldman, Lee; Schafer, Andrew I. (eds.). Goldman-Cecil Medicine (in ఇంగ్లీష్). Vol. 2 (26th ed.). Elsevier. pp. 2172–2174. ISBN 978-0-323-53266-2. Archived from the original on 26 May 2022. Retrieved 26 May 2022.
  10. Junghanss, Thomas (2013). Manson's tropical diseases (23rd ed.). Oxford: Elsevier/Saunders. p. 261. ISBN 978-0-7020-5306-1. Archived from the original on 13 మే 2016.
  11. Di Pietrantonj, C; Rivetti, A; Marchione, P; Debalini, MG; Demicheli, V (April 2020). "Vaccines for measles, mumps, rubella, and varicella in children". Cochrane Database of Systematic Reviews. 4: CD004407. doi:10.1002/14651858.CD004407.pub4. PMID 32309885.
  12. Hippocrates. Wikisource link to Of the Epidemics. వికీసోర్స్.