Jump to content

మౌలాలి గుట్ట

అక్షాంశ రేఖాంశాలు: 17°15′57″N 78°35′48″E / 17.26583°N 78.59667°E / 17.26583; 78.59667
వికీపీడియా నుండి
మౌలాలి గుట్ట
మౌలాలి గుట్ట (1875)
మౌలాలి గుట్ట (1875)
అత్యంత ఎత్తైన బిందువు
ఎత్తు614.7 మీ. (2,017 అ.)
నిర్దేశాంకాలు17°15′57″N 78°35′48″E / 17.26583°N 78.59667°E / 17.26583; 78.59667
భౌగోళికం
మౌలాలి గుట్ట is located in India
మౌలాలి గుట్ట
మౌలాలి గుట్ట
Moula Ali hill is located in northeast Hyderabad
స్థానంమౌలాలి, హైదరాబాదు, తెలంగాణ
అధిరోహణం
సులువుగా ఎక్కే మార్గం484 మెట్లు

మౌలాలి గుట్ట తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మౌలాలిలో ఉన్న గుట్ట. ఈ గుట్టపైన మౌలాలి దర్గా (హజ్రత్‌ అలీ బాబా దర్గా) ఉంది. మౌలాలి ప్రాంతంలో ముస్లింలు అధికంగా ఉంటారు.[1]

ప్రత్యేకతలు

[మార్చు]

మౌలాలి గుట్ట సుమారు 614 మీటర్లు (2,014 అడుగులు) ఎత్తు ఉంది.[2] దర్గా నుండి గుట్ట కిందకు 484 మెట్లు, గుట్ట చుట్టూ 600 సమాధులు ఉన్నాయి.[3]

ఈ గుట్ట సమీపంలో "ఖదమ్-ఇ-రసూల్" అని పిలువబడే మరొక గుట్ట ఉంది, మహ్మద్ షక్రుల్లా రహాన్ అనే అసఫ్ జాహి సేవకుడు ప్రవక్త పవిత్ర అవశేషాలను ఇక్కడ భద్రపరిచాడు.[2]

చరిత్ర

[మార్చు]

గుట్ట సమీప ప్రాంతంలో నవీన శిలా యుగం కాలం నుండి మానవులు నివసించేవారు. ఇక్కడ జరిపిన తవ్వకాలలో కుండలు, ఇనుప ఉపకరణాలు, మానవ అస్థిపంజరపు శకలాలు దొరికాయి.[3]

1578లో కుతుబ్ షాహి కోర్టు నపుంసకుడైన యాకుత్ అనారోగ్యంతో ఉన్నప్పుడు, కలలో ఆకుపచ్చ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి కనిపించి మౌలాలి గుట్టపైన హజ్రత్‌ అలీ తన కోసం ఎదురుచూస్తున్నాడని, వెంటనే ఆ గుట్టను సందర్శించమని చెప్పాడు. కలలోనే యాకుత్ ఆ వ్యక్తితో అక్కడికి వెళ్ళగా, గుట్టపైన కూర్చున్న హజ్రత్‌ అలీ రాతిపై చేయి వేసుకుని కూర్చొని తన శరీరాన్ని తాకి దీవించాడు. మరుసటి రోజు ఉదయం, యాకుత్ అనారోగ్యం నయమైన తరువాత గుట్టపైన ఉన్న రాయి దొరికిందని, దానిపై హజ్రత్‌ అలీ చేతి గుర్తులు ఉన్నట్లు చరిత్రకారులు చెబుతారు. ఈ సంఘటన గురించి విన్న సుల్తాన్, గుట్టను సందర్శించి అక్కడ ఒక దర్గా నిర్మించమని ఆదేశించాడు. ఆ రాయిని దర్గాలో ప్రతిష్టించారు.[2][4][5][6]

ఈ సంఘటన తరువాత ఈ గుట్టకు 'మౌలా అలీ' ('మై లార్డ్ అలీ) అనే పేరు వచ్చింది. ఈ రాయికి వైద్యం చేసే శక్తి ఉందని నమ్ముకంతోపాటు సూఫీలు, సన్యాసులు, ఆధ్యాత్మికవేత్తలకు ప్రాచుర్యం పొందింది.[5]

కుతుబ్ షాహి సుల్తానులు 17వ రిజాబ్‌లో గుట్ట నుండి గోల్కొండ వరకు ప్రతి సంవత్సరం జరిగేలా ఉత్సవాన్ని ప్రారంభించారు. కాని సున్నీ ముస్లింలు 1687లో హైదరాబాదును స్వాధీనం చేసుకున్న తరువాత, పండుగ తాత్కాలికంగా ఆగిపోయింది. నిజాం పాలనలో, ఈ పండుగ రెండు ముఖ్యమైన జాతీయ పండుగలలో ఒకటిగా జరుపబడింది.[5]

మౌలాలి దర్గా

[మార్చు]

మౌలాలి దర్గా గుట్ట పైన ఉంది. దీనిని సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్‌షా[2] కట్టించాడు. ముహమ్మద్ ప్రవక్త అల్లుడైన అలీ ఇబ్న్ అబీ తాలిబ్ కు అంకితం చేయబడిన ఏకైక దర్గా ఇది.[7][8] ఈ దర్గా లోపలిభాగం వేలాది అద్దాలతో అలంకరించబడింది.[4] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థకు సంబంధించిన వారసత్వ పరిరక్షణ కమిటీ హైదరాబాదులో గుర్తించిన 11 వారసత్వ ప్రదేశాలలో ఈ దర్గా కూడా ఉంది.[9]

ఇతర వివరాలు

[మార్చు]
  1. తెలంగాణలో మొదటిసారిగా 1587లో కుతుబ్‌షాహి రాజుల కాలంలో మౌలాలి గుట్ట మీద పీర్లను నిలబెట్టారు.
  2. ప్రతి సంవత్సరం హజ్రా క్యాలెండర్‌ ప్రకారం ఇక్కడ ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తారు. హజ్రత్‌ ఆలీ జయంతి, వర్థంతి కార్యక్రమాలకు ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, కువైట్, పాకిస్తాన్, దేశాలనుంచి వస్తుంటారు. ఈ వేడుకలలో హిందువులు కూడా పాల్గొంటారు.
  3. అసఫ్‌ జాహి వంశానికి చెందిన రెండో సుల్తాన్‌ సాని ఫారిజ్జా దర్గా ఇమాం రజ్వీ సయ్యద్‌ దర్గా అభివృద్ధి నిమిత్తం చర్లపల్లి గ్రామాన్ని జాగీరుగా సమర్పించారు.[10]
  4. నిజాం రాజనర్తకి, అగ్రశేణి కవయిత్రి మహ్‌లఖా బాయి చందా ఈ ప్రాంతంలో మొగలాయి, రాజస్థానీ నిర్మాణ శైలిలో నాణ్యమైన పాలరాతిలో సువిశాల భవంతి నిర్మించుకుంది.[11]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. సాక్షి, తెలంగాణ (20 March 2019). "ఉర్సుకు సర్వం సిద్ధం". Sakshi. Archived from the original on 12 April 2020. Retrieved 12 April 2020.
  2. 2.0 2.1 2.2 2.3 Syed Ali Asgar Bilgrami (1927). Landmarks of the Deccan: A Comprehensive Guide to the Archaeological Remains. ISBN 9788120605435.
  3. 3.0 3.1 Dept. of Information and Public Relations (1953). History and legend in Hyderabad.
  4. 4.0 4.1 Sarina Singh; Lindsay Brown; Paul Harding; Trent Holden; Amy Karafin; Kate Morgan; John Noble (1 September 2013). Lonely Planet South India & Kerala. ISBN 9781743217948.
  5. 5.0 5.1 5.2 William Dalrymple (27 April 2004). White Mughals: Love and Betrayal in Eighteenth-Century India. ISBN 9781101098127.
  6. Syeda Imam (14 May 2008). The Untold Charminar. ISBN 9788184759716.
  7. Harriet Ronken Lynton (1987). Days Of The Beloved. ISBN 9780863112690.
  8. Director of Print. and Stationery at the Government Secretariat Press (2000). Andhra Pradesh District Gazetteers: Ranga Reddy.
  9. Madhu Vottery (11 December 2012). A Guide to the Heritage of Hyderabad. ISBN 9788129125842.
  10. నవతెలంగాణ, స్టోరి (23 March 2015). "మతసామరస్యానికి ప్రతీక మౌలాలి దర్గా". NavaTelangana. Archived from the original on 12 ఏప్రిల్ 2020. Retrieved 12 April 2020.
  11. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (30 June 2019). "రాణి కాని మహారాణి...మహ్‌లఖా బాయ్‌". www.andhrajyothy.com. Archived from the original on 12 April 2020. Retrieved 12 April 2020.