మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
మంచిరెడ్డి కిషన్‌రెడ్డి | |||
| |||
పదవీ కాలం 2009 – 2014, 2014–2018, 2018 - ప్రస్తుతం | |||
ముందు | మస్కు నరసింహ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1953, ఏప్రిల్ 11 ఎలిమినేడు, ఇబ్రహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | భూపాల్ రెడ్డి - పద్మమ్మ | ||
జీవిత భాగస్వామి | ముకుంద | ||
సంతానం | ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె | ||
నివాసం | ఇబ్రహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా |
మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2]
జననం, విద్య
[మార్చు]కిషన్‌రెడ్డి 1953, ఏప్రిల్ 11న భూపాల్ రెడ్డి - పద్మమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో జన్మించాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన కిషన్‌రెడ్డి, హైదరాబాదులోని నిజాం కళాశాల నుండి 1975 బిఏ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]కిషన్‌రెడ్డికి ముకుందతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
రాజకీయ విశేషాలు
[మార్చు]కిషన్‌రెడ్డి తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 2009లో తెలుగుదేశం పార్టీ తరపున ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డిపై 11,056 ఓట్ల మెజారిటీతో 13వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి ఎం. రాంరెడ్డిపై గెలుపొందాడు.[4][5] తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప స్వతంత్ర అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి పై 376 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6][7][8] మంచిరెడ్డి కిషన్ రెడ్డి 2022 జనవరి 26న రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[9]
హోదాలు
[మార్చు]- 2000–2004: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్
- 2016 మే 26 – 2018 సెప్టెంబరు 6: తెలంగాణ శాసనసభ గ్రంథాల కమిటీ చైర్మన్
- 2019 సెప్టెంబరు 22 - ప్రస్తుతం: ప్రభుత్వ హామీలపై కమిటీ చైర్మన్
ఇతర వివరాలు
[మార్చు]ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొదలైన దేశాలు సందర్శించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Member's Profile – Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-09-07.
- ↑ "Manchireddy Kishan Reddy(TRS):Constituency- IBRAHIMPATNAM(RANGA REDDY) – Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-09-07.
- ↑ "Manchireddy Kishan Reddy | MLA | TRS | Ibrahimpatnam | Ranga Reddy". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-18. Retrieved 2021-09-07.
- ↑ Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ "Manchireddy Kishan Reddy MLA of Ibrahimpatnam Telangana contact address & email". nocorruption.in (in ఇంగ్లీష్). Retrieved 2021-09-07.
- ↑ Eenadu (31 October 2023). "పార్టీ ఏదైనా టిక్కెట్ మంచిరెడ్డికే." Archived from the original on 31 October 2023. Retrieved 31 October 2023.
- ↑ "Ibrahimpatnam Assembly election: Sitting MLA Manchireddy Kishan Reddy of TRS is leading". www.timesnownews.com. Retrieved 2021-09-07.
- ↑ "Ibrahimpatnam Election Result 2018 Live Updates: Manchireddy Kishan Reddy of TRS Leading". News18 (in ఇంగ్లీష్). 11 December 2018. Retrieved 2021-09-07.
- ↑ Namasthe Telangana (26 January 2022). "టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- జీవిస్తున్న ప్రజలు
- తెలంగాణ రాజకీయ నాయకులు
- తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు
- తెలంగాణ శాసన సభ్యులు (2014)
- తెలంగాణ శాసన సభ్యులు (2018)
- 1953 జననాలు
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2009)
- రంగారెడ్డి జిల్లా వ్యక్తులు
- రంగారెడ్డి జిల్లా రాజకీయ నాయకులు
- పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు
- రంగారెడ్డి జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు
- రంగారెడ్డి జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు