పాత ప్రపంచం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
       పాత ప్రపంచం
"ఓల్డ్ వరల్డ్" మ్యాపు (2 వ శతాబ్దపు టోలెమీ ప్రపంచ పటం -15 వ శతాబ్దపు కాపీ)

ఆఫ్రికా, ఆసియా, యూరప్ లను (ఆఫ్రో-యురేషియా లేదా ప్రపంచ ద్వీపం) కలిపి పాత ప్రపంచం (ఓల్డ్ వరల్డ్) అని అంటారు. ఈ పదాన్ని ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో వాడతారు.[1] 'కొత్త ప్రపంచాన్ని' (అమెరికా ఖండాలు, ఓషియానియా) కనుక్కోవడానికి ముందు తమకు తెలిసిన ప్రపంచాన్నంతటినీ వాళ్ళు 'పాత ప్రపంచం' అని పిలిచేవారు.[2]

పద చరిత్ర

[మార్చు]

పురావస్తు శాస్త్రం, ప్రపంచ చరిత్రల సందర్భంలో, కాంస్య యుగం నుండి (పరోక్ష) సాంస్కృతిక సంబంధం కలిగి ఉన్న ప్రాంతాలన్నీ "పాత ప్రపంచం" అనే పదంలోని భాగమే. ఈ సంబంధం కారణంగా తొలి నాగరికతలు సమాంతరంగా విలసిల్లాయి. ఈ నాగరికతలు ఎక్కువగా సుమారు 45 వ, 25 వ అక్షాంశాల మధ్య ఉన్న సమశీతోష్ణ మండలంలో - మధ్యధరా, మెసొపొటేమియా, పర్షియన్ పీఠభూమి, భారత ఉపఖండం, చైనాల్లో - ఉన్నాయి.

ఈ ప్రాంతాలు సిల్క్ రోడ్ వాణిజ్య మార్గం ద్వారా అనుసంధానమై ఉండేవి. ఈ ప్రాంతాల్లో కాంస్య యుగం ముగిసాక వచ్చిన ఇనుప యుగం బాగా వర్ధిల్లింది. సాంస్కృతిక పరంగా, ఇనుప యుగాన్ని యాక్సియల్ ఏజ్ అని పిలిచేవారు. పాశ్చాత్య (హెలెనిజం, " క్లాసికల్ "), ప్రాచ్య (జొరాస్ట్రియన్, అబ్రహామిక్), దూర ప్రాచ్య (హిందూ మతం, బౌద్ధం, జైనం, కన్ఫ్యూషియనిజం, టావోయిజం) సాంస్కృతిక కేంద్రాలు రూపుదిద్దుకునేందుకు మార్గం వేసిన సాంస్కృతిక, తాత్విక, మతపరమైన పరిణామాలను యాక్సియల్ ఏజ్ అనే పదం సూచిస్తుంది.

చరిత్ర

[మార్చు]

పాత ప్రపంచంలో మూడు ఖండాలున్నాయనే (ఆసియా, ఆఫ్రికా,ఐరోపా) భావన ప్రాచీన కాలం నాటిది. టోలెమీ, పురాతన కాలం నాటి ఇతర భౌగోళిక శాస్త్రవేత్తలూ దీని సరిహద్దులను నైలు, డాన్ నదుల వెంట గీసారు. ఈ నిర్వచనం మధ్య యుగాలలోను, ప్రారంభ ఆధునిక కాలంలోనూ ప్రాచుర్యంలో ఉండేది.

ఇతర పేర్లు

[మార్చు]

ఆఫ్రో-యురేషియా ప్రధాన భూభాగాన్ని (బ్రిటిష్ దీవులు, జపాన్, శ్రీలంక, మడగాస్కర్, మలయ్ ద్వీపసమూహం వంటి ద్వీపాలను మినహాయించి) "ప్రపంచ ద్వీపం" అని పిలిచారు. ఈ పదాన్ని సర్ హాల్ఫోర్డ్ జాన్ మాకిండర్ తన ది జియోగ్రాఫిక్ పివట్ ఆఫ్ హిస్టరీ పుస్తకంలో కాయించాడు . [3]

పాత ప్రపంచం లోని కొన్ని సంస్కృతుల్లో ఈ పదానికి సమానమైన పదాలు ఉన్నాయి. జర్మను కాస్మాలజీలో మిడ్‌గార్డ్ అనే పేరుతోను, గ్రీకులు ఓకోమెనే అనే పేరుతోనూ పాత ప్రపంచాన్ని ప్రస్తావించారు.

మూలాలు

[మార్చు]
  1. "Old World". Merriam-Webster Dictionary. Archived from the original on 2 April 2019. Retrieved 3 December 2014.
  2. "New world". Merriam-Webster Dictionary. Archived from the original on 2 April 2019. Retrieved 2 April 2013.
  3. See Francis P. Sempa, "Mackinder's World." Archived 2016-03-03 at the Wayback Machine American Diplomacy (UNC.edu). Retrieved 2018-09-08.