దేవుడు చేసిన మనుషులు (2012 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవుడు చేసిన మనుషులు
(2012 తెలుగు సినిమా)
దర్శకత్వం పూరీ జగన్నాథ్
నిర్మాణం బివిఎస్ఎన్ ప్రసాద్
కథ పూరీ జగన్నాథ్
చిత్రానువాదం పూరీ జగన్నాథ్
తారాగణం రవితేజ
ఇలియానా
ప్రకాష్ రాజ్
బ్రహ్మానందం
కోవై సరళ
సుబ్బరాజు
సంగీతం రఘు కుంచే
నృత్యాలు అజయ్ సాయి
గీతరచన భాస్కరభట్ల రవికుమార్
సంభాషణలు పూరీ జగన్నాథ్
ఛాయాగ్రహణం శ్యాం కె. నాయుడు
కూర్పు ఎస్.ఆర్. శేఖర్
నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి
పంపిణీ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్
నిడివి 124 నిమిషాలు
భాష తెలుగు

శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకం పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం దేవుడు చేసిన మనుషులు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ, ఇలియానా, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోవై సరళ, సుబ్బరాజు ముఖ్య పాత్రలు పొషించారు. ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందించారు. ఈ చిత్రం కేవలం 2 నెలలలోనే చిత్రీకరణ పూర్తిచేసుకుంది. భారీ అంచనాల నడుమ 2012 ఆగస్టు 15 న విడుదలైన ఈ చిత్రం పరాజయం పాలైంది.[1]

అక్షయ తృతీయ రోజు అలిగిన లక్ష్మి దేవి (కోవై సరళ)ని బుజ్జగించడానికి విష్ణు మూర్తి (బ్రహ్మానందం) చెప్పిన కథతో ఈ సినిమా కథ మొదలవుతుంది. హైదరాబాదులో అనాథగా పెరిగి మధ్యవర్తిగా పనిచేసే రవితేజ (రవితేజ)కి, బ్యాంకాక్లో అనాథగా పెరిగి టాక్సీ డ్రైవరుగా పనిచేసే ఇలియానా (ఇలియానా) మధ్య ప్రేమ పుట్టించడానికి పనిలేని పాపయ్యతో అరటి ‘తొక్క’ వేయిస్తాడు విష్ణుమూర్తి. ఆ తొక్క ద్వారా రవితేజ బ్యాంకాక్ వెళతాడు. ఆ అరటిపండు ఎఫెక్టుతో అనుకోకుండా ఎస్సై సుబ్బరాజు(సుబ్బరాజు) బ్యాంకాక్ డాన్ ప్రకాష్‌ (ప్రకాష్‌రాజ్‌) అనుచరుడుని చంపేస్తాడు. దాంతో ప్రకాష్ రాజ్ నుంచి ప్రాణం ముప్పు ఉన్న సుబ్బరాజు, సెటిల్ మెంట్ రవి ద్వారా, ప్రకాష్ రాజ్ తో సెటిల్ మెంట్ చేసుకోవాలని నిర్ణయించుకోంటాడు. ఇదే క్రమంలో అక్కడ ఇలియానాని కలుస్తాడు. ఆమె బ్యాంకాక్ లో డ్రైవర్‌గా పనిచేస్తుంటుంది. రవితేజ ఆమెతో ప్రేమలో పడుతాడు. ఇద్దరు ప్రేమించుకుని కలుసుకునే సమయంలో కొట్టుకుని విడిపోతారు. ప్రకాష్ ని ఎలా డీల్ చేసాడన్నది ఫస్టాఫ్. సెకండాఫ్ కి వస్తే ఎమ్.ఎస్ నారాయణ తొక్క పాడేయకపోతే ఏం జరుగుతుంది?? అన్న కోణంలో ఇదే కథ కొద్ది పాటి మార్పులతో రిపీట్ అవుతుంది తొక్క వేస్తే వారిద్దరి ప్రేమ సక్సెస్ కాలేదని ‘తొక్క’ వేయకుండా కథని మరోలా నడిపిస్తాడు. చివరికి వారిద్దరు ఎలా కలిసారు?? అనేది మిగతా కథ సారాంశం.

తారాగణం

[మార్చు]

సంగీతం

[మార్చు]

రఘు కుంచె ఈచిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియోను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ‘సోనీ మ్యూజిక్' సొంతం చేసుకుంది. జూన్ 22, 2012హైదరాబాద్‌లో ఆడియో విడుదల చేసారు.

# పాట గాయకులు నిడివి
1 "సుబ్బలక్ష్మి" రఘు కుంచె 04:46
2 "నువ్వేలే నువ్వేలే " శ్రేయా ఘోషల్ 05:07
3 "డిస్టర్బ్ చేత్తన్నాడే" సుచిత్ర 03:41
4 "ఏమి సేతుర" ఉదిత్ నారాయణ్, చిన్మయి 04:02
5 "నువ్వంటే చాలా" అద్నాన్ సామి, జొయానా 04:11
6 "దేవుడా దేవుడా" రఘు కుంచె, అంజనా సౌమ్య 03:24

విశేషాలు

[మార్చు]
  • ఈ చిత్రం యొక్క చిత్రీకరణ దాదాపు బ్యాంకాక్ నగరంలోనే జరిగింది.
  • దాదాపు 90 శాతం పాత్రలకు ఆయా పాత్రధారుల అసలు పేర్లను పెట్టడం తెలుగు సినిమాలో ఇదే మొదటిసారి.
  • ఈ చిత్రం కేవలం 2 నెలలలోనే చిత్రీకరణ పూర్తిచేసుకుంది.

చిత్రికరణ

[మార్చు]

ఈ చిత్రం మార్చి 2, 2012న రామోజీ ఫిలిం సిటీ లో మొదలైంది. ఈ సినిమాని మే 15, 2012 వరకి సింగిల్ షెడ్యూల్ లో పూర్తీ చేసారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను అన్నపూర్ణ స్టూడియో లో మే 30, 2012 వరకు పూర్తీ చేసుకొని ఆగస్టు లో విడుదల చేశారు. పూరి జగన్నాద్ కి దర్శకత్వం పై ఉన్న అనుభవం తో పాటలు, యాక్షన్ సంఘటనలు మినహాయించి కేవలం 35 రోజుల్లో పూర్తీ చేసారు. అంతిమంగా ఈ సినిమా కేవలం రెండు నెలలలో పూర్తీ చేసుకొని రికార్డు సృష్టించింది.

విడుదల

[మార్చు]

ఈ సినిమా ఆగస్టు 15, 2012న విడుదల అయ్యింది.

వసూళ్ళు

[మార్చు]

ఈ సినిమా మెదటి రోజు 55 మిలియన్లను వసూలు చేసింది.

మూలాలు

[మార్చు]
  1. "దేవుడు చేసిన మనుషులు". telugu.filmibeat.com. Retrieved 28 March 2018.