Jump to content

తాపేశ్వరం

అక్షాంశ రేఖాంశాలు: 16°53′36.168″N 81°55′31.764″E / 16.89338000°N 81.92549000°E / 16.89338000; 81.92549000
వికీపీడియా నుండి
తాపేశ్వరం
తాపేశ్వరం అగస్తీశ్వరాలయం
తాపేశ్వరం అగస్తీశ్వరాలయం
పటం
తాపేశ్వరం is located in ఆంధ్రప్రదేశ్
తాపేశ్వరం
తాపేశ్వరం
అక్షాంశ రేఖాంశాలు: 16°53′36.168″N 81°55′31.764″E / 16.89338000°N 81.92549000°E / 16.89338000; 81.92549000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకోనసీమ
మండలంమండపేట
విస్తీర్ణం6.36 కి.మీ2 (2.46 చ. మై)
జనాభా
 (2011)
7,411
 • జనసాంద్రత1,200/కి.మీ2 (3,000/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు3,661
 • స్త్రీలు3,750
 • లింగ నిష్పత్తి1,024
 • నివాసాలు2,187
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్533340
2011 జనగణన కోడ్587580
శ్రీ ఉమా అగస్త్యేశ్వర స్వామి దేవస్థానము.
గర్భగుడిలోని స్వామివారు.
గర్భగుడిలోని స్వామివారు.
వీరాంజనేయ స్వామి గర్భగుడిలో ఆంజనేయస్వామి విగ్రహము.
తాపేశ్వరంలోని రైసు మిల్లు

తాపేశ్వరం కోనసీమ జిల్లా, మండపేట మండలానికి చెందిన గ్రామం.[2] ఇది మండల కేంద్రమైన మండపేట నుండి 4 కి. మీ. దూరంలో ఉంది. ప్రసిద్ధిగాంచిన మిఠాయి, తాపేశ్వరం కాజా పుట్టినిల్లు ఈ గ్రామమే. ద్వారపూడి-మండపేట దారిలో మండపేటకు ఒక కిలోమీటరు దూరంలో ఈ గ్రామం ఉంది. పంచాయితి గ్రామం. ఈ ఊరికి పశ్చిమంగా తుల్యభాగనది ప్రవహిస్తుంది.

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,695.[3] ఇందులో పురుషుల సంఖ్య 3,341, మహిళల సంఖ్య 3,354, గ్రామంలో నివాస గృహాలు 1,823 ఉన్నాయి.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2187 ఇళ్లతో, 7411 జనాభాతో 636 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3661, ఆడవారి సంఖ్య 3750. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1077 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 88. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587580[4].

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో మూడుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మండపేటలోను, ఇంజనీరింగ్ కళాశాల రాజమండ్రిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల రాజానగరంలోను, పాలీటెక్నిక్‌ బొమ్మూరులోను, మేనేజిమెంటు కళాశాల రామచంద్రపురంలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల మండపేటలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు రాజమండ్రిలోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

తాపేశ్వరంలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో ప్రైవేటు వైద్య సౌకర్యాలు లేవు. డిగ్రీ లేని డాక్టర్లు 9 మంది ఉన్నారు. ఐదు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది . గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

తాపేశ్వరంలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి.ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో రెండు వాణిజ్య బ్యాంకులు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, ఆదివారం, బుధవారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

తాపేశ్వరంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 107 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 25 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 504 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 401 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 103 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

తాపేశ్వరంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 103 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

తాపేశ్వరంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, ఈ ఊరు గోదావరి నది పరీవాహక ప్రాంతంలో వుండటం వలన వరినే పండిస్తారు.వరిని పండించే పొలాలగట్లమీద కొబ్బరిచెట్లను పెంచెదరు.దీనివలన వీరికి అదనంగా కొబ్బరి కాయలనుండి రాబడి లభిస్తుంది

గ్రామంలో దర్శించవలసిన ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీఉమా అగస్తేశ్వర స్వామి దేవస్థానం

[మార్చు]

