నూతన సంవత్సర రోజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాత సంవత్సరానికి విడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతిస్తున్న 2022 అమలాపురంలో వేసిన ముగ్గు
2013 సంవత్సరానికి విడ్కోలు చెబుతూ 2014 సంవత్సరాన్ని స్వాగతిస్తున్న ముగ్గు

నూతన సంవత్సర రోజు, సంస్కృతి ఒక సంవత్సరం ముగింపు తరువాత మరుసటి సంవత్సర ప్రారంభ రోజు జరుపుకునే ఒక వేడుక.జనవరి 1న నూతన సంవత్సరం జరుపుకుంటాం న్యూ ఇయర్ గా డేగా ప్రపంచం అంతటా సంబరాలు జరుపుకుంటారు.అన్ని నూతన సంవత్సర వేడుకల సంస్కృతికి కొలమానం వార్షిక క్యాలెండర్లు.

చరిత్ర

[మార్చు]

క్రీస్తుపూర్వం 45వ సంవత్సరంలో జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు.ఈ క్యాలెండర్‌ సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి పట్టే సమయం ఆధారంగా దీన్ని రూపొందించాడు. క్యాలెండర్‌ను ప్రవేశపెట్టేప్పుడు సంవత్సరాన్ని మొదలు పెట్టే రోజును సీజర్ ఎంచుకోవాల్సి వచ్చింది.రోమన్లకు జనవరి నెల ప్రముఖమైనది. ఈ దేవత జనస్ పేరిట ఏర్పడిన నెల అది. రోమన్లు ఆరాధించే జనస్‌కు రెండు తలలు. ప్రారంభాల దేవత అని కూడా అంటారు.అందుకే రోమన్లు జనవరి నెలను ఎంచుకున్నారు.అయితే 5వ శతాబ్దంలో రోమన్ల సామ్రాజ్యం పతనమై ఆ స్థానంలో క్రైస్తవం అధికారం చెలాయించింది. అప్పట్లో జనవరి 1వ తేదీ అన్యమత సంప్రదాయంగా చూసేవాళ్లు.చాలా క్రైస్తవ దేశాలు కొత్త సంవత్సరాది మార్చి 25వ తేదీ కావాలని కోరుకున్నాయి.కానీ పోప్ 13వ గ్రెగొరీ 16వ శతాబ్దంలో గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు. క్రైస్తవ దేశాల్లో కూడా కొత్త సంవత్సర దినోత్సవాన్ని జనవరి 1వ తేదీగా పునరుద్ధరించారు.అయితే క్యాథలిక్ చర్చిలతో సంబంధం లేని ప్రొటెస్టెంట్ వర్గానికి చెందిన ఇంగ్లండ్ మాత్రం 1752వ సంవత్సరం వరకూ కొత్త సంవత్సర దినోత్సవాన్ని మార్చి 25నే జరుపుకొంటూ వచ్చింది.అయితే, 1752లో దేశ పార్లమెంటు ఒక చట్టం తీసుకువచ్చి, ఐరోపా‌తో పాటుగా ఇంగ్లండ్ కూడా కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకునేట్లు చేసింది.ప్రస్తుతం చాలా దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్‌నే ఉపయోగిస్తున్నాయి.అందుకే ప్రతి ఏటా డిసెంబరు 31వతేది రాత్రినుంచి ఈ సంబరాలు మొదలు అవుతాయి. ఆ రోజున స్నేహితులు, బంధువులు అందరూ కలుసుకుని విందు వినోదాలు, ఆటపాటలతో కాలం గడుపుతారు.రాత్రి 12 గంటలకు ఒకరికొకరు నూతన సంవత్సర శుభా కాంక్షలు చెప్పుకుంటారు. [1][2][3][4]

ఆధునిక నూతన సంవత్సర వేడుకలు

[మార్చు]
తేది వేడుక పేరు
జనవరి 1 క్రిస్టియన్ న్యూ ఇయర్
జనవరి 14 తూర్పు సంప్రదాయ న్యూ ఇయర్ (యేసు సున్తీ వేడుకలు)
జనవరి 21 చైనీస్ న్యూ ఇయర్ (చంద్ర సంవత్సరం అని కూడా పిలుస్తారు. ఇది ప్రతి సంవత్సరం మొదటి చంద్ర నెలలో జరుగుతుంది)
జనవరి 21 వియత్నామీస్ న్యూ ఇయర్
జనవరి నుండిమార్చి టిబెటన్ న్యూ ఇయర్
మార్చి 14 సిక్కు / నానక్షహి న్యూ ఇయర్ (హోల్లా మొహల్లా అని కూడా పిలుస్తారు)
మార్చి 20 లేదా 21 ఇరానియన్ న్యూ ఇయర్ (దీనిని నోరౌజ్ అని కూడా పిలుస్తారు. ఇది వర్నాల్ విషువత్తు యొక్క కచ్చితమైన క్షణం ఉన్న రోజు)
మార్చి 21 బహీ న్యూ ఇయర్ (నవ్-రోజ్ అని కూడా పిలుస్తారు)
ఏప్రిల్ 1 అస్సిరియన్ న్యూ ఇయర్ (రిష్ నిస్సాను అని కూడా పిలుస్తారు)
ఏప్రిల్ 13 లేదా14 మారిన ప్రకారం జనవరి 14 గతంలో ఏప్రిల్ నెల మధ్యలో చైత్ర మాసం తొలిరోజున తమిళ సంవత్సరాది పండుగను ఘనంగా జరుపుకునేవారు.దీనికి బదులుగా రైతుల దినోత్సవమైన సంక్రాంతిని తమిళుల సంవత్సరాదిగా పాటించాలని తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది.దాని ప్రకారం జనవరి 14 న జరుపబడుతుంది.[5]
ఉగాది పండగ రోజున తెలుగు నూతన సంవత్సరం.ఉగాది, యుగాది అని కూడా అంటారు.[6]
ఏప్రిల్ 14 పంజాబీ న్యూ ఇయర్ (వైశాఖి అని కూడా పిలుస్తారు, పంట నూర్పిడి సంబరాలు జరుపుకుంటారు)
ఏప్రిల్ 13 లేదా 15 థాయ్ న్యూ ఇయర్ (నీరును చిమ్ముకుంటూ సంబరాలు జరుపుకుంటారు)
ఏప్రిల్ 13 లేదా 14 శ్రీలంక నూతన సంవత్సరం (సూర్యుడు మీన రాశి నుండి మేష రాశికి మారినప్పుడు)
ఏప్రిల్ 13 లేదా ఏప్రిల్ 15 కంబోడియన్ న్యూ ఇయర్
ఏప్రిల్ 14 లేదా15 బెంగాలీ న్యూ ఇయర్ (పోహెలా బైసాఖ్ అని కూడా పిలుస్తారు)
అక్టోబర్ లేదా నవంబర్ గుజరాతీ నూతన సంవత్సరం.
అక్టోబర్ లేదానవంబర్ మార్వారీ న్యూ ఇయర్
ముహర్రం 1 ఇస్లామిక్ న్యూ ఇయర్

