పూసపాటి కృష్ణంరాజు
స్వరూపం
పూసపాటి సూర్యవెంకట కృష్ణంరాజు | |
---|---|
జననం | |
మరణం | 1994 నవంబరు 18 | (వయసు 66)
విద్య | 11వ తరగతి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలుగు కథా రచయిత |
గుర్తించదగిన సేవలు | సీతాలు జడుపడ్డది, దివాణం సేరీవేట |
పూసపాటి కృష్ణంరాజు (ఆగష్టు 20, 1928 - నవంబరు 18, 1994) తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి వహించిన కథా రచయిత.
జీవిత విశేషాలు
[మార్చు]కృష్ణంరాజుగారు 1928, ఆగష్టు 20 న విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో జన్మించారు. 1948లో ఎస్టేట్ అబాలిషన్ ఆక్ట్ (జమీందారీ రద్దు చట్టం) వల్ల ఆస్తులు పోయినా, ఆభిజాత్యాలు పోని కుటుంబాలను దగ్గరనుంచి చూశారు. ఉన్నతవిద్య లేకపోయినా, విశాఖ కాల్టెక్స్ రిఫైనరీ, మద్రాస్ రిఫైనరీస్లలో పైప్లైన్ నిర్మాణాలలో ముఖ్యపాత్ర వహించేరు. నటుడు, నాటక రచయిత, నాటక ప్రయోక్త కూడా[1].
రచనలు
[మార్చు]పూసపాటి కృష్ణంరాజు కొన్ని కథలే[2] వ్రాసినా అన్ని కథలూ పాఠకాభిమానాన్నిచూరగొన్నాయి.
కథాసంపుటాలు
[మార్చు]- దివాణం సేరీవేట
- సీతాలు జడుపడ్డది
- ఈ తరం కోసం కథాస్రవంతి - పూసపాటి కృష్ణంరాజు కథలు (అరసం ప్రచురణ)
కథలు
[మార్చు]- ఏనుగుకి చావులేదు
- కుక్కలు కుక్కలు
- కుక్కుట చోరులు
- కేరమ్ బోర్డు
- గుండం
- తెల్లరాజు నల్లదొర
- దారితప్పినా మాట తప్పినా
- దిగులు
- దివాణం సేరీవేట
- పడిపోయిన కొంపలు
- పేరంటం గుండం
- భూతాల స్వర్గం
- మహారాజ యోగం
- రెండు బంట్లు పోయాయి
- సామంతం
- సీతాలు జడుపడ్డది
మరణం
[మార్చు]కృష్ణంరాజుగారు అరవై ఆరేళ్ళుదాటాక 1994, నవంబరు 18 న మరణించారు[1].
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 జంపాల చౌదరి. "దివాణం సేరీవేట – పూసపాటి కృష్ణంరాజు చెప్పిన అలరాచపుటిళ్ళ కథలు". పుస్తకం.నెట్. Archived from the original on 23 మార్చి 2016. Retrieved 11 June 2020.
- ↑ కాళీపట్నం రామారావు. "రచయిత: పూసపాటి సూర్యవెంకట కృష్ణంరాజు". కథానిలయం. కాళీపట్నం రామారావు. Archived from the original on 11 జూన్ 2020. Retrieved 11 June 2020.