దేవానంద్ కొన్వర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవానంద్ కొన్వర్
దేవానంద్ కొన్వర్


త్రిపుర గవర్నర్‌
పదవీ కాలం
25 మార్చి 2013[1] – 29 జూన్ 2014
ముందు డి.వై. పాటిల్
తరువాత వాక్కుమ్ పురుషోత్తమన్

బీహార్ గవర్నర్‌
పదవీ కాలం
29 జూన్ 2009 – 21 మార్చి 2013
ముందు ఆర్. ఎల్. భాటియా
తరువాత డి.వై. పాటిల్

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌
(అదనపు భాద్యత)
పదవీ కాలం
14 డిసెంబర్ 2009 – 23 జనవరి 2010
ముందు గోపాలకృష్ణ గాంధీ
తరువాత ఎం. కే. నారాయణన్

వ్యక్తిగత వివరాలు

జననం 1934
మరణం 2020 ఏప్రిల్ 25(2020-04-25) (వయసు 85–86)[2]
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
పూర్వ విద్యార్థి ఢిల్లీ యూనివర్సిటీ
గౌహతి యూనివర్సిటీ
వెబ్‌సైటు Official Website

దేవానంద్ కొన్వర్ (1934 - 25 ఏప్రిల్ 2020) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన త్రిపుర,[3] బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేశాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

దేవానంద్ కొమ్వార్ 1934లో అస్సాంలో జన్మించాడు. ఆయన ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు. ఆయన గౌహతిలోని కాటన్ కాలేజీలో ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్‌లో లెక్చరర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత 1961లో ముంబైలోని స్టాండర్డ్ వాక్యూమ్ ఆయిల్ కంపెనీకి మార్కెటింగ్ మేనేజర్‌గా చేరి ట్రాంబే, వైజాగ్, బరౌనీ, నూన్మతి, దిగ్‌బోయ్ నుండి ఉత్తర & తూర్పు భారతదేశంలోని పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ నెట్‌వర్క్‌లను సమన్వయం చేస్తూ ఏడేళ్లపాటు పని చేశాడు.

దేవానంద్ కొమ్వార్ 1968-69లో గౌహతిలో డిగ్రీ కళాశాలను స్థాపించి దాని వ్యవస్థాపక ప్రిన్సిపాల్‌గా పని చేశాడు. ఆయన నవంబర్ 1969లో గౌహతి హైకోర్టు బార్‌లో ఎన్రోల్ అయ్యి, 1991 వరకు భారత సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు. దేవానంద్ గౌహతి హైకోర్టులో అస్సాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాలకు ప్రభుత్వ న్యాయవాదిగా పని చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

దేవానంద్ కొమ్వార్ 1955లో విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి 1983 నుండి 1991 వరకు అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, ఉపాధ్యక్షుడిగా పార్టీలో జిల్లా, రాష్ట్ర స్థాయిలలో వివిధ పార్టీ పదవులను నిర్వహించాడు. ఆయన 1991లో హితేశ్వర్ సైకియా, 2001లో తరుణ్ గొగోయ్ ప్రభుత్వంలో అస్సాం రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పని చేశాడు. దేవానంద్ కొమ్వార్ 1988లో అస్సాం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుండి మాస్కో, తాష్కెంట్, అల్మా-అటా, కీవ్, సోచి, లెనిన్‌గ్రాడ్ మొదలైన ప్రాంతాలకు 28 మంది సభ్యులతో కూడిన సోవియట్ యూనియన్ స్నేహితుల ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాడు.

దేవానంద్ కొమ్వార్ బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు గవర్నర్‌ గా పని చేశాడు.

మూలాలు[మార్చు]

  1. "Devanand Konwar assumes office as Tripura governor" (in అమెరికన్ ఇంగ్లీష్). 2013-03-25. Retrieved 2018-01-12.
  2. Hindustan Times (26 April 2020). "Former governor, veteran Congress leader Devanand Konwar dies at 86" (in ఇంగ్లీష్). Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.
  3. India TV News (25 March 2013). "Devanand Konwar assumes office as Tripura governor" (in ఇంగ్లీష్). Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.