విమానం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38: పంక్తి 38:
<!-- వర్గాలు -->
<!-- వర్గాలు -->
[[వర్గం:వాహనాలు]]
[[వర్గం:వాహనాలు]]
[[వర్గం:విమానాలు]]


<!-- ఇతర వికీ లింకులు -->
<!-- ఇతర వికీ లింకులు -->

08:33, 1 అక్టోబరు 2008 నాటి కూర్పు

ఎయిర్ ఫ్రాన్స్‌కు చెందిన బోయింగ్ 777, అత్యాధునిక పాసెంజర్ జెట్.
ప్రొపెల్లర్ సాయంతో నడిచే సెస్నా 177.

విమానం (Aeroplane) అనేది సాధారణ వాడుకలో గాలిలో ప్రయాణించడానికి వీలుగా తయారుచేయబడిన వాహనము. విమానాన్ని సాంకేతిక పరిభాషలో ఫిక్స్డ్-వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ (fixed-wing aircraft) అని అంటారు. ఇతర విమానాలతో (rotary-wing aircraft or ornithopters) వీటిని వేరు చేయడానికి అనువుగా ఈ పదాన్ని వాడతారు. ఫిక్స్డ్-వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ గాలికంటే బరువైనదై ఉండడంతో పాటు రెక్కలు ఎగరడానికి కావాలసిన శక్తిని విమానానికి ఇవ్వలేవు. వీటినే ఎయిర్‌ప్లేన్‌లు అని ఉత్తర అమెరికాలో(యు.ఎస్. మరియు కెనడా), ఏరోప్లేన్‌లు అని కామన్‌వెల్త్ దేశాల్లో (ఒక కెనడా తప్ప) మరియు ఐర్లాండ్లో వ్యవహరిస్తారు. ఈ పదాలు గ్రీకు భాష నుండి ఆవిర్భవించాయి. గ్రీక్ భాషలో αέρας (ఏరాస్) అనగా "గాలి" అని అర్థం[1]. 1903లో రైట్ సోదరులు "ఏరోప్లేన్" అన్న పదాన్ని ఒక రెక్కను వివరించడానికి మాత్రమే వాడారు [2], కాని అది పూర్తి విమానానికి పేరుగా వాడుకలోకి వచ్చింది.

పని చేసే సూత్రం

గాలిలో ప్రయాణించే ఏ వస్తువు మీదైనా ప్రధానంగా నాలుగు బలాలు పని చేస్తాయని శాస్త్రజ్ఞుడు జార్జి కేలీ సూత్రీకరించాడు. అవి

  1. పైన ప్రయాణిస్తుండే వస్తువును నిరంతరం కిందకు లాగుతుండే గురుత్వాకర్షణ శక్తి అదే దాని బరువు
  2. ఈ బరువుకు వ్యతిరేకంగా అది కిందకు పడిపోకుండా నిరంతరం దాన్ని పైకి లేపుతూ అది తేలుతూ ఉండేలా చూసే బలం రెండోది. అదే లిఫ్ట్. విమాన యానానికి అత్యంత కీలకమైన బలం. దాని బరువుకు వ్యతిరేకంగా బరువు కంటే ఎక్కువగా పని చేస్తున్నపుడే అది తేలుతుంది. పైపైకి లేస్తుంటుంది. ఈ బలాన్ని రెక్కలు సృష్టించాలి. విమానం చలన వేగాన్ని పెంచడం ద్వారా లేదా రెక్కల కోణాన్ని మార్చడం ద్వారా ఈ లిఫ్ట్ బలాన్ని పెంచవచ్చు. కిందకు లాగే బరువు పైకి లేపే లిఫ్ట్ సరి సమానంగా ఉంటే విమానం గాలిలో అక్కడే తేలుతుంటుంది. లిఫ్ట్ ఎక్కువైతే విమానం పైకి లేస్తుంది. తక్కువైతే కిందకు దిగుతుంది.
  3. విమానాన్ని బలంగా ముందుకు లాక్కుపోతుండే బలం... థ్రస్ట్. విమానం లోని ఇంజన్ , ప్రొఫెల్లర్లు గాలిని వేగంగా వెనక్కి నెడుతూ ఈ గుంజుడు బలాన్ని సృష్టిస్తాయి.
  4. ఇదే సమయంలో ఆ ఎదురు గాలి సృష్టించే అవరోధం నాలుగోది. అదే డ్రాగ్. ఈ డ్రాగ్ కంటే కూడా దాన్ని ముందుకు లాగే బలం (థ్రస్ట్) ఎక్కువగా ఉంటేనే విమానం ముందుకు సాగిపోతుంది.

విమానాల్లో రకాలు

గ్లైడర్‌లు

ప్రొపెల్లర్ విమానాలు

జెట్ విమానాలు

రాకెట్‌తో నడిచే విమానం

Bell X-1A గాలిలో ఎగురుతున్నప్పటి దృశ్యం.

రామ్‌జెట్ విమానం

USAF Lockheed SR-71 Blackbird trainer

స్క్రామ్‌జెట్ విమానం

The X-43A, shortly after booster ignition

రిఫరెన్సులు

  1. "Aeroplane", Oxford English Dictionary, Second edition, 1989.
  2. U.S. Patent 821,393 — Wright brothers' patent for "Flying Machine"

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=విమానం&oldid=341001" నుండి వెలికితీశారు