మాణిక్ సర్కార్
మాణిక్ సర్కార్ | |||
మాణిక్ సర్కార్ | |||
9వ త్రిపుర ముఖ్యమంత్రి
| |||
పదవీ కాలం 1998 మార్చి 11 – 2018 మార్చి 9 | |||
గవర్నరు | దేవానంద్ కొన్వర్ | ||
---|---|---|---|
ముందు | దశరద్ దేబ్ | ||
తరువాత | మాణిక్ సాహా | ||
నియోజకవర్గం | ధనపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | రాధకిశోరేపూర్, త్రిపుర | 1949 జనవరి 22||
రాజకీయ పార్టీ | సి.పి.ఎం | ||
జీవిత భాగస్వామి | పంచాలి బట్టాచార్య | ||
నివాసం | అగర్తలా, త్రిపుర | ||
మతం | నాస్తికులు | ||
మూలం | http://tripura.nic.in/portal/cm/CMBiodata.aspx Govt. of Tripura |
మాణిక్ సర్కార్ (జననం: 1949 జనవరి 22) అతను ఒక భారత రాజకీయ నాయకుడు. అతను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పొలిట్‌బ్యూరో సభ్యుడు.[1][2] మాణిక్ సర్కార్ త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1998 నుండి మార్చి 11 నుండి 2018 మార్చి 9 వరకు వరుసగా నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా 19 సంవత్సరాల 363 రోజులు పనిచేసాడు.[3] ముఖ్యమంత్రిగా మాణిక్ సర్కార్ తన జీతం, అలవెన్సులను తన పార్టీకి విరాళంగా ఇచ్చారు, ప్రతిగా పార్టీ నుండి జీవనభృతిగా ₹5,000 (US$63) లను పొందుతున్నారు.[4] అతను సీపీఎం తరపున దేశంలో అత్యధిక కాలం పని చేసిన ముఖ్యమంత్రిగా రెండోస్థానంలో నిలిచాడు.[5][6]
అతను 2018 నుండి 2023 వరకు త్రిపుర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. 2018 త్రిపుర అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన చేసిన అఫిడవిట్‌లో అతను భారతదేశంలోని తన ప్రత్యర్ధులందరిలో అతి తక్కువ ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రి అని వెల్లడించింది.[7][8][9]
ప్రారంభ జీవితం
[మార్చు]మాణిక్ సర్కార్, జనవరి 22, 1949న రాధకిశోరేపూర్ (ఉదయపూర్, త్రిపుర) లో సమీపంలోఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు.[10] తండ్రి అమూల్య సర్కార్ ఒక దర్జీ, తల్లి అంజలి సర్కార్ ప్రభుత్వ ఉద్యోగి.[11] సర్కార్ తన విద్యార్థి రోజుల నుండి విద్యార్థి ఉద్యమాలు చురుకుగా పాల్గొన్నారు. 19 సంవత్సరాల వయస్సులో, 1968 లో, అతను భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) లో సభ్యత్వం తీసుకున్నారు. అతను ఎం.బి.బి కళాశాలలో బి..కామ్; చదివారు, MBB కళాశాలలో చదువుకునే రోజులలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో సభ్యులుగా ఉన్నారు.[12] 1967లో త్రిపుర కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆహార ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ ఉద్యమం ద్వారా 1968 లో సి.పి.ఎం సభ్యత్వం తీసుకున్నారు.[13]ఎం.బి.బి కాలేజీలో చదువుకునే సమయంలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 23 ఏళ్ల వయసులో 1972 లో సి.పి.ఎం రాష్ట్ర కమిటి సభ్యుడుగా ఎన్నిక అయ్యారు.[12]
రాజకీయ జీవితం
[మార్చు]సిపిఐ (ఎం) రాష్ట్ర కమిటీలో ఎంపికైనా ఆరు సంవత్సరాల తర్వాత, సర్కార్ 1978 లో పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ గా పనిచేశారు. ఇదే సంవస్తరం త్రిపురలో మొదటి వామపక్ష ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది . 1980 లో, 31 సంవత్సరాల వయస్సులో, అతను అగర్తల నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో మాణిక్ సర్కార్ నాయకత్వం రాజకీయ జీవితం ఆరంభం అయ్యింది.[14]అదే సమయంలో, అతను సిపిఐ చీఫ్ విప్ గా నియమితులయ్యారు. తిరిగి 1983 లో కృష్ణ నగర్, అగర్తల నుండి శాసనసభ సభ్యుడిగా శాసనసభకి ఎన్నికయ్యారు.[10]వామపక్ష ప్రభుత్వం 1993 లో తిరిగి అధికారం చేజిక్కించుకున్నారు, సర్కార్ స్టేట్ కార్యదర్శి సి.పి.ఎం నియమించబడ్డారు. 49 సంవత్సరాల వయసులో 1998 లో మాణిక్ సర్కార్, కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్బ్యూరో సభ్యునిగా నియమించబడ్డారు.[14][15]అదే సంవత్సరం 1998లో త్రిపుర ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు. 1998 నుంచి వరుసగా 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసారు. ప్రస్తుతం ఇండియాలో అత్యదిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో ఒకరు.[14]
వ్యక్తిగత జీవితం
[మార్చు]మాణిక్ సర్కార్ పంచాలి భట్టాచార్యను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు సంతానం లేదు,[16] పంచాలి భట్టాచార్య 2011 లో కేంద్ర సాంఘిక సంక్షేమ మండలి నుండి రిటైర్ అయ్యారు. సర్కార్, అతని భార్యది చాలా సాధారణ జీవితం. తన పేరు మీద ఏ ఇల్లు, కారు కాని లేని ఏకైక ముఖ్యమంత్రి. తన భార్య ఎలాంటి భద్రతా లేకుండా రిక్షాలో ప్రయాణిస్తారు.[17]2017 తన ఎన్నికల నామినేషన్ తోపాటు ఆస్తుల వివరాల ప్రకారం, అతని బ్యాంకు ఖాతాలో కేవలం రూ.2,410 చేతిలో రూ.1520 ఉన్నట్లు ప్రస్తావించారు.