తాపేశ్వరము కాజాలకన్న ముందుగా ఇక్కడ వున్న శ్రీ అగస్తేశ్వరస్వామి వారి వలన ప్రసిద్ధి చెందినది.ఈగుడిలోని మూలవిరాట్‌ఈశ్వరునుని అగస్తేశ్వరుడను తాపసి (ఋషి) ప్రతిస్టించుటచే ఈ గ్రామం తాపసి ఈశ్వర గ్రామంగా పిలువబడీ క్రమంగా తాపేశ్వరంగా మారిందని కొందరి అభిప్రాయం.అయితే తాపేశ్వరం మొదటి పేరు'వాతాపి పురమని'క్రమంగా ప్రజల నానుడిలో తాపేశ్వరంగా మారిందని మరికొందరి అభిప్రాయం. స్థలపురాణం:అగస్త్య మహర్షి వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులను సంహరించి, ఆ బ్రహ్మహత్య దోషంలనుండి పరిహరంచెంది, నివృత్తి వేసుకొనుటకై ఇచ్చట ఈశ్వర ప్రతిస్ట చేశాడు.ఈ గ్రామంలోనే కాకుండా సమీపంలోని ఆర్తమూరు, మండపేట, వల్లూరు, చెల్లూరు గ్రామాలలో కూడా ప్రతిస్టీంచినట్లు తెలుస్తున్నది.ఇచ్చట స్వామి వారు పశ్చిమ ముఖంగా వున్నారు, తుల్యభాగనది ఉత్తరముఖముగా ప్రవహిస్తువుండుటచే కాశీ క్షేత్రాన్ని దర్శిస్తే కలిగే పుణ్యఫలం ఈస్వామి వారిని దర్శిస్తే కల్గుతుందని విశ్వాసం.ఈ విషయం పండితులచే, పీఠాథిపతులచే శాస్త్రార్త్ధంగా ధ్రువీకరించబడింది.కాశీ క్షేత్రాన్ని దర్శిస్తే కలిగే ముక్తీ ఈ తాపేశ్వ్రం లోని అగస్తేశ్వర స్వామి వారిని దర్శిస్తే కల్గుతుందని శాస్త్రార్త్ధం.శ్రీ స్వామి వారి కళ్యాణం ప్రతి సంవత్సరం జరుపుతారు. గర్భగుడిలోని ఈశ్వర విగ్రహం పక్కనే పార్వతిఅమ్మవారి విగ్రహం ఉంది.స్వామి వారి కళ్యాణమహోత్సావాలు ఆరు రోజులపాటు జరుగును.మొదటి రోజు ధ్వజారోహణము, గజవాహనం పై స్వామి వారి వురేగింపు వుండును, తదనంతరం స్వామి వారి కళ్యాణం జరుగును.రెండోరోజు గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు వుండును.మూడో రోజు స్వామివారి సదస్యం, తదనంతరం సాయంత్రం రథోత్సవము జరుగును.నాలుగో రోజున నెమలి వాహనం పై స్వామి వారి ఉరేగింపు జరుగును.ఐదవరోజున త్రిశూలస్నానం జరుగును.ఆరవరోజున శ్రీ స్వామివారి శ్రీ పుష్పయాగం నిర్వహించబడును.ఈ స్వామి వారిని దర్శించి కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.ఒడిస్సా నుండికూడా భక్తులు వచ్చి ఈ స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు.

శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవస్థానం

[మార్చు]

ఈ గుడికి దాదాపుగా 120 ఏళ్ల చరిత్రవున్నట్లుగా తెలుస్తున్నది.మొదట్లో నిర్మించిన గుడి మైన్‌రోడ్డుకు బాగా దగ్గరిగా వుండటంతో 1992లో పాతగుడిని తొలగించి, చినజీయ్యరు స్వామి వాతి ఆధ్వర్యంలో పున్హప్రతిస్టించారు.ఇక్కడ పలు యాగ్నాలు, హోమాలు పూజలు, ఇతర థార్మిక కార్యక్రమాలు చాలా చురుకుగా జరుగుతుంటాయి.ప్రస్తుతం (ఏప్రిల్‌2012) వున్న ధ్వజ స్తంభం కొద్దిగా పైభాగం పాడైనది.త్వరలో దీనిని తొలగించి నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిస్టించే ఆలోచనలో ఉన్నారు.తాపేశ్వరం కాజాల సృస్టికర్త పోలిశెట్టి సత్తిరాజు తన మొదటి కాజాల దుఖాణం పేరు"భక్తాంజనేయ మిఠాయి దుఖాణం" చాలా సంవత్సరంలపాటు ఆపేరుతోనే కాజాలు తయారు చేశారు

తాపేశ్వరం కాజా

[మార్చు]

నోరూరించే రుచికరమైన కాజాలకు తాపేశ్వరం పుట్టినిల్లు. తాపేశ్వరం కాజా పేరు వింటే ఎంతటి వానికైనా నోరూరి తీరుతుంది. గత 75 సంవత్సరములుగా కాజాల తయారీలో ప్రసిద్ధి చెందిన గ్రామం. ఇక్కడ తయారయ్యే కాజాలకు రుచిలోను, రూపంలోనుగల ప్రత్యేకత కారణంగా తాపేశ్వరం కాజాకు ప్రసిద్ధి కలిగింది. ఈ కాజాకు సృష్టికర్త, రూపశిల్పి పోలిశెట్టి సత్తిరాజు. తాపేశ్వరం గ్రామంలో సుమారు 200 కుటుంబాలవారు ప్రత్యక్షంగా పరోక్షంగా కాజాల తయారీలో ఆదారపడి జీవనం సాగిస్తున్నారు.

ప్రముఖులు

[మార్చు]

పరిశ్రమలు

[మార్చు]

ఈ గ్రామ పరిధిలో ధాన్యపు మిల్లులు ఉన్నాయి.అలాగే మిషనరి భాగాలు తయారుచేయు వర్క్‌షాపువున్నది.

మూలాలు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-05.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-05.
  4. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".