లంచం
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
లంచం ఇవ్వడం, తీసుకోవడం కూడా చట్టరీత్యా నేరాలుగా పరిగణించబడతాయి. లంచాన్ని సామాన్యంగా కాని పనుల కోసం ప్రభుత్వ అధికారుల్ని ఒప్పించడానికి ఇస్తారు. బ్లాక్ న్యాయ నిఘంటువు ప్రకారం లంచం ఏ రూపంలో జరిగినా నేరంగానే నిర్వచిస్తారు. లంచం డబ్బుల రూపంలో గానీ లేదా బహుమతుల రూపంలో గానీ ఉంటుంది. సహాయ చర్యలు, ఆస్తి రూపంలో, ఓటు, లేదా ఇతర విధాలుగా సహాయం చేస్తానని మాటివ్వడం కూడా లంచం పరిథిలోకి వస్తాయి. లంచాలు తీసుకోవడానికి అలవాటు పడిన వ్యక్తిని 'లంచగొండి' అంటారు.
అవినీతి
[మార్చు]ప్రభుత్వోద్యోగి అవినీతికి పాల్పడినప్పుడు, ప్రజాధనాన్ని అపహరించినప్పుడు.. ఉద్యోగం నుంచి తొలగించడం ఒక్కటే సరైన శిక్ష అని భారత సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.అవినీతి కేసుల్లో డబ్బులు కొద్ది మొత్తమా, పెద్ద మొత్తమా అనేది సమస్యే కాదని పేర్కొంది.అవినీతి ఆచూకీని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఎవరైనా ఉచితంగా (టోల్‌ఫ్రీ నెంబరు) 155361 కు సమాచారం అందించవచ్చు.
"మన దేశంలో దాదాపు మూడో వంతు మంది అవినీతిపరులే,సగం మంది మధ్యస్థంగా ఉంటారు.ప్రజల్లో విలువలు కొరవడే కొద్దీ అవినీతి పెరిగిపోవడాన్ని నేను నిస్సహాయంగా చూస్తూ గడపవలసి వచ్చింది.నేను చిన్న వయసులో ఉన్నప్పుడు- అవినీతి పరుడిని హీనంగా చూసేవారు.నాడు అవినీతి పరుల పట్ల సమాజానికి తృణీకార భావన ఉండేది. అదిప్పుడు లేదు. సమాజం వారిని ఆమోదిస్తున్నది, డబ్బు ఉంటే గౌరవంగా చూస్తున్నారు, ఏ విధంగా సంపాదించారనేది పట్టించుకోవడం లేదు.మన దేశంలో ఇంకా నూటికి 20 మంది నిజాయితీ పరులున్నారు.వీరు ఏ ప్రలోభాలకూ లొంగని వారు. వారికి అంతరాత్మ అంటూ ఉంది "--- ప్రత్యూష్ సిన్హా, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్
- "అవినీతి మొత్తం సామాజిక జీవనంలో భాగమైపోయింది.అవినీతి ఉద్యోగులను గుర్తించి త్వరిత గతిన దోషులను శిక్షించే విధానాలు చేపట్టాలి"
- "ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందడం, జనన మరణాల ధృవపత్రాలు తెచ్చుకోవడం, నివా స ధృవీకరణ, పాస్‌పోర్టు, భూమి హక్కులు వంటి పత్రాలు పొందడం వంటి వి తేలికగా, ముడుపులతో పని లేకుండా సాగాలి" - జాతీయ నాలెడ్జ్ కమిషన్.
- "ఎన్నికల వ్యవస్థతో ముడిపడిన అవినీతిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి" - పాలనా సంస్కరణల కమిషన్
అవినీతి నిర్మూలన
[మార్చు]అవినీతి నిర్మూలనకు ప్రత్యేక శాఖలున్నాయి.[1] ప్రతిఒక్కరి సహకారం దీనికి అవసరం. దీని కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలి.
మతాల అబిప్రాయం
[మార్చు]- వ్యాప్తిన్ జెందక,వగవక,
- ప్రాప్తించినలేశమైన పదివేలనిచున్
- దృప్తింజెందని మనుజుఁడు
- సప్త ద్వీపములనైనఁ జక్కంబడునే? ---- పోతన భాగవతం అష్టమ స్కంధము ౫౭౩
- న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును (సామెతలు 17:23)
- లంచము పుచ్చుకొనువాని దృష్టికి లంచము మాణిక్యమువలె నుండును. (సామెతలు 17:8)
- లంచము పుచ్చుకొనకూడదు. లంచము, దృష్టిగలవారికి గుడ్డితనము కలుగజేసి, నీతిమంతులమాటలకు అపార్దము చేయించును. (నిర్గమ 23:8)
- లంచము పుచ్చుకొనకూడదు. లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగజేయును (ద్వితీయోపదేశకాండము 16:19)
- ఇస్లాంలో ప్రకారం లంచం తీసుకోవడం తాజిర్ నేరాల (ta'azir crime) కిందకు వస్తుంది. నేర తీవ్రత బట్టి వీటికి జైలు శిక్ష లేదా కొరడా దెబ్బలు కొట్టాలని షరియా చట్టం చెబుతోంది.[2]
- లంచం ఇచ్చేవాడినీ పుచ్చుకునేవాడినీ, మధ్యవర్తిని అల్లాహ్ శపించాడని మహమ్మదు ప్రవక్త చెప్పాడు.[2] (దావూద్ :1595)
- ఒకరిధనాన్ని ఒకరు కాజేయకండి. అధికారులకు లంచం ఇవ్వకండి [3] (ఖురాన్ 2:188)
మూలాలు
[మార్చు]- ↑ అవినీతి నిరోధకశాఖ ఆంధ్ర ప్రదేశ్ జాలస్థలి[permanent dead link]
- ↑ 2.0 2.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-01-28. Retrieved 2010-09-12.
- ↑ http://quran.com/2/188