అక్షాంశ రేఖాంశాలు: 16°55′39″N 81°40′25″E / 16.92750°N 81.67361°E / 16.92750; 81.67361

బ్రాహ్మణగూడెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రాహ్మణగూడెం
బ్రాహ్మణగూడెం ఉన్నత పాఠశాల
బ్రాహ్మణగూడెం ఉన్నత పాఠశాల
పటం
బ్రాహ్మణగూడెం is located in ఆంధ్రప్రదేశ్
బ్రాహ్మణగూడెం
బ్రాహ్మణగూడెం
అక్షాంశ రేఖాంశాలు: 16°55′39″N 81°40′25″E / 16.92750°N 81.67361°E / 16.92750; 81.67361
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతూర్పు గోదావరి
మండలంచాగల్లు
విస్తీర్ణం3.79 కి.మీ2 (1.46 చ. మై)
జనాభా
 (2011)[1]
5,499
 • జనసాంద్రత1,500/కి.మీ2 (3,800/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు2,742
 • స్త్రీలు2,757
 • లింగ నిష్పత్తి1,005
 • నివాసాలు1,571
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్534301
2011 జనగణన కోడ్588291

బ్రాహ్మణగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, చాగల్లు మండలానికి చెందిన గ్రామం.. ఇది నిడదవోలు పట్టణానికి (పంగిడి వెళ్ళే మార్గంలో) 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమహేంద్రవరం పట్టణానికి ఈ గ్రామం సుమారుగా 20 కి.మీ. దూరంలో ఉంది. చాలా మంది ఈ ఊరి పేరుని చూసి ఇక్కడ అందరూ బ్రాహ్మణులే ఉంటారనుకుంటారు. కాని ఇక్కడ అలాగేమీ ఉండదు. అన్ని ఊళ్లలో ఉన్నట్లే తగు మాత్రం బ్రాహ్మణులు ఉంటారు. ఈ ఊరి మొత్తం ప్రజలలో సుమారు 90% వ్యవసాయం మీద అధారపడి జీవిస్తున్నారు. ఈ ఊరు పారిశ్రామికంగా కూడా కొంతవరకు అభివృధ్ధి చెందింది. ఈ గ్రామం చాగల్లు మండలం లోని ఒక మేజర్ పంచాయతి. ఈ ఊరి జనాభా సుమారుగా 12,000 వరకూ ఉంటుంది. ఇది మండల కేంద్రమైన చాగల్లు నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నిడదవోలు నుండి 2 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1571 ఇళ్లతో, 5499 జనాభాతో 379 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2742, ఆడవారి సంఖ్య 2757. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1539 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 27. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588291[2].గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.బ్రాహ్మణగూడెంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నిడదవోలులోను, ఇంజనీరింగ్ కళాశాల, సమీప వైద్య కళాశాల, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల రాజమహేంద్రవరం లోనూ, పాలీటెక్నిక్‌ తణుకులోను, మేనేజిమెంటు కళాశాల కొవ్వూరులోనూ ఉన్నాయి. అనియత విద్యా కేంద్రం చాగల్లులోను, ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

బ్రాహ్మణగూడెంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

బ్రాహ్మణగూడెంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

బ్రాహ్మణగూడెంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 80 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 18 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 280 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 81 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 198 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

బ్రాహ్మణగూడెంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 146 హెక్టార్లు
  • ఇతర వనరుల ద్వారా: 52 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

బ్రాహ్మణగూడెంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, చెరకు

పారిశ్రామిక ఉత్పత్తులు

[మార్చు]

బియ్యం, పాల్మ్ నార

చరిత్ర

[మార్చు]

పూర్వం "బాపన్న" అనే వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చి మొదట నివాసం ఏర్పరుచుకున్నాడు. తరువాత కాలక్రమేణా చాలామంది వచ్చి నివాసముండటం ప్రారంభించారు. ఐతే మొదట బాపన్న వచ్చాడు కాబట్టి ఈప్రాంతాన్ని అతని పేరుమీదుగానే "బాపన్నగూడెం" అని పిలుస్తూ వచ్చారు కాల క్రమేణా అది బ్రాహ్మణగూడెంగా మార్పు చెందింది.

గ్రామ సర్పంచ్‌ల జాబితా

[మార్చు]
బ్రాహ్మణగూడెం పంచాయతీ కార్యాలయం
  1. మాధవరెడ్డి రామారావు (31-3-1944 నుండి 22-6-1952)
  2. ఆత్కూరి అప్పారావు (25-1-1953 నుండి 10-5-1956)
  3. గారపాటి రాజన్న (11-5-1956 నుండి 20-9-1959)
  4. గారపాటి బులిమునియ్య కుమారుడు సుబ్బారావు (28-9-59 నుండి 10-6-1970)
  5. గారపాటి ఆచార్యులు కుమారుడు సుబ్బారావు (11-6-1970 నుండి 27-4-1974)
  6. గారపాటి మునీశ్వర రావు (8-5-1974 నుండి 30-5-1981)
  7. గారపాటి భాస్కర రావు (31-5-1981 నుండి 24-10-1983)
  8. మాధవరెడ్డి తాతారావు (29-6-1984 నుండి 30-3-1988)
  9. గారపాటి సత్యనారాయణ (31-3-1988 నుండి 20-10-95)
  10. గారపాటి శివ రామ కృష్ణ (21-10-1995 నుండి 16-8-2001)
  11. గారపాటి పద్మావతి (17-8-2001 నుండి 22-8-2006)
  12. కొయ్యే వెంకట్రావు (దావీదు) (23-8-2006 నుండి 23-8-2011)
  13. తమ్మినేని లక్ష్మి (28-7-2013 నుండి

గ్రామంలో సౌకర్యాలు

[మార్చు]
బ్రాహ్మణగూడెం ఉప్పుగుంట చెరువు

గ్రామీణ గ్రంథాలయం, 3 కమ్యూనిటి హాళ్ళు, పశు వైద్యశాల, త్రాగునీటి అవసరాల కోసం 3 రక్షిత మంచినీటి టాంకులు ఉన్నాయి.

