Jump to content

మల్దకల్

అక్షాంశ రేఖాంశాలు: 16°07′25″N 77°41′42″E / 16.1234802°N 77.6951194°E / 16.1234802; 77.6951194
వికీపీడియా నుండి
మల్దకల్
—  మండలం  —
అక్షాంశరేఖాంశాలు: 16°07′25″N 77°41′42″E / 16.1234802°N 77.6951194°E / 16.1234802; 77.6951194
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా
మండల కేంద్రం మల్దకల్
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 52,579
 - పురుషులు 26,593
 - స్త్రీలు 25,986
అక్షరాస్యత (2011)
 - మొత్తం 27.50%
 - పురుషులు 38.56%
 - స్త్రీలు 16.12%
పిన్‌కోడ్ 509132
మల్దకల్ లోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం

మల్దకల్, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా,మల్దకల్ మండలానికి చెందిన గ్రామం.[1]ఇది సమీప పట్టణం, డివిజన్ కేంద్రమైన గద్వాల నుండి 18 కి. మీ. దూరంలో రాయచూరు వెళ్ళు మార్గములో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]

ఐజ పోవు దారిలో రిక్వెస్ట్ స్టాఫ్
మల్దకల్ లోని హనుమాన్ దేవాలయం
మల్దకల్ లోని మార్కండేయ స్వామి దేవాలయం

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1668 ఇళ్లతో, 8355 జనాభాతో 2498 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4226, ఆడవారి సంఖ్య 4129. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1749 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 33. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576251[3].పిన్ కోడ్: 509132.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో నాలుగు ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల గద్వాలలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల కర్నూలులోను, పాలీటెక్నిక్‌ గద్వాలలోను, మేనేజిమెంటు కళాశాల కొండేర్లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గద్వాలలో ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

మల్దకల్లో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో9 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు ముగ్గురు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు, ఒక నాటు వైద్యుడు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

మల్దకల్లో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

రెండు రైస్ మిల్లులు

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 24 గంటల పాటు వ్యవసాయానికి, 24 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

మల్దకల్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 159 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 21 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 1 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 5 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 42 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 553 హెక్టార్లు
  • బంజరు భూమి: 418 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1295 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1808 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 459 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

మల్దకల్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు, బోరు బావులు
  • కాలువలు
  • చెరువు

ఉత్పత్తి

[మార్చు]

మల్దకల్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, జొన్న బత్తాయి, కాటన్

శ్రీ స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర(తిమ్మప్ప) స్వామి వారి దేవాలయం

[మార్చు]
శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం,మల్ధకల్

(రుద్రగిరి) రుద్రుడు తపస్సు చేయగా కలియుగంలో స్వయంభువు గా వెలసిన దివ్యక్షేత్రం, బ్రహ్మాండ పురాణంలో తెలిపిన ప్రకారం శేశాచలం గరుడాచలం రుద్రాచలం అనే క్షేత్రాల్లో రుద్రగిరిగా, రుద్రచలం గా పేరు గాంచిన క్షేత్రం ఇది. ఇక్కడి స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయం స్థానిక పర్యాటకులనే కాకుండా చుట్టు ప్రక్కన ఉన్న రాష్ర్టాల ప్రజలకు ఇలవేల్పుగా పూజలందుకుంటున్న పరమ పుణ్య క్షేత్రం ఆదిశిలా క్షేత్రం. ప్రతియేటా ఈ క్షేత్రంలో రథోత్సవం, పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ద్వాపరయుగాంతం కలియుగ ఆరంభంలో తిరుమల తిరుపతి దేవునికి ముందు విష్ణుమూర్తి ఇక్కడ ఆదిశిలపై పాదం పెట్టి ప్రవేశించడంతో ఆదిశిల అనే పేరు ఉన్నట్లు బ్రహ్మాండ పురాణంలోని నాలుగవ అధ్యాయంలో ఆధారాలున్నాయి. ఈ గ్రామంలో ఎవరు కూడా తిరుమల తిరుపతి కి వెళ్లకపోవడం ఇండ్లను రెండో అంతస్తు కట్టకపోవడం ఇక్కడి ప్రత్యేకత. స్వామివారి గోపురం కంటే ఎత్తు ఇళ్ళు ఉండరాదని, ఇదివరకు ఈ విధంగా చేసినవారికి అరిష్టాలు జరిగాయని ప్రచారంలో ఉంది. ఇతర మతస్థులు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.