హిందూ మతం

[మార్చు]

భారతీయ నూతన సంవత్సర తేదీలు ప్రాంతాన్ని బట్టి అనేక వైవిధ్యాలను కలిగి ఉంటాయి, హిందూ క్యాలెండర్ ఆధారంగా ఉంటాయి. హిందూమతం హిందూమతంలో, హిందూ క్యాలెండర్ చాంద్రమాన క్యాలెండర్ అయినందున ఇది ప్రతి సంవత్సరం వేరే రోజున వస్తుంది. వివిధ ప్రాంతీయ సంస్కృతులు సంవత్సరంలో వేర్వేరు సమయాల్లో నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. అస్సాం, బెంగాల్, కేరళ, నేపాల్, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని కుటుంబాలు హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశించినప్పుడు నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు.చాలా ప్రాంతాలలో, హిందూ నూతన సంవత్సరం ఏప్రిల్ నుండి మే నెల మధ్య జరుపుకుంటారు. ఈ వేడుకను సాధారణంగా చైత్ర మాసం మొదటి రోజున జరుపుకుంటారు, రు. ఇది సాధారణంగా ఏప్రిల్ 13 లేదా 14న వస్తుంది. ఈ సమయంలో, హిందువులు కుటుంబ సభ్యులను సందర్శించడం, కొత్త బట్టలు ధరించడం, పండుగ వంటకాలను ఆస్వాదించడం ద్వారా నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు.

తెలుగు నూతన సంవత్సరం ( ఉగాది ), కన్నడ నూతన సంవత్సరం ( యుగాది ) మార్చి (సాధారణంగా), ఏప్రిల్ (అప్పుడప్పుడూ) జరుపుకుంటారు. తమిళనాడులో జనవరి 15 న పొంగల్ అధికారికంగా నూతన సంవత్సరంగా జరుపుకుంటారు .

సిక్కు మతం

[మార్చు]

సిక్కు మతం ప్రకారం, నూతన సంవత్సరం గురునానక్ జన్మించిన మార్చి 14న జరుపుకుంటారు. ఈ రోజున, సిక్కులు ఆలయాలను సందర్శించి, ప్రార్థనలు చేస్తారు.

ఇతర సంప్రదాయాలు

[మార్చు]

దక్షిణ ఆసియాలోని ఇతర ప్రాంతాలలో, నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి వివిధ సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. ఉదాహరణకు, నేపాల్‌లో, నూతన సంవత్సరాన్ని లోసర్‌గా జరుపుకుంటారు, ఇది ఒక రకమైన పంట సెలవుదినం. మలేషియాలో, నూతన సంవత్సరాన్ని చాంగ్ యేక్‌గా జరుపుకుంటారు,

మూలాలు

[మార్చు]
  1. "New Year's Day: Julian and Gregorian Calendars". Sizes.com. 8 May 2004. Archived from the original on 5 ఏప్రిల్ 2016. Retrieved 7 January 2021.
  2. Poole, Reginald L. (1921). The Beginning of the Year in the Middle Ages. Procedings of the British Academy. Vol. X. London: British Academy. Archived from the original on 23 November 2021. Retrieved 24 November 2021 – via Hathi Trust.
  3. Bond, John James (1875). Handy Book of Rules and Tables for Verifying Dates With the Christian Era Giving an Account of the Chief Eras and Systems Used by Various Nations...'. London: George Bell & Sons. p. 91.
  4. "New Year wishes in telugu". Telugu Action. 2023-12-26.
  5. Ghouse, Gulzar. "తమిళనాడులో నూతన సంవత్సరం..నేడే". telugu.webdunia.com. Retrieved 2020-05-09.
  6. "మన నూతన సంవత్సరాది ఉగాదే!". andhrajyothy. Retrieved 2022-01-01.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]

వెలుపలి లంకెలు

[మార్చు]