మాతృదేవోభవ
మాతృదేవోభవ | |
---|---|
దర్శకత్వం | కె. అజయ్ కుమార్ |
కథ | డెన్నిస్ జోసెఫ్ |
నిర్మాత | కె. ఎస్. రామారావు |
తారాగణం | నాజర్, మాధవి, చారుహాసన్, బ్రహ్మానందం, వై. విజయ |
ఛాయాగ్రహణం | ఛోటా కె. నాయుడు |
సంగీతం | కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
సినిమా నిడివి | 140 ని |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మాతృదేవోభవ కె. అజయ్ కుమార్ దర్శకత్వంలో 1993 లో విడుదలై పలువురి మన్ననలు పొందిన సినిమా. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె. ఎస్. రామారావు నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు. వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యం అందించాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, కీరవాణి పాటలు పాడారు. ఈ చిత్రానికి మూలం సిబి మలయిల్ దర్శకత్వంలో వచ్చిన మలయాళం సినిమా ఆకాశదూతు. ఇదే సినిమాని కన్నడ భాషలో కరుళిన కూగు (1994) పేరుతోను, హిందీ భాషలో తులసి (2008) పేరుతోను, మరాఠీ భాషలో చిమని పఖరే (2003) పేరుతోను పునర్మించారు. అయితే ఈ సినిమాలన్నీ 1983లో విడుదలైన అమెరికన్ సినిమా హూ విల్ లవ్ మై చిల్డ్రన్? ఆధారంగా నిర్మించబడ్డాయని భావిస్తున్నారు.[ఆధారం చూపాలి]
ఈ చిత్రంలో వేటూరి సుందర్రామ్మూర్తి రాసిన రాలిపొయ్యే పువ్వా నీకు... అనే పాటకు జాతీయ పురస్కారం లభించింది. తెలుగు సినిమా పాటకు ఈ అవార్డు దక్కడం ఇది రెండవ సారి. మొదటిసారి శ్రీ శ్రీ కి "తెలుగువీర లేవరా" పాటకు గాను ఈ అవార్డు 1974లో లభించింది.
విధివశాత్తూ భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, క్యాన్సర్ సోకి తను కూడా కొద్ది రోజుల్లో మరణిస్తానని తెలుసుకొని తన ముగ్గురు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పడే తపన, ఆరాటమే ఈ సినిమా.
కథ
[మార్చు]శారద (మాధవి), చారుహాసన్ నడిపే ఒక అనాథాశ్రమంలో పెరిగిన అమ్మాయి. సంగీత అధ్యాపకురాలిగా పనిచేస్తుంటుంది. సత్యం (నాజర్) అదే అనాథాశ్రమంలో పెరిగి లారీ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. శారదను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. వీరికి నలుగురు పిల్లలు. సత్యం వ్యక్తిగతంగా మంచివాడైనప్పటికీ మద్యానికి బానిసౌతాడు. కల్లు దుకాణానికి యజమానియైన అప్పారావు ( తనికెళ్ళ భరణి ) శారద మీద కన్ను వేస్తాడు. అది సత్యానికి తెలిసి అతని దుకాణం ముందే అప్పారావుని అవమానిస్తాడు. అదే సమయంలో శారదకు మెదడు క్యాన్సర్ సోకిందనీ, తను ఇక ఎంతో కాలం బ్రతకదనీ డాక్టర్లు చెబుతారు. అప్పారావు పగబట్టి సత్యాన్ని చంపేస్తాడు. శారద తనలాగే తన పిల్లలు కూడా అనాధాశ్రమంలో పెరగడం ఇష్టం లేక వారిని మంచి మనసున్న కుటుంబాలకు దత్తత ఇచ్చి వేస్తుంది.
తారాగణం
[మార్చు]- శారద గామాధవి
- సత్యంగా నాజర్
- అప్పారావుగా తనికెళ్ళ భరణి
- చారుహాసన్
- వై. విజయ
- నిర్మలమ్మ
- కోట శ్రీనివాసరావు
నిర్మాణం
[మార్చు]నిర్మాత కె. ఎస్. రామారావు మలయాళ చిత్రాన్ని చూసి తెలుగులో పునర్నిర్మాణానికి హక్కులు కొన్నాడు. మలయాళంలో నటించిన మాధవి, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం కావడంతో తెలుగులో కూడా ఆమెనే ప్రధాన పాత్రలో నటించడానికి ఒప్పించాడు. తెలుగు చిత్రాన్ని కూడా చాలావరకూ మాతృక సినిమాను చిత్రీకరించిన ప్రదేశాల్లోనే చిత్రీకరించారు.
విశేషాలు
[మార్చు]- ఈ చిత్రంలో వేటూరి సుందర్రామ్మూర్తి రాసిన రాలిపొయ్యే పువ్వా నీకు... అనే పాటకు జాతీయ పురస్కారం లభించింది. తెలుగు సినిమా పాటకు ఈ అవార్డు దక్కడం ఇది రెండవ సారి. మొదటిసారి శ్రీ శ్రీ కి "తెలుగువీర లేవరా" పాటకు గాను ఈ అవార్డు 1974లో లభించింది.
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, కీరవాణి పాటలు పాడారు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాటకిగాను వేటూరికి ఉత్తమ గీత రచయితగా జాతీయ పురస్కారం లభించింది.[1]
- గానం ఎం. ఎం. కీరవాణి
- వేణువై వచ్చాను భువనానికి
- గానం చిత్ర
- కన్నీటి కలువలు
- గానం ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
- రాగం అనురాగం
- గానం ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
మూలాలు
[మార్చు]- ↑ Narasimham, M. L. (2018-12-10). "A song of pathos". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-11-24.
బయటి లింకులు
[మార్చు]- CS1 Indian English-language sources (en-in)
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with missing date
- మూలాలు చేర్చవలసిన పాఠ్యమున్న వ్యాసాలు
- నంది ఉత్తమ చిత్రాలు
- ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు సినిమాలు
- కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- మాధవి నటించిన సినిమాలు
- మలయాళ సినిమా పునర్నిర్మాణాలు
- 1993 తెలుగు సినిమాలు
- నిర్మలమ్మ నటించిన సినిమాలు