పద్మాలయ ఆచార్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పద్మాలయ ఆచార్య
జననం1965 సెప్టెంబరు 14
పెంట్లవెల్లి, నాగర్‌కర్నూల్ జిల్లా
నివాస ప్రాంతంనాగర్‌కర్నూల్
వృత్తిఉపాధ్యాయురాలు
ప్రసిద్ధిహరికథ కళాకారిణి
మతంహిందూ
భార్య / భర్తరామచంద్రాచార్య
తండ్రినరసింహాచార్యులు
తల్లిజయలక్ష్మి

పద్మాలయ ఆచార్య తెలంగాణ రాష్ట్రంకు చెందిన హరికథ కళాకారిణి. 1980లో హరికథల ప్రదర్శనలను మొదలుపెట్టిన పద్మాలయ ఆచార్య, దేశ విదేశాల్లో వేలాది ప్రదర్శనలు ఇచ్చింది. 2019లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1][2]

జననం[మార్చు]

పద్మాలయ ఆచార్య 1965, సెప్టెంబరు 14న నరసింహాచార్యులు, జయలక్ష్మి దంపతులకు నాగర్‌కర్నూల్ జిల్లా, పెంట్లవెల్లి గ్రామంలో జన్మించింది. వృతిరీత్యా వీరి తండ్రి నరసింహాచార్య నాగర్‌కూర్నూల్‌లో స్థిరపడ్డారు. ఇంటర్మీడియట్ వరకు నాగర్‌కర్నూలులోనే చదివిన పద్మాలయ, ఉపాధ్యాయ శిక్షణ పొందింది.[3]

ఉద్యోగం - వివాహం[మార్చు]

18వ ఏటనే ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు స్వీకరించి, ఆ తర్వాత డిగ్రీ, పీజీ పూర్తి చేసిన పద్మాలయ... పెద్దముద్దునూరు, నాగనూల్, నాగర్‌కర్నూలు‌, గగ్గుపల్లి, పెద్దూరు, తాడూరులలో పనిచేసింది. 1985లో వనపర్తికి చెందిన రామచంద్రాచార్యతో పద్మాలయ వివాహం అయ్యింది. భర్త పౌరోహితం చేస్తున్నాడు.

హరికథ ప్రస్థానం[మార్చు]

తెనాలికి చెందిన రామిరెడ్డి చెప్పిన హరికథలను విని స్ఫూర్తిపొందిన పద్మాలయ, 1980లో హరికథల ప్రదర్శనలను ఇవ్వడం ప్రారంభించింది. శ్రీకృష్ణలీల, శివలీల, భక్తచుచేల, వినాయకవిజయం, హనుమాన్‌చరిత్ర, కన్యకాపరమేశ్వరీ చరిత్ర, భవననారుషి, ఊరుకొండ మహత్యం, రుక్మిణి కళ్యాణం, వర్తనశాల, గజేంద్రమోక్షం, గోగ్రహణ, పార్వతీ కళ్యాణం, వెంకటేశ్వర కళ్యాణం, సీతా కళ్యాణం వంటివి ప్రదర్శన ఇచ్చింది. భక్యాలు, బడిదొంగ, అల్లరిపిల్లలు, దురాష, గుణపాటం, ప్రత్యక్షపురాణం, దేవతావస్త్రాలు, పరమానందయ్య శిష్యులు వంటి పుస్తకాలను రచించి హరికథలుగా చెప్పింది. దేశవిదేశాలలో ప్రదర్శలు ఇచ్చిన పద్మాలయ, స్త్రీ పాత్రల కంటే పురుష పాత్రలను అధికంగా ప్రదర్శించింది.[4] హరికథా విశారద, మహిళా శిరోమణి, హరికథా విద్వణ్మణి, హరికథా కోవిదా వంటి బిరుదులు కూడా అందుకుంది.

పురస్కారాలు[మార్చు]

  1. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2019 మార్చి 8[5][6]
  2. ఉగాది పురస్కారం, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ,
  3. ఇంటర్నేషనల్‌ ఎక్సలెన్స్‌ అవార్డు - వేవ్‌ రిజోనెన్స్‌ ఈవెంట్స్‌ సంస్థ, దుబాయ్‌

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (9 March 2019). "మహిళల ఆలోచనలకు అండగా నిలువాలి". Archived from the original on 9 March 2019. Retrieved 28 April 2020.
  2. ఈనాడు, తెలంగాణ. "ప్రతిభావంతులైన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు". www.eenadu.net. Archived from the original on 28 ఏప్రిల్ 2020. Retrieved 28 April 2020.
  3. డైలీహంట్, నవ తెలంగాణ (22 January 2019). "జానపద కళలకు జీవం పోస్తూ..." Archived from the original on 8 మార్చి 2020. Retrieved 28 April 2020.
  4. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (26 May 2016). "హరికథకు 'పద్మాలయ'". www.andhrajyothy.com. Archived from the original on 8 మార్చి 2020. Retrieved 28 April 2020.
  5. వార్త (7 March 2019). "మహిళలకు తెలంగాణ ప్రభుత్వం పురస్కారాలు". Archived from the original on 8 మార్చి 2019. Retrieved 28 April 2020.
  6. నమస్తే తెలంగాణ, జిందగీ (8 March 2019). "యత్ర నార్యస్తు పూజ్యంతే." Archived from the original on 8 మార్చి 2019. Retrieved 28 April 2020.