ఊరి వ్యవసాయం కోసం 3 చెరువులు ఉన్నాయి. అవి - ఉప్పుగుంట చెరువు, ప్రత్తిపాటి చెరువు, రావుల చెరువు.

రవాణా సౌకర్యాలు

[మార్చు]
రైల్వే స్టేషను
  • ఊరికి పాసింజరు బళ్ళకోసం చిన్న హాల్ట్ రైల్వే స్టేషను ఉంది.
  • బస్టాండ్ ఉంది.

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5577.[3] ఇందులో పురుషుల సంఖ్య 2786, మహిళల సంఖ్య 2791. గ్రామంలో నివాస గృహాలు 1392 ఉన్నాయి.

దేవాలయాలు

[మార్చు]
వెంకటేశ్వరస్వామి వారి దేవాలయము

గ్రామంలో కల కొన్ని దేవాలయాలు

  1. పంచాయతన రామలింగేశ్వర దేవస్థానం (శివాలయం),
  2. శ్రీ సీతారామస్వామి దేవస్థానం (రామాలయం),
  3. నాగారమ్మ (గ్రామదేవత) దేవాలయం,
  4. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవస్థానం,
  5. శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి దేవస్థానం
  6. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం,
  7. శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం,
  8. శ్రీ వెంకటేశ్వర దేవస్థానం,
  9. శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం

ఈ వూరిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు.


పరిశ్రమలు

[మార్చు]

ఊరిలో పరిశ్రమల పరంగా మంచి అభివృద్ధి ఉంది.

  • 6 పెద్ద రైస్ మిల్లులు
  • 3 భారీ పౌల్ట్రీ ఫారాలు
  • 2 కోకోనట్ ప్రోసెసింగ్ యూనిట్లు
  • 1 ఇంజనీరింగ్ కంపెనీ
  • 1 ఎగ్ ట్రే తయారీ యూనిట్ ఉన్నాయి

గ్రామ విశేషాలు

[మార్చు]

ఇక్కడి ప్రకృతి చాలా రమణీయంగా ఉంటుంది. ఊరి చుట్టూ చెరువులు, చెట్లు, గట్లూ చాలా అందంగా కనిపిస్తాయి. కనుకనే ఇ.వి.వి.లాంటి దర్శకులు ఇక్కడ సినిమాలు తీశారు. ఇ.వి.వి.సత్యనారాయణ నువ్వంటే నాకిష్టం అనే చలన చిత్రం చాలా భాగం ఈ ఊరిలోనే చిత్రీకరించాడు .

గ్రామ సమస్యలు

[మార్చు]
  1. ఈ ఊరి ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలంటే ఇక్కడకు 7కి.మీ. దూరం లోని చాగల్లు (మండల కేంద్రం) పోవలసిందే. కాబట్టి వారంలో 2 రోజులు కాని, రోజుకి 2 గంటలు కానిప్రభుత్వ వైద్యుడు ఇక్కడకు వచ్చి వైద్య సేవలు అందిస్తే బాగుంటుంది.
  2. శ్మశానవాటికలో సౌకర్యాలు సరిగాలేవు.శాశ్వత ప్రాతిపదిక మీద మంచి ఏర్పాట్లు చేయవలసి ఉంది
  3. ఎవరి ఇంట్లో శుభకార్యమైనా, అశుభకార్యమైనా ఇంటిముందే రోడ్డు మీదే హంగామా (భోజనాలూ వగైరా) అంతా ఏర్పాటు చేసుకోవలసి వస్తుంది. ఒకవేళ వాతావరణం అనుకూలించక ఏ వర్షమైనా వస్తే ఈ హడావిడి కోసం చేసిన డబ్బు ఖర్చు అంతా వౄధా . కాబట్టి ఈవూరికి ఒక కల్యాణమండపం లాంటిది ఉంటే బాగుంటుంది.
  4. గ్రామ పంచాయతీ సంపూర్ణ పారిశుధ్యం కోసం పాటు పడుతూ సామూహిక మరుగు దొడ్లతో పాటు వ్యక్తిగత మరుగుదొడ్ల నిమిత్తం కూడా డబ్బు బాగానే ఖర్చు చేస్తుంది.నామ మాత్ర ఖర్చుతోనే ఎవరైనా వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మింపచేసుకోవచ్చును. పంచాయతీ కూడా పారిశుధ్య ప్రాముఖ్యత గురించి బాగానే ప్రచారం చేస్తున్నది. అయినా కొందరు పాత అలవాట్లను వొదులుకోలేకుండా వున్నారు వారిలో పరివర్తన కోసం ఇంకా బాగా కృషి చేయాలి

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2013-11-20.

బాహ్యలంకెలు

[మార్చు]