వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి
ఈ పేజీ తాజాకరించటానికి కేషేను విసర్జించండి
నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి చేసుకునే పేజీ ఇది. ఇతరులను వికిపీడియా నిర్వాహక హోదాకై ప్రతిపాదించడానికీ, నిర్వాహక హోదాకై స్వీయ ప్రతిపాదన చేయటానికీ ఈ పేజీని ఉపయోగించాలి. నిర్వాహకులకు వికీపీడియా నిర్వహణార్ధం కొన్ని సాంకేతిక సౌలభ్యాలను ఉపయోగించేందుకు అనుమతి ఉంటుంది. ఇక్కడ నిర్వాహకహోదాకై విజ్ఞప్తి చేసేముందు నిర్వాహక హోదా కొరకు ప్రమాణాలు, నిర్వాహకులు చదవవలసిన జాబితా, నిర్వాహణా మార్గదర్శిని మొదలైన పేజీలను చదవండి.
నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి గురించి
[మార్చు]వికీపీడియా విధానాల గురించి బాగా తెలిసిన సముదాయ సభ్యులకు నిర్వాహక హోదా ఇస్తారు. నిర్వాహకులకు వికీపీడియాలో ప్రత్యేక అధికారాలేమీ వుండవు, కానీ కొన్ని బాధ్యతలతో వికీని ముందుకు నడిపిస్తారు. కొందరు సభ్యులు వారిని వికీపీడియా యొక్క అధికారిక ముఖంగా భావిస్తారు కాబట్టి వారిని ఉన్నతంగా చూస్తారు.
- నిర్వాహకుల కొన్ని బాధ్యతలు
- నిర్వాహకులు మర్యాదగా ఉండాలి.
- ఇతరులతో వ్యవహరించేటపుడు ఓర్పు గానూ, మంచిగానూ నడుచుకోవాలి.
- నిర్ణయాలు తీసుకోవడంలో సమన్వయం పాటిస్తూ, మంచి నిర్ణాయక శక్తిని కలిగి వుండాలి.
- ఈ గుణాలు అభ్యర్ధులకు ఉన్నాయని ప్రజలు నిర్ధారించుకోవడానికి సరిపడినంత కాలం వారు వికీపీడియాలో ఉండి వుండాలి.
ఇంతా చేసి, నిర్వాహక హోదా అంటే అదో గొప్ప విషయమేమీ కాదు. నిర్వాహకుని చర్యలను తిరగదోడవచ్చు. ఏ ఇతర సభ్యులైనా హెచ్చరించవచ్చు. నిర్వాహకులకు మాత్రమే సంబంధించిన నియమాలు, విధానాలు ఉన్నాయి - అందుచేత అది ఒక అదనపు బాధ్యత మాత్రమే.
అభ్యర్ధిత్వ ప్రమాణాలు
[మార్చు]కొత్త నిర్వాహకులకు కనీసం మూడు నెలల అనుభవం, 1000 దిద్దుబాట్లూ ఉండాలి. నిర్వాహక హోదా కొరకు ప్రమాణాలు చూడండి. అభ్యర్ధి దిద్దుబాట్లను లెక్కించడానికి కౌంట్/కేట్ సాధనం వాడవచ్చు; గుర్తుంచుకోండి - అప్రధానమైన దిద్దుబాట్లు అతిగా చేసి దిద్దుబాట్ల సంఖ్యను కృత్రిమంగా పెంచవచ్చు.
మిమ్మల్ని మీరే ప్రతిపాదించుకోవచ్చు.
అనామక సభ్యులు అభ్యర్ధులు కాలేరు, ఇంకొకరిని ప్రతిపాదించలేరు, వోటు చెయ్యలేరు. వ్యాఖ్యానం మాత్రం చెయ్యగలరు.
