ప్రపంచ తెలుగు మహాసభలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల చిహ్నం

ప్రపంచ తెలుగు మహాసభలు [1] దేశ విదేశాలలోని తెలుగు భాష ప్రజలను ఒకే వేదికమీద కలిపే సమావేశం. దీనిలో తెలుగుభాషాభివృద్ధికి ఎదుర్కొంటున్న సమస్యలు, కళా ప్రదర్శనలు వుంటాయి.

ప్రపంచ తెలుగు మహాసభల చిహ్నం తెలుగుజాతిని వివిధ కొణాలలో ఆవిష్కరిస్తున్నది. ఇందులోని రెండు సర్పాలు తెలుగువారి విజ్ఞానానికి సంకేతాలు. నౌక శాతవాహన కాలంలోనే ఆంధ్రుల నౌకా నైపుణ్యానికి చిహ్నం. పూర్ణకుంభం బౌద్ధయుగంలోను, ఓరుగల్లు ద్వారం కాకతీయయుగంలోను తెలుగువారి ప్రాభవాన్ని తెలియజేస్తుంది. దీనిలోని హంస క్షీరనీర న్యాయానికి, భారతీయుల ఆత్మతత్త్వానికి ప్రతీక. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం, రాజధాని హైదరాబాదు నగరం భారతదేశపు రేఖాచిత్రంలో నిక్షిప్తమై తెలుగుజాతి మనుగడను స్పష్టం చేస్తున్నాయి. భారతదేశపు త్రిభాషా సూత్రం తెలుగు, హిందీ, ఇంగ్లీషు లిపులలో అక్షరరూపం దాల్చింది.

మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు (1975)

[మార్చు]
తెలుగు భాష పోస్టు స్టాంపు

1975లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు - హైదరాబాదు లో జరిగాయి. ఆ సందర్భంగా ఎందరో తెలుగు ప్రముఖుల్ని సన్మానించారు. కొన్ని ముఖ్యమైన పుస్తకాల్ని ప్రచురించారు. ఆనాటి సభల జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్ళను విడుదలచేసింది.

రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు (1981)

[మార్చు]

1981లో రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు - కౌలాలంపూర్, మలేషియా లో జరిగాయి.

మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు (1990)

[మార్చు]

మారిషస్ లోమూడవ ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబరు 8వ తేదీ నుండి మూడు రోజుల పాటు వైభవంగా జరిగాయి. మారిషస్ ప్రభుత్వ సహకారంతో అక్కడి తెలుగు కల్చరల్ ట్రస్టు, తెలుగు విశ్వవిద్యాలయం కలిసి, ఇందిరా గాంధీ సాంస్కృతిక కేంద్రంలో వీటిని నిర్వహించారు.[2]

నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (2012)

[మార్చు]

2012లో నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు- తిరుపతి, డిసెంబరు 27-29, 2012 లో జరిగాయి. ఇది సంయుక్త ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగిన చివరి సభ.

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలు - 2017ను తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమి నిర్వహణలో డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదురోజులపాటు నిర్వహించింది.[3]

ఇతర సభలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ప్రపంచ తెలుగుమహాసభల జాలస్థలి
  2. మారిషస్ లో తెలుగు వైభవం, ఆంధ్రప్రదేశ్, జనవరి 2012 సంచికలో కిలారు ముద్దుకృష్ణ వ్యాసం ఆధారంగా.
  3. Zee News Telugu (4 January 2018). "2017లో తెలుగు సాహితీ పరిమళాలు..!". Archived from the original on 20 March 2022. Retrieved 20 March 2022.
  4. "ఐదవ ప్రపంచ తెలుగు మహాసభలు జాలస్థలి". Archived from the original on 2009-08-03. Retrieved 2009-08-15.