ముజఫ్ఫర్ జంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముజఫ్ఫర్ జంగ్ హిదాయత్
నిజాముల్ ముల్క్
ముజఫ్ఫర్ జంగ్ హిదాయత్
3rd నిజాం
పరిపాలన16 డిసెంబరు 1750 – 13 ఫిబ్రవరి 1751
పూర్వాధికారినాసిర్ జంగ్
ఉత్తరాధికారిసలాబత్ జంగ్
మరణం13 ఫిబ్రవరి 1751
Houseఅసఫ్‌ఝా
తండ్రిముతవాస్సిల్ ఖాన్
తల్లిఖైరున్నీసా బేగం
మతంఇస్లాం
డూప్లే, దక్కన్ సుబేదారుగా ఉన్న ముజఫ్ఫర్ జంగ్‌ను కలిసిన దృశ్యం.

ముజఫర్ జంగ్ గా ప్రసిద్ధి చెందిన ముహియుద్దీన్ ముజఫ్ఫర్ జంగ్ హిదాయత్ (మరణం 13 ఫిబ్రవరి 1751) 1750 నుండి 1751లో మరణించే వరకు హైదరాబారు రాజ్యం యొక్క మూడవ నిజాం. ఈయనకు ముందున్న నిజాం నవాబు, ప్రత్యర్థి అయిన నాసిర్ జంగ్ వలె, ఈయనకూ చాలా ఆడంబరమైన బిరుదు ఇవ్వబడింది. అది నవాబ్ ఖాన్ బహదూర్, ముజఫ్ఫర్ జంగ్, దక్కన్ నవాబ్ సుబేదార్.

జననం

[మార్చు]

ఈయన బీజాపూర్ నాయిబ్ సుబేదారు (డిప్యూటీ గవర్నర్) అయిన నవాబ్ ముతవస్సిల్ ఖాన్ రుస్తుం జంగ్ బహదూర్, నిజాముల్ ముల్క్ కుమార్తె అయిన సాహిబ్జాదీ ఖైరున్నీసా బేగం దంపతులకు జన్మించాడు.[1][2] ముతవస్సిల్ ఖాన్ తండ్రి హిఫ్‌జుల్లా ఖాన్. హిఫ్‌జుల్లా ఖాన్ 1645-1656 నుండి మొఘల్ సామ్రాజ్యం యొక్క పంజాబీ గ్రాండ్ వజీర్, సాదుల్లా ఖాన్ కుమారుడు.[3]

పాలన

[మార్చు]

1749 నాటి సెయింట్ జార్జ్ కోట యొక్క బ్రిటిష్ రికార్డుల ప్రకారం, నాసిర్ జంగ్ ప్రవర్తన పట్ల అసంతృప్తిగా ఉన్నప్పుడు నిజాముల్ ముల్క్, నాసిర్ జంగ్ బదులుగా ముజఫ్ఫర్ జంగ్‌ను వారసునిగా ప్రకటించడం గురించి కూడా ఆలోచించాడు. ఈ నిర్ణయం దారితీయగల తీవ్రమైన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని, ఆ ఆలోచనను పక్కనబెట్టి, నాసిర్ జంగ్‌తో రాజీపడ్డాడు.[4] నిజాముల్ ముల్క్, పాదుషా ఆమోదంతో, ముజఫ్ఫర్ జంగ్‌కు ఆదోని, రాయచూరు సర్కార్లను ఇవ్వాలని సిఫారసు చేశాడు.[4]: 19 

