రంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)
Sri Ranganathaswamy Temple Srirangam | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 10°51′45″N 78°41′23″E / 10.86250°N 78.68972°E |
దేశం | India |
రాష్ట్రం | Tamil Nadu |
జిల్లా | Tiruchirapalli |
ప్రదేశం | Srirangam |
సంస్కృతి | |
దైవం | Ranganatha (Vishnu), Ranganayaki (Lakshmi)[1] |
ముఖ్యమైన పర్వాలు |
|
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | Dravidian[3] |
శాసనాలు | over 600 |
చరిత్ర, నిర్వహణ | |
సృష్టికర్త | Early Cholas, Medieval Cholas, Later Cholas, Pandyas, Vijayanagara Empire |
వెబ్‌సైట్ | http://www.srirangam.org/ |
శ్రీరంగనాథస్వామి ఆలయం, తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు. ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన తివియ ప్రబంధంలో వివరించారు. ఈ గ్రంథంలో 6 నుంచి 9వ శతాబ్దం వరకు ఉన్న ఆళ్వారుల గురించి రాశారు. ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన 108 దివ్య దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు వైష్ణవులు. ఈ ఆలయంలో తెంకలై సంప్రదాయంలో పూజాధికాలు జరుగుతాయి.
దక్షిణ భారతదేశంలో పురాతనమైన, ప్రముఖమైన వైష్ణవ ఆలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయ చరిత్ర చాలా సుప్రసిద్ధమైనది. కావేరి నదిలో ఒక ద్వీపం వంటి దానిలో ఉండే ఈ ఆలయం ఎన్నో ముస్లిం, యూరోపియన్ రాజుల దండయాత్రలకు గురైంది. ఈ ఆలయ ముఖద్వారమైన రాజగోపురం దాదాపు 13 సెంట్ల విస్తీర్ణంలో ఉంది. ఈ గోపురం ఎత్తు 237 అడుగులు కావడం మరో విశేషం. ఈ గోపురానికి 11 అంతస్తులు ఉన్నాయి. తమిళ నెల మార్గళి (డిసెంబరు నుంచి జనవరి) లో జరిగే 21 రోజుల పాటు జరిగే ఉత్సవంలో దాదాపు పది లక్షల మంది పాల్గొంటారు. శ్రీరంగంలోని ఈ దేవాలయాన్ని ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటారు. నిజానికి కంబోడియాలోని అంగ్కోర్ వాట్ ఉన్నా, ప్రస్తుతం అది బౌద్ధ దేవాలయంగా మారిపోయింది. ఈ దేవాలయం 156 ఎకరాల్లో 4,116 మీటర్ల చుట్టుకొలతతో భారతదేశంలోనే అతి పెద్ద ఆలయంగా నిలిచింది. అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద మత ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.
ప్రధాన దైవం
[మార్చు]శ్రీరంగనాథస్వామి ఆలయం, తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు. ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన తివియ ప్రబంధంలో వివరించారు. ఈ గ్రంథంలో 6 నుంచి 9వ శతాబ్దం వరకు ఉన్న ఆళ్వారుల గురించి రాశారు. ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన 108 దివ్య దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు వైష్ణవులు. ఈ ఆలయంలో తెంకలై సంప్రదాయంలో పూజాధికాలు జరుగుతాయి.
దేవతలు
[మార్చు]ఈ ఆలయంలోరంగనాథ స్వామి సన్నిధితో పాటు, 53 ఉప-సన్నిధులూ కూడా ఉన్నాయి.
- ధన్వంతరి సన్నిధి
- గరుడాళ్వార్ సన్నిధి
- ఉడయవర్ సన్నిధి
- తాయారు సన్నిధి
- హయగ్రీవార్ సన్నిధి
- చక్రధ్వజ్వర్ సన్నిది
చరిత్ర
[మార్చు]కావేరి, కోలెరూన్ లేదా కొల్లిదంల ద్వారా రూపుదిద్దుకున్న ఓ చిన్న ద్వీపంవద్ద ఈ ఆలయం వెలసింది. 108 ప్రధాన విష్ణు దేవాలయాల్లో ఈ ఆలయం మొదటిదిగా, అత్యంత ప్రధానమైనదిగా ఇది ప్రాచుర్యం పొందుతోంది. ఆలయ ప్రాంగణం 156 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. దీనికి ఏడు ప్రహరీలు ఉన్నాయి. ఈ ప్రహరీలు దృఢమైన, భారీ బురుజులున్న గోడలతో నిర్మించబడ్డాయి. ఆలయ గర్భగుడి చుట్టూ ఇవి ఆవరించి ఉంటాయి. అన్ని ప్రాకారాల్లో ఉన్న 21 బ్రహ్మాండమైన స్తంభాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి.