మాణిక్ సర్కార్ భార్య పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి. ఆమె బ్యాంకు ఖాతాలో ప్రస్తుతం రూ.20,140 నగదు ఉంది. కనీసం అతనికి సెల్ ఫోన్ లేదు. మాణిక్ సర్కార్ ముఖ్యమంత్రిగా తను పొందే జీతం, అలవెన్సులను తన పార్టీకి విరాళంగా ఇస్తారు, ప్రతిగా పార్టీ నుండి జీవనభృతి పొందుతున్నారు. సర్కార్ "నిజాయితి, నిరుపేద ముఖ్యమంత్రి"గా ప్రసిద్ధి. సర్కార్ నిజాయితీని రాజకీయ ప్రత్యర్థులు గౌరవిస్తారు.[18]2009 లో అతని తల్లి అంజలి సర్కార్ మరణానంతరం సర్కార్ కు అగర్తలలో ఒక చిన్న ఇల్లు వారసత్వంగా సంభవించింది. అదికూడా సర్కార్ తన బంధువుకు దానం చేసారు. ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన అతను దేశంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారందరిలోకి అత్యంత పేదవారిగా మిగిలారు. మాణిక్ సర్కార్ భార్య పాంచాలి భట్టాచార్జి పదవీ విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. మాణిక్ సర్కార్ ఆమెతో కలిసి ప్రభుత్వం ఇచ్చిన అధికారిక క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు.[19] [20]
బయటి లింకులు
[మార్చు]- ఈశాన్య మాణిక్యం.. Archived 2016-03-05 at the Wayback Machine
మూలాలు
[మార్చు]- ↑ List of Politburo Members Archived 7 అక్టోబరు 2008 at the Wayback Machine from the 7th (1964) to the 18th Congress(2005)
- ↑ List of Politburo and Central Committee members Archived 29 జూలై 2008 at the Wayback Machine elected on the 19th Congress
- ↑ "6th Left Front Govt Assumes Office". Archived from the original on 2011-09-28. Retrieved 2014-01-05.
- ↑ "?Manik Sarkar, the frugal CM". The Hindu. 25 January 2013. Archived from the original on 2013-01-28. Retrieved 2013-01-25.
- ↑ "Manik Sarkar 'cleanest and poorest' CM". Deccan Herald. 26 January 2013. Retrieved 27 January 2013.
- ↑ "Manik Sarkar: Poorest CM in the country". Times of India. 26 January 2013. Archived from the original on 27 జనవరి 2013. Retrieved 27 January 2013.
- ↑ "With just Rs 2,410 in bank account, country's poorest CM Manik Sarkar turns even poorer after 4 terms".
- ↑ "Manik Sarkar: Poorest CM in the country". The Times of India. 26 January 2013. Archived from the original on 27 January 2013. Retrieved 27 January 2013.
- ↑ "National Commission for Scheduled Castes praises Tripura". India Today (in ఇంగ్లీష్). PTI. November 6, 2015. Retrieved 2021-05-07.
- ↑ 10.0 10.1 "Manik Sarkar: Chief Minister (CM) of Tripura". NationsRoot. Archived from the original on 9 ఆగస్టు 2013. Retrieved 11 August 2013.
- ↑ Shridhar Prasad, K. "Poorest Chief Minister Manik Sarkar". Bubble News. Archived from the original on 8 నవంబరు 2014. Retrieved 11 August 2013.
- ↑ 12.0 12.1 "Biography of Manik Sarkar". WinEnterance.com. Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 11 August 2013.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-09-11. Retrieved 2014-01-05.
- ↑ 14.0 14.1 14.2 "A Profile of Shri Manik Sarkar, Chief Minister, Tripura". Tripura Info. Archived from the original on 11 సెప్టెంబరు 2013. Retrieved 12 August 2013.
- ↑ "Politburo". Merriam Webster. Retrieved 12 August 2013.
- ↑ https://economictimes.indiatimes.com/news/politics-and-nation/from-manik-sarkar-to-modis-sarkar-end-of-the-road-for-indias-only-communist-cm/articleshow/63144911.cms
- ↑ "Chief Minister Sarkar: India's Icon of Honesty". Silicon India. Archived from the original on 3 నవంబరు 2013. Retrieved 12 August 2013.
- ↑ "Manik Sarkar: Biography". The News Person. Retrieved 12 ఏప్రిల్ 2013.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-01-31. Retrieved 2018-03-03.
- ↑ http://timesofindia.indiatimes.com/topic/Tripura-chief-minister-Manik-Sarkar