తీస్రీ కసమ్
తీస్రీ కసమ్ | |
---|---|
దర్శకత్వం | బసు భట్టాచార్య |
స్క్రీన్ ప్లే | నాబెందు ఘోష్ ఫనిశ్వర్నాథ్ రేణు (మాటలు) |
దీనిపై ఆధారితం | ఫనిశ్వర్నాథ్ రేణు రాసిన మరే గయే గుల్ఫామ్ అనే కథ |
నిర్మాత | శైలేంద్ర |
తారాగణం | రాజ్ కపూర్ వహీదా రెహమాన్ |
ఛాయాగ్రహణం | సుబ్రతా మిత్రా |
కూర్పు | జి.జి. మాయేకర్ |
సంగీతం | శంకర్ జైకిషన్ శైలేంద్ర హస్రత్ జైపురి (పాటలు) |
నిర్మాణ సంస్థ | ఇమేజ్ మేకర్స్ |
విడుదల తేదీ | 1966 |
సినిమా నిడివి | 159 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
తీస్రీ కసమ్, 1966లో విడుదలైన హిందీ సినిమా. గేయ రచయిత శైలేంద్ర నిర్మించిన ఈ సినిమాకు బసు భట్టాచార్య దర్శకత్వం వహించాడు. హిందీ నవలా రచయిత ఫనిశ్వర్నాథ్ రేణు రాసిన మరే గయే గుల్ఫామ్ అనే చిన్న కథ ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమాలో రాజ్ కపూర్, వహీదా రెహమాన్ జంటగా నటించారు.[1] శంకర్-జైకిషన్ సంగీతం సమకూర్చగా, సుబ్రతా మిత్రా సినిమాటోగ్రఫీ, ఫనిశ్వర్నాథ్ రేణు సంభాషణలు, నబేండు ఘోష్ స్క్రీన్ ప్లే అందించారు.[2]
భారతీయ గ్రామీణ నేపథ్యంలోని సమాజాన్ని చూపించిన సినిమా ఇది. ఎద్దుల బండి నడిపే అమాయక హిరామన్, నౌతంకి కి చెందిన నర్తకి హిరాబాయితో ప్రేమలో పడిన కథ ఇది. జానపద కళల ప్రదర్శనల సందర్భంగా మహిళలను దోపిడీ చేసే సంఘటనల గురించి ఈ సినిమా వివరిస్తుంది.[3] బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా విజయవంతం కానప్పటికి, 14వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది.
నటవర్గం
[మార్చు]- రాజ్ కపూర్ (హిరామన్)
- వహీదా రెహమాన్ (హిరాబాయి)
- దులారి (హిరామన్ వదిన)
- ఇఫ్తేఖర్ (ఠాకూర్ విక్రమ్ సింగ్)
- కేష్టో ముఖర్జీ (శివరాతన్)
- ఎకె హంగల్ (హిరామన్ అన్నయ్య)
- అసిత్ సేన్ (మేళా అనౌన్సర్)
- సిఎస్ దుబే (బిర్జు)
- శైలేంద్ర
నిర్మాణం
[మార్చు]ఈ సినిమా పూర్తవడానికి చాలా ఏళ్ళు పట్టింది. అరారియా జిల్లాలోని ఔరాహి హింగ్నా, భోపాల్ సమీపంలోని బినా అనే పట్టణంలో ఈ సినిమాలోని చాలాభాగం చిత్రీకరణ జరిగింది.[4][5] పోవై సరస్సు సమీపంలో, ముంబైలోని మోహన్ స్టూడియోలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించబడ్డాయి.[6][7] సత్యజిత్ రే తొలి సినిమాలకు ఛాయాగ్రాహకుడు సుబ్రతా మిత్రా మర్చంట్ ఐవరీ సినిమాలు చేయడానికి కొంతకాలం ముంబైకి వెళ్ళాడు.[8][9] నాటకరంగ నటుడు ఎకె హంగల్, ఇప్టా నాటకసంస్థలో సన్నిహితుడైన శైలేందర్ కోరిక మేరకు హిరామన్ అన్నయ్య పాత్రను పోషించడానికి అంగీకరించాడు. సినిమా పొడవును తగ్గించడానికి చివరి ఎడిటింగ్‌లో అతని పాత్ర చాలా వరకు తగ్గించబడింది.[7]
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు: బసు భట్టాచార్య
- కథ, మాటలు: ఫనిశ్వర్ నాథ్ రేణు
- స్క్రీన్ ప్లే: నాబెందు ఘోష్
- నిర్మాత: శైలేంద్ర
- ఎడిటర్: జి.జి.మాయేకర్
- సినిమాటోగ్రాఫర్: సుబ్రతా మిత్రా
- కళా దర్శకుడు: దేశ్ ముఖర్జీ
- కాస్టూమ్స్: పండిట్ శివ్రామ్
- కొరియోగ్రాఫర్: లచు మహారాజ్