ప్రారంభంలో ముజఫ్ఫర్ జంగ్‌ 3,000 జాట్లతో పాటు 2,000 సోవర్ల ఇంపీరియల్ మనసబుగా నియమించబడ్డాడు. ఈయన కర్ణాటక గవర్నర్‌గా నియమించబడ్డాడు. ఆ తరువాత బీజాపూరుకు నియమించబడినప్పుడు 4,000 జాట్‌గా పదోన్నతి పొందాడు. తన తండ్రి మరణం తరువాత బీజాపూరుకు సుబేదారుగా పనిచేశాడు. 1748లో తన తాత (మాతామహుడు) నిజాముల్ ముల్క్ మరణించినప్పుడు, ఈయన తన మేనమామ నాసిర్ జంగ్‌కు వ్యతిరేకంగా హైదరాబాదు సింహాసనంపై తన హక్కును నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీని ఫలితంగా భారతదేశ అంతర్గత రాజకీయాల్లో యూరోపియన్ల మొదటి ప్రధాన ప్రత్యక్ష ప్రమేయం ఏర్పడింది. ఈయన తన కర్ణాటక మిత్రుడు చందా సాహిబ్‌తోనూ, ఫ్రెంచ్ వారితోనూ చేతులు కలిపితే, నాసిర్ జంగ్ తన కర్ణాటక మిత్రుడైన ముహమ్మద్ అలీ ఖాన్ వలజా తో, బ్రిటిష్ వారితో చేతులు కలిపాడు. చివరికి, దక్కన్, కర్ణాటకలలోని ఈ తీవ్రమైన పరిస్థితి రెండవ కర్ణాటక యుద్ధానికి దారితీసింది. యుద్ధ సమయంలో, 1750 మార్చిలో విల్లియనూర్ యుద్ధం తరువాత ముజఫ్ఫర్ జంగ్ పట్టుబడి కొంతకాలం బందీగా ఉన్నాడు. కానీ నాసిర్ జంగ్ హత్య తర్వాత విడుదలై, 1750 డిసెంబరు 16న హైదరాబారు రాజ్య సింహాసనాన్ని అధిష్టించాడు. ఈయన 1750 డిసెంబరు 31న డూప్లేకు, ఫ్రెంచి వారికి భూభాగాలతో పాటు బిరుదులను మంజూరు చేశాడు. అయితే, తన ఆఫ్ఘన్ మిత్రులను అదే విధంగా గౌరవించడంలో ముజఫ్ఫర్ జంగ్ విఫలమయ్యాడు. ఫలితంగా ఏర్పడిన అసమ్మతి, కడప జిల్లాలోని రాయచోటి తాలూకాలోని లక్కిరెడ్డిపల్లె కనుమ యుద్ధానికి దారితీసింది. అక్కడ 1751 ఫిబ్రవరి 13న కర్నూలు నవాబు హిమ్మత్ బహదూర్, ముజఫ్ఫర్ జంగ్‌ను తలపై ఈటెతో కొట్టి, తక్షణమే ఈయన చావుకు కారణమయ్యాడు. ముజఫ్ఫర్ జంగ్ మరణం తర్వాత ఏర్పడిన పరిస్థితి, కర్నూలు నవాబు, హిమ్మత్ బహదూర్, సావనూరుకు మొదటి నవాబు, మొదటి అబ్దుల్ మజీద్ ఖాన్ మరణాలకు దారితీసింది.[4]: 51 

చరిత్రలో క్లిష్టమైన ఈ సమయంలో ఫ్రెంచ్ కమాండర్ మార్కీస్ దే బుస్సీ సమయస్ఫూర్తితో సలాబత్ జంగ్‌ను, కొత్త నిజాంగా నియమించాలని నిర్ణయం తీసుకున్నాడు.[5]

కుటుంబం.

[మార్చు]

ముజఫ్ఫర్ జంగ్‌కు ఒకే ఒక కుమారుడు, నవాబ్ ముహమ్మద్ సాదుద్దీన్ ఖాన్ బహదూర్. 1751 ఫిబ్రవరిలో తన తండ్రి మరణించినప్పుడు మైనరుగా ఉన్నాడు. ఈయన 1751లో బీజాపూరు సుబేదారు అయ్యాడు. ఆ తరువాత మశూచి సోకి మరణించాడు.[<span title="This claim needs references to reliable sources. (January 2019)">citation needed</span>]

పదవులు

[మార్చు]
ముజఫ్ఫర్ జంగ్
అంతకు ముందువారు
{{{before}}}
{{{title}}} తరువాత వారు
{{{after}}}
అంతకు ముందువారు
{{{before}}}
{{{title}}} తరువాత వారు
{{{after}}}

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Malik, Zahiruddin (1977). The Reign of Muhammad Shah, 1719-1748. Asia Publishing House. p. 227. ISBN 9780210405987.
  2. M. A. Nayeem (2000). History of Modern Deccan, 1720/1724-1948: Political and administrative aspects. Abul Kalam Azad Oriental Research Institute. p. 38.
  3. Beveridge H. (1952). The Maathir Ul Umara Vol-ii (1952). The Calcutta Oriental Press Ltd. p. 647.
  4. 4.0 4.1 4.2 Sarojini Regani (1988). Nizam-British Relations, 1724-1857. Concept Publishing Company. ISBN 9788170221951.
  5. Naravane, M.S. (2014). Battles of the Honourable East India Company. A.P.H. Publishing Corporation. p. 155. ISBN 9788131300343.