రెండవ తిరుపతిగా వెలుగొందుతున్న మొదలకల్ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో ఆది శిలా క్షేత్రాన్ని గురించి వివరించారు. మొదలు అనగా 'ఆది' అని, కల్లు అనగా 'రాయి' అని అర్థము. బ్రహ్మ దేవుడు ఒక శిలను సృష్టించి 'ఆదిశిల' అని పేరు పెట్టాడని, అక్కడే పరమ శివుడు తపస్సు నాచరించాడని, అట్టి శిలపై శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, అనంతశయన మూర్తి, వరాహస్వామి, ఆంజనేయుడు, ఒకే శిలపై ఉద్భవించారు. క్షేత్ర పాలకుడు అయిన పరమేశ్వరుడు ఇచ్చట సతీసమేతంగా వెలిసి యున్నాడు. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు అరణ్యంగా ఉండేది. ఒక రోజు గద్వాల సంస్థానాధీశుడు అయిన నలసోమనాద్రి రాజు గుర్రము పైన వేటకై మల్దకల్ ప్రాంతానికి రాగా ఒక చోట అతని గుర్రము అకస్మాత్తుగా ఆగిపోగా, రాజు ఈ ప్రాంతములో ఏదో మహాత్యము ఉందని భావించి, దగ్గరలో ఉన్న పశువుల కాపరిని పిలిచి విచారించగా అక్కడే పొదలలో కల విగ్రహాన్ని చూపాడు. నా గుర్రం పరిగెత్తితే నీకు గుడి కట్టిస్తానని మొక్కి తన గుర్రం ఎక్కగానే అది రెట్టించిన వేగంతో పరిగెత్తి తన ప్రయాణాన్ని పూర్తి చేసిందని చరిత్ర చెబుతుంది. అప్పుడు రాజు గారు దేవాలయాన్ని కట్టించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, అడవిలో విగ్రహాన్ని చూపిన పశువుల కాపరి అయిన బోయవాడిని పూజారిగా నియమించాడు. నేటికీ ఈ దేవాలయంలో అతని సంతతి వారే పూజాధికాలు నిర్వహిస్తుంటారు.

పవిత్ర కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య వెలసిన శ్రీ స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలే కాకుండా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచీ, పక్క రాష్ట్రాల నుంచీ కూడా భక్తులు విశేషంగా తరలి వస్తుంటారు.ప్రతి యేడాది మార్గశిర శుద్ధ పంచమి రోజునుంచి మార్గశిర కృష్ణ తదియ వరకు స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మార్గశిర పౌర్ణమి రోజు రాత్రిన స్వామివారి రథోత్సవం శోభాయమానంగా జరుగుతుంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి ఊరేగింపు, పల్లకి సేవల్లో పాల్గొంటారు.బ్రహ్మాండ పురాణంలో వ్రాయబడిన మూడు ముఖ్య క్షేత్రాలు, శేషాచలం అనగా తిరుపతి, గరుడాచలం అనగా అహోబిలం, గిరీశాచలం అనగా మొదల్ కల్ (మల్దకల్).అపర తిరుపతి గా అభివృద్ధి చెందుతున్న ఈ క్షేత్రం లో 120 అడుగులు ఎత్తులో ఉన్న దేవరగట్టుపై , 60 అడుగుల ఎత్తులో ధ్యాన ముద్రలో ఉన్న మహాశివుని విగ్రహ నిర్మాణం జరుగుతున్నది.

రాజకీయాలు

[మార్చు]

2019, జనవరిలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా యాకోబు గారు ఎన్నికైనారు.[4]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయుడ్, తేది 24-07-2013

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మల్దకల్&oldid=4328534" నుండి వెలికితీశారు