Jump to content

గార్లమడుగు

వికీపీడియా నుండి

గార్లమడుగు , ఏలూరు జిల్లా, పెదవేగి మండలం పెదవేగి రెవెన్యూగ్రామ పరిధిలోని కుగ్రామం.[1] ఈ గ్రామం దిబ్బగూడెం సెంటర్ నుండి కవ్వగుంట వెళ్ళే దారిలో ఉన్న ఒక చిన్న ఊరు. ఇక్కడి వ్యవసాయం మెరక పంటల వ్యవసాయం. మొక్కజొన్న, చెరకు, వరి, కొబ్బరి, ప్రొద్దు తిరుగుడు, పామాయిల్ ప్రధాన పంటలు. పెదవేగి మండలంలో పాల దిగుబడిలో ప్రథమ స్థానములో ఉంది. వూళ్ళో ఒక ఉన్నత పాఠశాల, ఒక ప్రాథమిక పాఠశాల ఉన్నాయి.ఒక రామాలయం ఉంది. ఇటీవల ఒక సాయిబాబా గుడి కట్టారు. ఇది చుట్టుపక్కల ఊర్లలో చాలా మంచిపేరు సంపాదించింది. ఇక్కడ ఉన్న ఉన్నత పాఠశాల చాలా పేరు సంపాదించాదానికి ముఖ్యంగా కారకులు ఈ స్కూల్ హెడ్ మాస్టారుగా పని చెసిన నాగెశ్వర రావు గారు. ఇక్కడ చదువుకున్న ఎంతో మంది ఇప్పుడు చాలా ఉన్నత పొజిషన్ లో ఉన్నరు. ఈ స్కూలు చాలా మంది కలెక్టర్లను, ఇమ్జినీర్లను, గవర్నమెంటు ఉద్యోగులను, సిఏ లను తయారు చెయడానికి ఎంతో దొహదపడింది. ఈ ఊరు జీల్లా ముఖ్య పట్టణం ఏలూరుకి 12 కి.మి దూరంలో ఉంది.

గార్లమడుగు గ్రామం ప్రధానవీధి దృశ్యాలు
గార్లమడుగు గ్రామం - ఎడమ:ఉన్నత పాఠశాల, కుడి పైన: ప్రాథమిక పాఠశాల (పునర్నిర్మాణం ప్లాను ఉన్నది), కుడి క్రింద: మధ్యాహ్నభోజనానికి బడిపిల్లలు సిద్ధమౌతున్నారు

మూలాలు

[మార్చు]
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.