పక్షము

వికీపీడియా నుండి
(పక్షం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

పక్షము;-అనగా 15 [రోజులకు](లేదా కచ్చితంగా 14 రాత్రులకు) సమానమైన ఒక కాలమానము. ప్రతి నెలలో రెండు పక్షాలుంటాయి: 1.'శుక్ల పక్షం'( శుద్ధ తిధులు, అమావాస్య నుంచి పున్నమి వరకు)రోజు రోజుకూ చంద్రుడితో బాటే వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెలుపు అని అర్థం) 2.'కృష్ణ పక్షం (బహుళ పక్షం: పున్నమి నుంచి అమావాస్య వరకు) : రోజు రోజుకూ చంద్రుడితో బాటే వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నలుపు అని అర్థం).

తిథి

[మార్చు]

వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు, చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉంది. ఒక్కొక్క తిథి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.

పక్షంలోని తిథులు

[మార్చు]
  1. పాడ్యమి (అధి దేవత - అగ్ని)
  2. విదియ (అధి దేవత - బ్రహ్మ)
  3. తదియ (అధి దేవత - గౌరి)
  4. చవితి (అధి దేవత - వినాయకుడు)
  5. పంచమి (అధి దేవత - సర్పము)
  6. షష్ఠి (అధి దేవత - కుమార స్వామి)
  7. సప్తమి (అధి దేవత - సూర్యుడు)
  8. అష్టమి (అధి దేవత - శివుడు)
  9. నవమి (అధి దేవత - దుర్గా దేవి)
  10. దశమి (అధి దేవత - యముడు)
  11. ఏకాదశి (అధి దేవత - శివుడు)
  12. ద్వాదశి (అధి దేవత - విష్ణువు)
  13. త్రయోదశి (అధి దేవత - మన్మధుడు)
  14. చతుర్దశి (అధి దేవత - శివుడు)
  15. పున్నమి/పూర్ణిమ/పౌర్ణమి లేక అమావాస్య (అధి దేవత - చంద్రుడు)

ఇవి కూడా చూడండి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పక్షము&oldid=4272692" నుండి వెలికితీశారు