Jump to content

రారాజు (2006 సినిమా)

వికీపీడియా నుండి
రారాజు
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం ఉదయశంకర్
నిర్మాణం జి.వి.జి.రాజు
కథ ఉదయశంకర్
చిత్రానువాదం ఉదయశంకర్
తారాగణం గోపీచంద్
మీరా జాస్మిన్
అంకిత
వేణు మాధవ్
ఆశిష్ విద్యార్థి
సంగీతం మణిశర్మ
సంభాషణలు చింతపల్లి రమణ
ఛాయాగ్రహణం రామనాధ్ శెట్టి
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ ఎస్.ఎస్.సి.ఆర్ట్స్
విడుదల తేదీ 20 అక్టోబర్ 2006
నిడివి 2:15:43
భాష తెలుగు
పెట్టుబడి 9 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

రారాజు (ఆంగ్లం: Raraju) 2006లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్.ఎస్.సి.ఆర్ట్స్ పతాకంపై జి.వి.జి.రాజు నిర్మించిన ఈ సినిమా కి ఉదయశంకర్ దర్శకత్వం వహించారు.[1] ఈ చిత్రంలో గోపీచంద్, మీరా జాస్మిన్, శివాజీ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

కధాంశం

[మార్చు]

కాళి (గోపీచంద్) ప్రజా సమావేశాలు సహా స్థానిక విధులు, వివాహాలు కోసం లైటింగ్, మైక్ ఏర్పాటు చెసే ఒక సాధారణ వ్యక్తి. ఇది గడువులు, బాకీల విషయానికి వస్తే అతడు చాలా దయగలవాడు, అదే సమయాల్లో కఠినమైన వ్యక్తి. కాలనీ లో ప్రతి ఒక్కరూ అతనినికి భయపడతారు, అదే సమయంలో అతడి దయగల వ్యక్తిత్వం వల్ల అతడిని అభిమానిస్తారు. ఆ ప్రాంతం యొక్క SI ఎల్లప్పుడూ కాళి చుట్టు తిరుగుతు ఉంటుంది, ఆమె అతనితో ప్రేమలో ఉందని చెప్పడం జరుగుతుంది , కానీ కాళి పట్టించుకోడు. ఈ పరిస్థితిలో, జ్యోతి (మీరా జాస్మిన్) అని ఒక అమ్మాయి కాలనీ కి వస్తుంది. ఆమె సినిమా చిత్రలలో పాటలుకు కోరస్ పాడటం ద్వారా తన జీవనం సాగిస్తుంది. కొంత మంది రౌడీలు ఆమె పై దాడి ప్రయత్నించినప్పుడు, ఆ SI ఆమె కాళి తాలుకా అని హెచ్చరించింది. అలా ఆమె తన కాళి జీవితంలో ప్రవేశిస్తుంది. కాళి కూడా ఆమె తనను ప్రేమిస్తున్నట్లు భావిస్తాడు, అతడు ప్రేమిస్తాడు . కాని ఒకానొక సందర్భంలో, కాళి ఆమె గతం గురించి తెలిసి వస్తుంది.

సూర్య (శివాజీ) ఒక గుమాస్తా (చంద్రమోహన్) కుమారుడు ఐఎఎస్ అధికారి కావాలని కోరుకుంటాడు. సూర్య, జ్యోతి ఒక వ్యభిచార కేసులొ చిక్కుల్లో పెట్టలని ప్రయత్నించే ఒక వంకర పోలీసు అధికారి కొటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఆశిష్ విద్యార్థి) కారణంగా, సర్వీస్ పరీక్ష కు హజరు కాలేకపొతారు. ఫలితంగా, జ్యోతి యొక్క సవతితల్లి తనను ఇంటి నుండి గంటివెస్తంది. ఆమె సూర్య ఇంట్లో ఆశ్రయం పొందుతుంది . అలా వారు ఇద్దరు తో ప్రేమ లో పడతారు. కాని, దురదృష్టవశాత్తు, సూర్య ఒక ప్రమాదంలో చనిపోతాడు, కానీ జ్యోతి అతడి ని ఇప్పటికి మరచిపొలేకపొతుంది. ఇది తెలుసుకొవటం తొ, కాళి జ్యోతి యొక్క ఆశయం నెరవేర్చాటం లో ఆమెకు సహాయం చెయాలని నిర్ణయించుకుంటాడు, ఆమె ఐఎఎస్ అధికారి అవ్వటానికి సహాయం చేస్తడు. ఆ ప్రక్రియలో,అతను వెంకట్ రెడ్డి కి కూడా ఒక గుణపాఠం చెప్తాడు. పతాక సన్నివేశం కి, సూర్య తల్లిదండ్రులు కాళి ని వివాహం చెసుకొమని జ్యోతి కి చెప్తారు. కాని, అన్ని సిద్ధంగా ఉన్నప్పుడు, కాళి జ్యోతి గుండె లో ఇప్పటికీ సూర్య ఉన్న కారణం గా ఆమెను వివాహం చెసుకొకుడదని నిర్ణయించుకుంటాడు.

తారాగణం

[మార్చు]

సంగీతం

[మార్చు]
Untitled

ఈ సినిమా కి మణిశర్మ సంగీతం అందించారు. అన్ని పాటలు మంచి ప్రజాదరణ పొందాయి. ఈ సినిమా పాటలని ఆదిత్య మ్యుజిక్ ద్వారా విడుదల చేసారు.[2]

సం.పాటపాట రచయితగాయకు(లు)పాట నిడివి
1."ఏంటట ఏంటట"అనంత శ్రీరామ్కార్తీక్3:49
2."చేమంతి చేమంతి"అనంత శ్రీరామ్కారుణ్య4:19
3."బంగారు చిలక"సుద్దాల అశోక్ తేజటిప్పు, కె. ఎస్. చిత్ర4:00
4."ముద్దుముద్దుగా"చిన్ని చరణ్రంజిత్, కళ్యాణి3:46
5."దానిమ్మ"అనంత శ్రీరామ్శంకర్ మహదేవన్, అనురాధ శ్రీరామ్4:17
మొత్తం నిడివి:20:26

మూలాలు

[మార్చు]
  1. "Raraju (2006)(Overview)". Idlebrain.com.
  2. "Raraju (2006) (Music)". Raaga.