తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాహితీ పురస్కారాలు (2012)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలు
వ్యవస్థాపిత 1990
మొదటి బహూకరణ 1990
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 20,116

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు అందజేస్తారు.[1]

పురస్కారాలు[మార్చు]

  1. తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2012): 2012 సంవత్సర సాహితీ పురస్కారానికి 10 ఉత్తమ గ్రంథాలు ఎంపికయ్యాయి. 2015లో తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు.[2]
  2. తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2013): 2013 సంవత్సర సాహితీ పురస్కారానికి 10 ఉత్తమ గ్రంథాలు ఎంపికయ్యాయి. 2016, జూలై 13న తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కె.వి. రమణాచారి ఈ సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి. సత్తిరెడ్డి, డా. జుర్రు చెన్నయ్య పాల్గొన్నారు.[3][4]
  3. తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2016): 2016 సంవత్సర సాహితీ పురస్కారానికి 10 ఉత్తమ గ్రంథాలు ఎంపికయ్యాయి. 2019లో తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ ఈ సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు.[5][6]
  4. తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2017): 2017 సంవత్సర సాహితీ పురస్కారానికి 11 ఉత్తమ గ్రంథాలు ఎంపికయ్యాయి. 2019, జూన్ 28వ తేదీన తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ ఈ సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు.[7]
  5. తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2018): 2018 సంవత్సర సాహితీ పురస్కారానికి 10 ఉత్తమ గ్రంథాలు ఎంపికయ్యాయి. 2021, అక్టోబరు 29వ తేదీన తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య తంగెడ కిషన్‌రావు ఈ సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు.[8]
  6. తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2019): 2019 సంవత్సర సాహితీ పురస్కారానికి 10 ఉత్తమ గ్రంథాలు ఎంపికయ్యాయి. 2022, జూలై 7వ తేదీన తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన ఆచార్య ఆర్‌.లింబాద్రి, ఉపకులపతి ఆచార్య తంగెడ కిషన్‌రావు ఈ సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు.[9]
  7. తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2020): 2020 సంవత్సర సాహితీ పురస్కారానికి ఎంపికయిన 11 ఉత్తమ గ్రంథాల వివరాలు 2023, జనవరి 26న తేదీన ప్రకటించబడ్డాయి.[10]
  8. తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2021): 2021 సంవత్సర సాహితీ పురస్కారానికి ఎంపికయిన 10 ఉత్తమ గ్రంథాల వివరాలు 2023, అక్టోబరు 13న తేదీన ప్రకటించబడ్డాయి.[11]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు, హైదరాబాదు (18 June 2019). "తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు". Archived from the original on 18 June 2019. Retrieved 2022-07-08.
  2. నవ తెలంగాణ, స్టోరి (16 June 2015). "ఉత్తమ గ్రంథాలకు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాలు". NavaTelangana. Archived from the original on 21 July 2020. Retrieved 2022-07-08.
  3. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (14 July 2016). "'సమాజానికి నిజమైన వైద్యులు సాహితీవేత్తలే'". www.andhrajyothy.com. Archived from the original on 12 July 2020. Retrieved 2022-07-08.
  4. ఘనంగా సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం, తెలుగువాణి, తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణ, ఏప్రిల్-ఆగస్టు 2016, హైదరాబాదు పుట. 42.
  5. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (23 December 2018). "పది మందికి తెలుగు విశ్వవిద్యాలయ అవార్డులు". www.andhrajyothy.com. Archived from the original on 8 July 2020. Retrieved 2022-07-08.
  6. డైలీహంట్, నమస్తే తెలంగాణ (23 December 2018). "తెలుగు వర్సిటీ 2016 సాహితీ పురస్కారాలు". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2020. Retrieved 2022-07-08.
  7. ఈనాడు, హైదరాబాదు (29 June 2019). "తెలుగువర్సిటీ సాహితీ పురస్కారాల ప్రదానం". Archived from the original on 16 July 2019. Retrieved 2022-07-08.
  8. "తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాల ప్రదానం". EENADU. 2021-10-30. Archived from the original on 2023-01-26. Retrieved 2023-01-26.
  9. "తెలుగు వర్సిటీ-2019 సాహితీ పురస్కారాల ప్రదానం.. సీనియర్ జర్నలిస్టు కృష్ణారావుకు పురస్కారం". Prabha News. 2022-07-07. Archived from the original on 2023-01-27. Retrieved 2023-01-27.
  10. ABN (2023-01-27). "ఉత్తమ రచనలకు గౌరవం". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-01-27. Retrieved 2023-01-27.
  11. "తెలుగు వర్సిటీ 2021 సాహితీ పురస్కారాలు". EENADU. 2023-10-13. Archived from the original on 2023-10-14. Retrieved 2023-10-20.