ప్రతిపాదన విధానం
[మార్చు]వోట్లు, వ్యాఖ్యల కొరకు ప్రతిపాదనలు సాధారణంగా వారం రోజులు వుంటాయి. ఏకాభిప్రాయం రానప్పుడు దీనిని పెంచే అధికారం అధికారులకు వుంది; కనీసం 75-80 శాతం మంది ప్రతిపాదనను బలపరచాలి. అసాధారణ పరిస్థితులలో మొత్తం వోట్లన్నిటినీ రద్దు చేసి మళ్ళీ వోటుకు పెట్టే అధికారం అధికారులకు కలదు. అనవసరమైన చెడు భావనలు వ్యాపించకుండా నిరోధించడానికై, ఖచ్చితంగా వీగి పోతాయనుకున్న ప్రతిపాదనల్ని ముందే తీసివేయవచ్చు; కాకపోతే, ఎక్కువ మంది ఎడిటర్లు వికీపీడియాను రోజూ చూడరు కాబట్టి అవసరమైనంత సమయం ఇవ్వాలి. ఎటువంటి పరిస్థితులలోనైనా సరే ముందే తీసివేయడాన్ని కొందరు సభ్యులు వ్యతిరెకిస్తారు. మీ ప్రతిపాదనను తిరస్కరిస్తే, మళ్ళీ ప్రతిపాదించడానికి కాస్తంత సమయం (ఓ నెల) తీసుకోండి.
- వోటింగు
మీ వోటు వేయడానికి, ఆ అభ్యర్ధికి చెందిన విభాగాంలో రాయండి. అకౌంటున్న వికీపీడియన్లందరూ వోటెయ్యడానికి ఆహ్వానితులే. వ్యాఖ్యానాలు విభాగంలో దీర్ఘమైన చర్చలు జరగాలి.
అభ్యర్ధిని మీరు బలపరుస్తున్నారో (సపోర్ట్) లేక వ్యతిరేకిస్తున్నారో (అపోస్) సూచించండి. తటస్థ వోటును కూడా వెయ్యవచ్చు - అంతిమ లెక్కింపులో వీటిని లెక్కించరు. వోటు వేసినపుడు, అందునా వ్యతిరేక, తటస్థ వోట్లు వేసినపుడు వివరణ ఇవ్వండి. అందువలన అభ్యర్ధీ, ఇతర సభ్యులు దానిని అర్ధం చేసుకుని, పరిశీలించడానికి వీలవుతుంది. వోట్లు పోటాపోటీగా వున్నపుడు, తటస్థ వోట్లకు సంబంధించిన వాటితో సహా అన్ని వివరణలు, వ్యాఖ్యలు కూడా పరిశీలిస్తారు. వోటింగు చేసేటపుడు వోట్ల సంఖ్యను కూడా మార్చాలి.
మీ వ్యాఖ్యల్లో ఇతరుల పట్ల గౌరవంగా వ్యవహరించండి. కొన్ని వ్యాఖ్యలు వివదాస్పదంగా, ఉద్వేగాలను రెచ్చగొట్టేవిగా వుండవచ్చు. మనమందరం భావావేశాలు, ఉత్సాహ ఉద్వేగాలు, స్వాభిమానం కలిగిన మనుష్యులమని గుర్తుంచుకోండి.
స్వీయ ప్రతిపాదనలు
[మార్చు]స్వీయ ప్రతిపాదకులు పైన చూపిన అర్హతలను ఒకసారి పరిశీలించాలి. స్వీయ ప్రతిపాదకులు "సాధారణ మార్గదర్శకాలను బాగా అధిగమించి వుండాలి", "చాలా" నెలలుగా అకౌంటు కలిగి వుండాలి, "ఎన్నో" వందల దిద్దుబాట్లు చేసివుండాలి (1000 కంటే తక్కువ దిద్దుబాట్లు చేసిన వారికి నిర్వాహకుడయ్యే వాస్తవ అవకాశం లేనట్లే). అంటే దీనర్ధం, స్వీయ ప్రతిపాదకులు మామూలు అభ్యర్ధుల కంటే తక్కువ అర్హతలు కలవారని కాదు; కాకపోతే, కొందరు ఎడిటర్లు ప్రతిపాదన చేసే వారితో తమకు గల పరిచయాన్ని బట్టి అభ్యర్ధిత్వాన్ని ఒక మెట్టు పైన నిలబెడతారు. ఎక్కువ మంది వోటర్లు అందరు అభ్యర్ధుల్నీ వారి వారి అర్హతలను బట్టే పరిశీలిస్తారని ఆశించవచ్చు. స్వీయ ప్రతిపాదకుల్ని స్వతంత్ర భావాలు కలిగి వుంటారనే ఉద్దేశ్యంతో కోంతమంది ప్రత్యేక అభిమానంతో చూస్తారు. మంచి గతం కలిగివుండటమనేది ఇరువురికీ ముఖ్యమైనదే.
