Jump to content

తురకపాలెం (ముప్పాళ్ళ)

వికీపీడియా నుండి
తురకపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం ముప్పాళ్ళ
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

తురకపాలెం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, ముప్పాళ్ళ మండలం రెవెన్యూయేతర లోని గ్రామం .

భౌగోళికం

[మార్చు]

తురకపాలెం గ్రామం ముప్పాళ్ళ నుండి దమ్మాలపాడు వెళ్ళు మార్గమునందు 3 కి మీల దూరంలో ఉంది. ఈ గ్రామం సత్తెనపల్లి (14 కి మీల దూరం) శాసనసభ నియోజకవర్గం, నరసరావుపేట (12 కి మీల దూరం) పార్లమెంటు నియోకవర్గం పరిధిలో ఉంది.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

రవాణా సౌకర్యాలు ప్రత్యేకంగా లేవు. కానీ ప్రజలు సొంత వాహనాలలో లేక ఆటో రిక్షాలలో సమీప పట్టణాలకు ప్రయాణం సాగిస్తుంటారు. మండలం ముప్పాళ్ల నుండి డాంబర్ రోడ్డు సౌకర్యం ఉంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

ఈ గ్రామం అక్షరాస్యతలో 100% సాదింఛినది.

East and West view of the Village

మౌలిక వసతులు

[మార్చు]

విదేశాలలో స్థిరపడినవారి విరాళాలతో కలిసి వరంగల్లుకు చెందిన బాలవిహార్ వారి సహాయంతో చర్చిలో రక్షిత మంచినీటి పథకం మరియూ గ్రామానికి రెండు వైపులా ఆర్చీలు ఏర్పాటు చేశారు. రు.15 లక్షలతో కళ్యాణమంటపం ఏర్పాటు చేస్తున్నారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]
  • దాదాపు 1400 జనాభా ఉన్న ఈ గ్రామ పంచాయతీకి ఇంతవరకూ ఐదుసార్లు ఎన్నికలలు నిర్వహించగా 4 సార్లు సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2013 లో గూడా సర్పంచిని ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు.
  • ఈ గ్రామంలో సిమెంటు రహదారులు, మురుగు కాల్వలు ఏర్పాటు చేసుకొని పారిశుద్ధంలో విశేష శ్రద్ధ కనబరుస్తున్నారు. 2010 లో వ్యక్తిగత మరుగుదొడ్లు, పారిశుద్ధంలో కృషి చేసినందుకు, "నిర్మల్ గ్రామీణ పురస్కారం" లభించింది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

ఈ గ్రామంలోని చర్చి జిల్లాలోనే ఒకటిగా ప్రసిద్ధి చెందినది.

ప్రధాన పంటలు

[మార్చు]

ఈ గ్రామంలో ప్రధాన ఆహార పంట వరి, వాణిజ్య పంటలుగా పత్తి, మిరప, పసుపు, మినుములు, కందులు, మొక్కజొన్న, సుబాబుల్ పండిస్తారు.

గ్రామ ప్రముఖులు

[మార్చు]

పూదోట నీలిమ

[మార్చు]

తురకపాలెం గ్రామానికి చెందిన పూదోట శౌరయ్య, కొండవీటి పాపల కుమార్తె నీలిమకు పర్వతారోహణ అంటే మక్కువ. ఈమె సాఫ్ట్ వేర్ ఇంజనీరు. నీలిమ ముందస్తు శిక్షణ తీసికొని, బెంగుళూరుకు చెందిన ఒక సంస్థ సహకారంతో ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్ళింది. ఆసమయంలో నేపాలులో సంభవించిన భూకంపం కారణంగా ఆమె త్రుటిలో ప్రమాదం నుండి బయటపడింది. ఈమె 2016 ఏప్రిల్ లో, మరియొకసారి ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి శిక్షణ తీసుకుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వ్యాయమ శిక్షణ సంస్థ ద్వారా 15 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందించారు. ఈమె ఇటీవల జమ్మూ కాశ్మీరులోని 6150 మీటర్ల ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించి, ఆ ఘనత సాధించిన తొలి తెలుగు మహిళగా రికార్డు సృష్టించింది.[1]

ఈమె 2016, ఏప్రిల్- 14న చైనా వైపునుండి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహణ యాత్ర ప్రారంభించింది. ఆ క్రమంలో ఈమె చివరి మజిలీకి చేరుకుంది. 2016, మే-12వతేదీ నాటికి ఈమె తన బృందంతో, 7100 మీటర్ల ఎత్తుకు వెళ్లింది. ఇంతకు ముందు ఈమె నేపాల్ దేశంలోని 6450 మీటర్ల ఎత్తయిన మీరా పర్వతాన్ని అధిరోహించింది.ఈమె 2016, మే-23న ప్రపంచంలోని అతి ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి, ఆ ఘనకార్యం సాధించిన తొలి తెలుగు మహిళగా రికార్డులకెక్కింది.

మూలాలు

[మార్చు]
  1. "ఆ ఫీల్‌తోపాటు.. ఫైర్‌ కూడా నీలిమలో ఉంది!". Sakshi. 2018-09-27. Retrieved 2022-06-16.