భలే రాముడు
భలే రాముడు (1956 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వేదాంతం రాఘవయ్య |
---|---|
నిర్మాణం | వి.ఎల్.నరసు |
కథ | ముఖర్జీ |
చిత్రానువాదం | వేదాంతం రాఘవయ్య |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , సావిత్రి, జంధ్యాల గౌరీనాథశాస్త్రి, చిలకలపూడి సీతారామాంజనేయులు |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల, పి.లీల, పి.బి.శ్రీనివాస్, జిక్కి |
గీతరచన | సదాశివబ్రహ్మం |
సంభాషణలు | సదాశివబ్రహ్మం |
ఛాయాగ్రహణం | ఎమ్. మస్తాన్ |
కూర్పు | ఆర్. రాజగోపాల్ |
నిర్మాణ సంస్థ | నరసు స్టూడియోస్ |
భాష | తెలుగు |
భలే రాముడు (ఆంగ్లం: Bhale Ramudu) 1956లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఇది తమిళంలో ప్రేమ పాశం పేరుతో నిర్మించారు.
ఇది 1943లో నిర్మించబడిన హిందీ హిట్ చిత్రం కిస్మత్ ఆధారంగా నిర్మించబడింది.
చిత్రకథ
[మార్చు]జమీందార్ నారాయణ రావు (జంధ్యాల) కు ఇద్దరు కూతుర్లు; రూప, తార. ఇద్దరికీ ముద్దుగా పెంచుతూ నాట్యం నేర్పిస్తాడు. జమీందారు వద్ద గుమస్తాగా పనిచేస్తున్న (సి.ఎస్.ఆర్.) కొడుకు రాము. రాము రూపకు పూలగుచ్ఛాన్ని బహుకరిస్తూండగా రూప మెట్ల మీదనుండి జారి పడిపోతుంది. తద్వారా కుంటిదై పోతుందని బాధపడుతున్న జమీందారు వెంటబడి రామును రివాల్వర్ తో కాలుస్తాడు. గాయపడిన రాము నదిలో దూకేస్తాడు. జమీందార్ పోలీసులకు భయపడి పారిపోతాడు. తన ఆస్తిని, పిల్లల సంరక్షణ గుమస్తాకు అప్పగిస్తాడు.
చాలాకాలం తర్వాత రాము, కృష్ణ (అక్కినేని) పేరుతో తిరిగి పట్నానికి వస్తాడు. ఈ మధ్యకాలంలో గుమస్తా జమీందారీ వ్యవహారాల్ని చేజిక్కించుకుని పిల్లల్ని పేదరికానికి విడిచిపెడతాడు. కృష్ణ అప్పన్న (రేలంగి) తో స్నేహం చేస్తాడు. రూప కృష్ణకు ఆశ్రయమిస్తుంది క్రమేణా అది ప్రేమగా మారుతుంది. చివరికి రూప వైద్యం కోసం జమీందారీ నుండి డబ్బును దొంగిలిస్తాడు. గుమస్తా చిన్న కొడుకు చలం తారను ప్రేమిస్తాడు. రాము వారిద్దరికీ వివాహం జరిపిస్తాడు. జమీందారు ఎక్కడ తిరిగి వస్తాడో అనే భయంతో అతన్ని బయటపెట్టడానికి నృత్య ప్రదర్శన ఏర్పాటుచేస్తాడు. చివరికి పోలీసులు వచ్చి రాము, కృష్ణ ఇద్దరూ ఒక్కరేనని పుట్టుమచ్చ ఆధారంగా గుర్తిస్తారు. చివరికి రాము, రూప వివాహంతో కథ సుఖాంతం అవుతుంది.
పాత్రలు-పాత్రధారులు
[మార్చు]నటి/నటుడు | పోషించిన పాత్ర |
---|---|
అక్కినేని నాగేశ్వరరావు | రాము / కృష్ణ, గుమస్తా పెద్ద కొడుకు |
సావిత్రి | రూప, జమీందారు కూతురు |
గిరిజ | తార, జమీందారు కూతురు |
జంధ్యాల గౌరీనాథ శాస్త్రి | జమీందారు నారాయణ బాబు |
చిలకలపూడి సీతారామాంజనేయులు | గుమస్తా |
చలం | గోపి, గుమస్తా చిన్న కొడుకు |
రేలంగి వెంకట్రామయ్య | అప్పన్న |
గుమ్మడి వెంకటేశ్వరరావు | |
ఇ.వి.సరోజ | రూపాదేవి, నాట్యకత్తె |
పేకేటి శివరామ్ | |
గాదిరాజు కేశవరావు |
పాటలు
[మార్చు]- ఇంటింటను దీపావళి మాయింటికి లేదా ఆ భాగ్యము రాదా - పి.లీల
- ఎందున్నావో మాధవా నందకుమారా కేశవా బృందావని - జిక్కి, ఎ.పి.కోమల బృందం
- ఓహో మేఘమాల నీలాల మేఘమాల చల్లగ రావేల మెల్లగ రావేల - ఘంటసాల, పి.లీల . రచన: సదాశివ బ్రహ్మం.
- ఓహో మేఘమాలా నీలాల మేఘమాలా చల్లగ రావేలా మెల్లగ రావేల - పి.లీల
- కలమాయమయ్యెనా తలవ్రాత ఇదేనా వలపించుట మురిపించుట - పి.లీల
- గోపాలదేవా కాపాడరావా ఏపాపమెరుగని పసిపాప - పి.బి.శ్రీనివాస్, పి.లీల బృందం
- నాడెమైన పచ్చబొట్టు పొడిపించుకోవా ఏం పొడవమన్నావా - జిక్కి
- బంగరుబొమ్మా భలేజోరుగా పదవే పోదాము పైదేశం చూదాం - పి.బి.శ్రీనివాస్, జిక్కి
- భయమేలా ఓ మనసా భగవంతుని లీల ఇదంతా పరమాత్ముని లీల - పి.బి. శ్రీనివాస్
- భారతవీరా ఓ భారతవీరా భారతవీరా నెహ్రూ నేర్పిన - పి.లీల బృందం
- మురళీధరా హరే మోహనకృష్ణా మొర వినవా దేవా కరుణింప రావా - పి.లీల
బాక్సాఫీస్
[మార్చు]- ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లోని16 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్నది.[2]
మూలాలు
[మార్చు]- ↑ హిట్ మూవీ భలేరాముడు, నాటి 101 చిత్రాలు, ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాద్, 2005, పేజీలు: 125-6.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-12-26. Retrieved 2011-12-19.
- ఘంటసాల గళామృతంలో భలే రాముడు పాటల వివరాలు.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.