- సంగీతం: శంకర్-జైకిషన్
- పాటలు: హస్రత్ జైపురి
- గానం: ఆశా భోస్లే, మన్నా డే, సుమన్ కళ్యాణ్పూర్, లతా మంగేష్కర్, ముబారక్ బేగం, ముఖేష్, శంభు-శంకర్ (కవ్వాల్)
అవార్డులు, నామినేషన్లు
[మార్చు]సంవత్సరం | అవార్డు | విభాగం | గ్రహీత | ఫలితం |
---|---|---|---|---|
1967 | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు | ఉత్తమ చలన చిత్రం | శైలేంద్ర, బసు భట్టాచార్య | గెలుపు |
ఫిలింఫేర్ అవార్డులు | ఉత్తమ గీత రచయిత | శైలేంద్ర | ప్రతిపాదించబడింది | |
మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | గ్రాండ్ ప్రిక్స్ | బసు భట్టాచార్య | ప్రతిపాదించబడింది | |
బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డులు (హిందీ) | ఉత్తమ దర్శకుడు | గెలుపు | ||
ఉత్తమ నటుడు | రాజ్ కపూర్ | గెలుపు | ||
ఉత్తమ నటి | వహీదా రెహమాన్ | గెలుపు |
మూలాలు
[మార్చు]- ↑ "Teesri Kasam (1966)". Indiancine.ma. Retrieved 2021-06-17.
- ↑ Chatterjee 2003, p. 335.
- ↑ Singh 2007, p. 60.
- ↑ "यहां हुई थी फिल्म 'तीसरी कसम' की शूटिंग, रिलीज को हुए 50 साल पूरे". Manohar Kumar. Purnia: Dainik Bhaskar. 25 September 2016. Archived from the original on 2016-12-10. Retrieved 2021-06-17.
- ↑ "Maila Anchal inspirer dead". The Telegraph - Calcutta (Kolkata). January 15, 2011. Archived from the original on 2017-08-14. Retrieved 2021-06-17.
- ↑ Rehman 2014, p. 95.
- ↑ 7.0 7.1 Hangal 1999, p. 95.
- ↑ Srivastava 1988, p. 178.
- ↑ Sinha 2005, p. 131-132.
గ్రంథ పట్టిక
[మార్చు]- Kaur, Raminder; Sinha, Ajay J (2005). Bollyworld: Popular Indian Cinema Through A Transnational Lens. SAGE Publications. ISBN 978-0-7619-3321-2.
- Hangal, A. K. (1999). Life and Times of A.K. Hangal. Sterling Publishers. ISBN 978-81-207-2163-0.
- Gulazāra; Nihalani, Govind; Chatterjee, Saibal (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. ISBN 978-81-7991-066-5.
- Singh, Indubala (2007). Gender Relations and Cultural Ideology in Indian Cinema: A Study of Select Adaptations of Literary Texts. Deep & Deep Publications. ISBN 978-81-7629-989-3.
- Banerjee, Shampa; Srivastava, Anil (1988). One Hundred Indian Feature Films: An Annotated Filmography. Taylor & Francis. ISBN 978-0-8240-9483-6.
- Patel, Bhaichand (2012). Bollywood's Top 20: Superstars of Indian Cinema. Penguin Books India. ISBN 978-0-670-08572-9.
- Kabir, Nasreen Munni; Rehman, Waheeda (2014). Conversations with Waheeda Rehman. Penguin Books Limited. ISBN 978-93-5118-642-7.
బయటి లింకులు
[మార్చు]- "Teesri Kasam Synopsis and Review". Upperstall.
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో తీస్రీ కసమ్