వలీ దక్కని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వలీ దక్కనీ
పుట్టిన తేదీ, స్థలంవలీ మొహమ్మద్ వలీ
1667 (1667)
ఔరంగాబాదు
మరణం1707 (aged 39–40)
అహమ్మదాబాదు
కలం పేరువలీ ఔరంగాబాదీ, వలీ గుజరాతీ
వృత్తిPoet
కాలంమొగలు కాలం
రచనా రంగంగజల్, మస్నవీ, కసీదా, ముఖమ్మా

వలీ ముహమ్మద్ వలీ (1667-1707) భారతదేశానికి చెందిన సాంప్రదాయిక ఉర్దూ కవి. ఆయన వలీ దక్కనీ పేరుతో సుపరిచితుడు. ఆయన వలీ గుజరాతీ అనీ, వలీ ఔరంగబాదీ అనీ కూడా ప్రసిద్ధుడు. అతను ఉర్దూ కవిత్వానికి పితామహుడిగా చాలా మంది పండితులు భావిస్తారు.[1] ఉర్దూ భాషలో గజల్స్ కంపోజ్ చేసిన మొట్టమొదటి కవి. [2] ఆయన ఒక దివాన్ (మొత్తం వర్ణమాల లోని ప్రతీ అక్షరాన్ని కనీసం ఒక్కసారైనా పాదం చివరి అక్షరంగా వాడే ఘజళ్ళ సమాహారం) ను రచించాడు. భారత ఉపఖండంలో ప్రముఖ ఉర్దూ, పారశీక కవిగా ప్రసిధ్ధి. ఢిల్లీలో రేఖ్తా (ఉర్దూ ప్రాచీన నామం) కవిగా ఖ్యాతినొందాడు. అతను ప్రయాణాలు చెయ్యడానికి ఇష్టపడేవాడు. అది విద్యార్జన సాధనంగా భావించాడు. అతను ఢిల్లీ, సూరత్, బుర్హాన్‌పూర్‌లను సందర్శించాడు. మక్కా, మదీనాకు హజ్ యాత్రలు కూడా చేశాడు.

వలీ మస్నవి, ఖసీదా, ముఖమ్మస్, రుబాయి, గజల్ రచనల్లో ప్రవీణుడు. ఇతడు 473 గజళ్ళు, 3,225 అషార్లు రచించాడు.

వలీకి ముందు, భారతదేశంలో గజళ్ళు పర్షియన్ భాషలో రాసేవారు. అవన్నీ దాదాపు ఒరిజినల్ అసలు పెర్షియన్ మాస్టర్లైన సాది,జామి, ఖగానీ వంటి వారి ఆలోచనలు, శైలి లోనే రూపకల్పన చేసేవారు. వలీ ఒక భారతీయ భాషను వాడడం మాత్రమే కాకుండా, తన గజల్స్‌లో భారతీయ ఇతివృత్తాలను, జాతీయాలను, వర్ణనలనూ ఉపయోగించడం ప్రారంభించాడు.

1700 లో తన ఉర్దూ గజల్స్ తో కూర్చిన దివాన్‌ను తీసుకుని ఢిల్లీ పర్యటించినపుడు, ఉత్తరాన సాహిత్య వర్గాలలో అలలు సృష్టించాయి. అతని సరళమైన, సున్నితమైన, శ్రావ్యమైన ఉర్దూ కవితలు పర్షియన్ భాషను ప్రేమించే ఢిల్లీ కవులకు కవితా వ్యక్తీకరణ మాధ్యమంగా "రేఖ్తా" (ఉర్దూకు పాత పేరు) యొక్క అందం కళ్ళకు కట్టింది. వలీ మహ్మద్ వలీ పర్యటన ఢిల్లీలో ఉర్దూ గజల్ అభివృద్ధిని ఉత్తేజపరిచింది. జౌక్, సౌదా, మీర్ వంటి మహామహులు తయారవడానికి ఇది ప్రేరేపణ అయిందని భావిస్తారు.

వలీ1707 అహ్మదాబాద్లో మరణించాడు. అహ్మదాబాద్‌లోని షాహిబాగ్‌లోని అతని సమాధిని 2002 అల్లర్ల సమయంలో హిందూ గుంపు దాడి చేసి, దాని స్థానంలో తాత్కాలిక హనుమాన్ ఆలయాన్ని ఏర్పాటు చేసింది. ఇది పూర్తిగా ధ్వంసం చేసి, రాత్రికు రాత్రే అక్కడ రహదారిని నిర్మించారు.[3][4][5][6] నగర పౌరులు, సాహిత్య ప్రేమికుల నుండి నిరసనలు ఎదురైన తరువాత, గుజరాత్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. [3]

2010 లో, చిత్రనిర్మాత అన్నం గోపాల్ వలీ జీవితంపై షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించారు. అది విస్తృతంగా ప్రశంసలు పొందింది.[7]

మూలాలు

[మార్చు]
  1. Jalal, Ayesha (2002). "Chapter 11: Negotiating Colonial Modernity and Cultural Difference: Indian Muslim Conceptions of Community and Nation, 1878–1914". In Fawaz, Leila; Bayly, C. A (eds.). Modernity and Culture: From the Mediterranean to the Indian Ocean. Columbia University Press. p. 233. ISBN 978-0-231-50477-5. Archived from the original on 2019-07-01. Retrieved 2020-06-29 – via De Gruyter.
  2. "Wali Gujarati's tomb may be rebuilt following HC directions". The Times of India. Ahmedabad. February 2012. Archived from the original on 2013-09-15. Retrieved 18 August 2013.
  3. 3.0 3.1 "Wali Gujarati's tomb may be rebuilt following HC directions". The Times of India. Ahmedabad. February 2012. Archived from the original on 2013-09-15. Retrieved 18 August 2013.
  4. "Wali Gujarati rediscovered". The Times of India. 18 December 2010. Archived from the original on 30 సెప్టెంబరు 2013. Retrieved 30 September 2013.
  5. Mehta, Harit (2 March 2004). "Vali Gujarati's tomb is still levelled road". The Times of India. Retrieved 5 March 2016.
  6. Siddharth Varadarajan (2002). Gujarat, the Making of a Tragedy. Penguin Books India. p. 111. ISBN 978-0-14-302901-4.
  7. "Wali Gujarati rediscovered". The Times of India. 18 December 2010. Archived from the original on 30 సెప్టెంబరు 2013. Retrieved 30 September 2013.