ఈ ఆలయం వేల సంవత్సరాలనాటి ప్రాచీన నాగరికతనూ చాటి చెబుతుంది. కోరమండలం తీరాన్నీ, తూర్పు దక్కన్ ప్రాంతంలోని ప్రధాన భూభాగాన్నీ మూడు వందల ఏళ్ళకు పైగా పరిపాలించిన చోళ వంశం ఆ ప్రాంతాల్లో ఓ పురోగామి హిందూ సంస్కృతి వర్థిల్లేందుకు దోహదపడ్డారు. 13వ శతాబ్దంలో చోళులు మధురైకి చెందిన పాండ్యుల చేతిలో, మైసూరుకు చెందిన హోయసల రాజుల చేతిలో ఓడిపోయారు. శ్రీరంగంలో ఆలయ నిర్మాణంపై హోయసలులు ప్రత్యేకమైన శ్రద్ధ చూపారు కానీ, అవి శాసనాలూ, భవనాల వరకూ మాత్రమే పరిమితమైపోయాయి. హోయసలులను 14వ శతాబ్దం మొదటి భాగంలో పాండ్యులు ఓడించారు. ఆ తర్వాత, దక్కన్ పీఠభూమి మీద మహమ్మదీయులు తరచూ దాడులు చేసినప్పటికీ, 1336లో విజయనగరంలో ఏర్పడిన హిందూ సామ్రాజ్యం నుంచి గట్టి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సామ్రాజ్యం తన స్వతంత్ర ప్రతిపత్తిని 1565 వరకూ కొనసాగించుకోగలిగింది. అదే సమయంలో యూరోపియన్లు దక్షిణ భారతదేశంలో కాలుపెట్టారు. పదహారో శతాబ్దంలో అనేకమంది విదేశీ పర్యాటకులూ, వ్యాపారులూ ఈ మార్గాల్లోంచీ ప్రయాణాలు సాగించారు, కానీ విజయనగర సామ్రాజ్యం తమ వ్యాపారాలకోసం సమకూర్చిన మార్గాలమీద తప్పితే పోషక భూభాగాలమీద వారికి ఆసక్తి చాలా తక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలో, 1600లో ఆంగ్లేయుల ఈస్టిండియా కంపెనీ, 1664లో ఫ్రెంచి కంపెనీలు వెలిశాయి. ఔరంగజేబు రాజు (1658-1707) పశ్చిమ దక్కన్ ప్రాంతంలో దండయాత్రకు బయలుదేరే క్రమంలో, ఆక్రమణలూ, భారీ ప్రాణనష్టం తరువాత, బీజాపూర్, గోల్కొండ కోటలు అతని ఆధీనంలోకి వచ్చాయి, అతని మరణం వరకూ ఈ దండయాత్రలు కొనసాగుతూనేవున్నాయి.
ఉత్సవాలు
[మార్చు]జ్యేష్టాభిషేకం
[మార్చు]ఆలయంలో పేరుకుపోయిన మలినాల్ని తొలగించడం కోసం జూన్-జులై మాసంలో ఈ జ్యేష్టాభిషేకం ఉత్సవం చేస్తారు. ఆ రోజున, ఆలయ గర్భగుడిని శుభ్రపరచి ఆలయంలో ప్రత్యేకంగా తయారుచేసిన మూలికా తైలాన్ని పెరియ పెరుమాళ్‌కు పూస్తారు. నామ్‌పెరుమాళ్, అమ్మవార్ల బంగారు తొడుగులను స్వర్ణకారులు మెరుగుపెడతారు. అనేకమంది అర్చకులు, భక్తులు బంగారు, వెండి కలశాల్లో పవిత్ర జలాల్ని తీసుకువచ్చేందుకు కావేరీ నదికి వెళ్ళి, బంగారు కలశాల్ని ఏనుగు మీద తీసుకొస్తారు. ఈ బంగారు కలశాన్ని 1734లో విజయనగర చొక్క నాయకర్ బహూకరించారు. ఆ తరువాతి కాలంలో కొందరు దొంగలు దాన్ని ఎత్తుకెళ్ళారని, కానీ భగవంతుడి కృపవల్ల అది తిరిగి స్వాధీనమయిదని అనుకుంటారు. ఈ శాసనం ఆ బంగారు కలశం మీద తెలుగుభాషలో చెక్కించి ఉంది. ఆలయంలో ఉన్న వెండి పాత్రల్ని కూడా పవిత్ర కావేరీ జలాలతో నింపి, ఆలయానికి తీసుకొస్తారు. కావేరి నుంచి ఆలయానికి వచ్చే మార్గంలో వేద మంత్రోచ్ఛారణలు హోరెత్తుతాయి. ఆలయంలో ఉన్న విగ్రహాలన్నిటినీ “తిరువెన్నయలి ప్రాకారం’లో ఉంచుతారు. విగ్రహాలనుంచి బంగారు తొడుగుల్ని తొలగించి, జియ్యర్ స్వామీజీ, వధుల దేశికార్ స్వామిలకు అప్పగిస్తారు. ఆ తరువాత తొడుగులకు స్వర్ణకారుడు మెరుగుపెడతారు. భక్తులు పూజించుకున్న తర్వాత సాయంత్రం తిరిగి తొడుగుల్ని అలంకరిస్తారు.[4]
పవిత్రోత్సవం
[మార్చు]నిత్యం నిర్వహించే పూజల్లో సంభవించే లోపాలు సరిదిద్దేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని తమిళ మాసమైన అని (ఆగస్టు- సెప్టెంబరు) లో పూజాదికాల్లో దోషాలను తొలగించేందుకు యజ్ఞోపవీతాన్ని స్వామివారికి అలంకరించేందుకు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి రోజు ఉత్సవ విగ్రహానికి యాగశాలలో 365 సార్లు తిరువర్ధనం జరుపుతారు. రెండో రోజు గర్భగుడిలోని దేవతామూర్తులందరికోసం 1008 సార్లు తిరువర్ధనం జరుపుతారు. ఈ ఉత్సవ సమయంలో భక్తులందరూ పవిత్రమైన నూలు దారాల దండను దేవతామూర్తులకూ అలంకరిస్తారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Roshen Dalal 2010, pp. 339–340.
- ↑ Aguilar, Rafael; Torrealva, Daniel; Moreira, Susana; Pando, Miguel A.; Ramos, Luis F. (2018). Structural Analysis of Historical Constructions: An Interdisciplinary Approach (in ఇంగ్లీష్). Springer. ISBN 9783319994413. Retrieved 26 February 2019.
- ↑ Stella Kramrisch 1988, p. 202-204 with footnotes.
- ↑ "చరిత్ర". srirangam.org. Archived from the original on 7 జూలై 2016. Retrieved 13 April 2018.