వనమా వెంకటేశ్వరరావు
వనమా వెంకటేశ్వరరావు | |||
| |||
పదవీ కాలం 1989-1994 1999-2008 2018 - 2023 జులై 25 | |||
నియోజకవర్గం | కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1944, నవంబరు 1 పాల్వంచ, పాల్వంచ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | నాగభూషణం - అన్నపూర్ణమ్మ | ||
జీవిత భాగస్వామి | పద్మావతి | ||
సంతానం | ఇద్దరు కుమారులు (రాఘవేంద్రరావు, రామకృష్ణ), ఇద్దరు కుమార్తెలు | ||
నివాసం | పాల్వంచ |
వనమా వెంకటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం[1] శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2]
జననం, విద్య
[మార్చు]వెంకటేశ్వరరావు 1944, నవంబరు 1న నాగభూషణం - అన్నపూర్ణమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలంలోని పాల్వంచ గ్రామంలో జన్మించాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన వెంకటేశ్వరరావు 1961లో కొత్తగూడెం హైస్కూల్ నుండి హెచ్.ఎస్.సి. వరకు చదివాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]వెంకటేశ్వరరావుకు పద్మావతితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు (రాఘవేంద్రరావు, రామకృష్ణ), ఇద్దరు కుమార్తెలు.
రాజకీయ విశేషాలు
[మార్చు]పాల్వంచ వార్డు సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వెంకటేశ్వరరావు 16 సంవత్సరాలు పాల్వంచ సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుండి 1989 (9వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ), 1999 (11వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ), 2004 (9వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ) సంవత్సరాలలో ఎమ్మెల్యేగా గెలిచాడు. 2008లో వైయస్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[3] విద్యా విధాన పరిషత్ మంత్రిగా పనిచేశాడు. 2014లో కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి జలగం వెంకటరావుపై 16,521 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 1999-2014 వరకు ఖమ్మం జిల్లాకు డిసిసి అధ్యక్షుడిగా పనిచేశాడు, 2019లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి జలగం వెంకటరావు పై 4,120 ఓట్ల మెజారిటీతో నాలుగవసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు.[4] అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[5][6]
వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం ఎమ్మెల్యే అఫిడవిట్ కేసులో ఆయన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు 2023 జూలై 25న తీర్పును వెల్లడించింది. దీంతో 2018లో ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకటరావును కోర్టు ఎమ్మెల్యేగా ప్రకటించింది.[7]
హోదాలు
[మార్చు]- 2007 - 2009: ఆరోగ్యశాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- చైర్మన్, ఏపిఎస్ఆర్టీసి, వరంగల్ రీజియన్
- సర్పంచ్, పాల్వంచ (16 సంవత్సరాలు)
- వైస్ చైర్మన్, పాల్వంచ మున్సిపాలిటీ
- చైర్మన్, ఎల్ఎంబి, కొత్తగూడెం
- చైర్మన్, కొత్తగూడెం అభివృద్ధి, ఏరియా కమిటీ
ఇతర వివరాలు
[మార్చు]చైనా, హాంకాంగ్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ దేశాలు సందర్శించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
- ↑ "Kothagudem Election Result 2018 Live Updates: Vanama Venkateswara Rao of INC Wins". News18 (in ఇంగ్లీష్). Retrieved 2021-09-19.
- ↑ India, The Hans (2019-01-18). "Vanama the oldest, Haripriya the youngest take oath as MLAs". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-09-19.
- ↑ "Vanama Venkateswara Rao(Indian National Congress(INC)):Constituency- KOTHAGUDEM(BHADRADRI) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-19.
- ↑ "కాంగ్రెస్‌కు మరో ఎమ్మెల్యే గుడ్‌బై: టీఆర్ఎస్‌లోకి వనమా". telugu.asianetnews.com. Retrieved 2021-09-19.
- ↑ "గులాబీ గూటికి వనమా..?". Sakshi. 2019-03-16. Retrieved 2021-09-19.
- ↑ Andhra Jyothy (25 July 2023). "కొత్తగూడెం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు.. టి. హైకోర్టు సంచలన తీర్పు". Archived from the original on 25 July 2023. Retrieved 25 July 2023.
- జీవిస్తున్న ప్రజలు
- తెలంగాణ శాసన సభ్యులు (2018)
- 1944 జననాలు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యక్తులు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయ నాయకులు
- ఖమ్మం జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
- తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు
- పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2009)
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (1989)
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (1999)
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2004)