చిరంజీవి (1985 సినిమా)
చిరంజీవి (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.వి.రాజేంద్రన్ |
---|---|
నిర్మాణం | కె. లక్ష్మీనారాయణ కె.వి రామారావు |
తారాగణం | చిరంజీవి, భానుప్రియ, మాగంటి మురళీమోహన్ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | అజయ్ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
చిరంజీవి 1985 ఏప్రిల్ 18 న విడుదలైన టాలీవుడ్ చిత్రం. ఈ చిత్రానికి CV రాజేంద్రన్ దర్శకత్వం వహించాడు.[1] భానుప్రియ చిరంజీవి లతో పాటు, విజయశాంతి ఒక చిన్న పాత్రలో నటించింది. ఇది కన్నడ చిత్రం నానే రాజా (1984) కు రీమేక్.
కథ
[మార్చు]చిరంజీవి (చిరంజీవి) నిజాయితీ గల పోలీసు ఎస్పి (సత్యానారాయణ) కొడుకు. అతడి చిన్నతనంలోనే తల్లి చనిపోతుంది. తండ్రి అతణ్ణి అల్లారుముద్దుగా పెంచాడు. సరదాగా, చలాకీగా ఉండే చిరంజీవికి ఒకే బలహీనత ఉంది - తండ్రిని ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేడు.
అతడు విజయశాంతితో ప్రేమలో పడతాడు. అంతా బాగానే ఉన్న సమయంలో ఏదో సంఘటనలో ఆమె చిరూ తండ్రిని విమర్శిస్తుంది. తట్టుకోలేని చిరు ఆమెను కొడతాడు. ఆ దెబ్బకు ఆమె గోడకు కొట్టుకుని చనిపోతుంది. తప్పు తెలుసుకున్న చిరంజీవి సంఘటనను మరుగుపరచి తండ్రిఉకి తెలియకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. చట్టం నుండి తప్పించుకునే ప్రయత్నంలో చిరు, తాను వెతుకుతున్నది తన కొడుకునే అని తెలియకుండా అతణ్ణి వెంటాడే తండ్రి -మిగతా సినిమా అంతా ఈ దొంగాపోలీసు ఆటే. చివర్లో చిరంజీవి అతడి తండ్రి చేతుల్లోనే మరణిస్తాడు.
భానుప్రియ విజయశాంతి సోదరిగా గుడ్డి పాత్రలో నటించింది.[2]
తారాగణం
[మార్చు]- చిరంజీవిగా చిరంజీవి
- విజయశాంతి
- భానుప్రియ
- కైకాల సత్యనారాయణ
- నూతన్ ప్రసాద్
- రంగనాథ్
- మురళీ మోహన్
- అన్నపూర్ణ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: సి.వి.రాజేంద్రన్
- నిర్మాత: కె లక్ష్మీనారాయణ, కె.వి.రామారావు
- నిర్మాణ సంస్థ: అజయ్ క్రియేషన్స్
- సంగీతం: చక్రవర్తి
- ఛాయాగ్రహణం: వి. జయరాం
పాటలు
[మార్చు]- రాజావై వెలుగు, మా రాజై బ్రతుకు
మూలాలు
[మార్చు]- ↑ Srinivas, S. V. (2009). Megastar: Chiranjeevi and Telugu cinema after N.T. Rama Rao. Oxford University Press. ISBN 978-0-19-569308-9.
- ↑ "Chiranjeevi Cast & Crew, Chiranjeevi Telugu Movie Cast, Actor, Actress, Director". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-08-30.