గొల్లపల్లి సూర్యారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గొల్లపల్లి సూర్యారావు

చిన్న పరిశ్రమల శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2009

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - 2019
నియోజకవర్గం రాజోలు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 15 ఫిబ్రవరి 1951
తాటిపాక, రాజోలు మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ

గొల్లపల్లి సూర్యారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో పశుసంవర్థక శాఖా మంత్రిగా పని చేశాడు. గొల్లపల్లి సూర్యారావు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

గొల్లపల్లి సూర్యారావు 15 ఫిబ్రవరి 1951లోఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా, రావులపాలెంలో జన్మించాడు.

క్లాస్ స్కూల్ / కాలేజీ ప్రదేశం సంవత్సరం
1 – 5వ తరగతి స్పెషల్ ఎలిమెంటరీ స్కూల్ రావులపాలెం 1962
6 – 10 జిల్లా పరిషత్ పాఠశాల రావులపాలెం 1968
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పి.ఆర్ జూనియర్ కాలేజీ రావులపాలెం 1969
బీఏ అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ 2004
ఎల్‌ఎల్‌బీ ఆంధ్ర యూనివర్సిటీ 2012
ఏం.ఏ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు

రాజకీయ జీవితం

[మార్చు]

గొల్లపల్లి సూర్యారావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అల్లవరం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అల్లవరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2014లో రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి [2] 2019లో ఓడిపోయాడు.

గొల్లపల్లి సూర్యారావు 2024 ఫిబ్రవరి 28న టీడీపీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. TV5 News (6 November 2020). "219 మందితో ఏపీ టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రకటన" (in ఇంగ్లీష్). Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi (27 August 2014). "మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఆహా..ఓహో..." Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
  3. NT News (28 February 2024). "టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా.. వైసీపీలో చేరిక". Archived from the original on 28 February 2024. Retrieved 28 February 2024.