ఎవరినైన ప్రతిపాదించడం (మీతో సహా)
[మార్చు]ఈ పేజీలో ఇటీవలి ప్రతిపాదనకు పైన క్రింద నిచ్చిన వాక్యం రాయండి:
- {{వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/సభ్యనామం}}
- ----
- ఎర్రటి లింకును అనుసరించి వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/సభ్యనామం కు వెళ్ళి క్రింద నిచ్చిన దాన్ని రాయండి:
- ==[[సభ్యుడు:సభ్యనామం|]]==
- '''[{{SERVER}}{{localurl:వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/సభ్యనామం|action=edit}} ఇక్కడ వోటు వెయ్యండి] (0/0/0) ముగింపు తేదీ :{{subst:CURRENTTIME}} [[00 నెల]] [[2007]] (UTC)'''
- {{సభ్యుడు|సభ్యనామం}} - మీ ప్రతిపాదన/సభ్యుని గురించి వివరణ --~~~~
- {{subst:వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/అభ్యర్ధి ప్రశ్నలు}}
మీ ప్రతిపాదనను ఒకసారి సరి చూసుకోండి; [[00 నెల]] ను మీ సంతకం లోని తేదీ తో మార్చండి కానీ వారం రోజుల తరవాతి తేదీని వెయ్యండి.
ప్రస్తుత ప్రతిపాదనలు
[మార్చు]ప్రతిపాదనల్ని ముందుగా సంబంధిత సభ్యుడు అంగీకరించాలి. మీరెవరైనా సభ్యుని పేరు ప్రతిపాదిస్తే, వారి చర్చా పేజీలో సందేశం పెట్టి, వారికి అంగీకారమైతే, దానికి సమాధానాన్ని ఇక్కడికి పంపమనండి.
కొత్త వినతులను ఈ విభాగపు క్రింది భాగాన రాయండి. (మీరు వోటు వేసేటపుడు, శీర్షం (Header)లోని వోటు గణాంకాలను తగువిధంగా మార్చండి)
ప్రస్తుత సమయం - 21:41, 22 నవంబరు 2024 (UTC)
దయచేసి కొత్త ప్రతిపాదనలను ఈ గీతకు దిగువన ఉంచండి
గత ప్రతిపాదనలు
[మార్చు]ముగిసిన ప్రతిపాదనల జాబితాను ఇక్కడ చూడవచ్చు.
అధికారి హోదా కొరకు వినతి
[మార్చు]అధికారులు అంటే సముదాయ నిర్ణయం ప్రకారం కొత్త అధికారుల్నీ, నిర్వాహకుల్నీ తయారుచేసే అధికారం కలవారు. వీరు సభ్యుని యొక్క సభ్యనామాన్ని మార్చగలరు కూడా. అధికారిని నియమించే పధ్దతి కూడా పైన చూపిన నిర్వాహకుని నియామకం లాగానే కానీ సామాన్యంగా వినతి మేరకే జరుగుతుంది. వోట్ల సంఖ్య పరంగాను, వోటర్లను, అభ్యర్ధులను ఎంగేజి చేయగలగటంలోను, ముఖ్యమైన అభ్యర్ధిత్వ నిరాకరణల్లోను నిర్వాహకుని కంటే, అధికారికి ఎక్కువ బాధ్యతలు ఉంటాయి.
క్లిష్టమైన అంశాలపై ఏకాభిప్రాయాన్ని సమీకరించగలిగి, వాటిపై తమ నిర్ణయాలను వివరించడానికి అధికారులు సిధ్ధంగా వుండాలి. వోటు విభాగాలు, బాయిలర్ ప్లేట్ ప్రశ్నలు {{subst:వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/అభ్యర్ధుల ప్రశ్నలు}} లో పొందుపరచవచ్చు. ఇటీవలి అధికారులు , విఫలమైన అధికారి విజ్ఞప్తులు , వికీపీడియా:సమ్మతించని అధికారి హోదా విజ్ఞప్తులుచూడండి.
దయచేసి కొత్త విజ్ఞప్తులను ఈ గీతకు దిగువన ఉంచండి
సంబంధిత విజ్ఞప్తులు
[మార్చు]- ఇతర వికీమీడియా ప్రాజెక్టులపై పనిచేయడానికి అనుమతికై విజ్ఞప్తులు
- మెటా పై నిర్వాహక హోదా లేదా అధికారి హోదా కొరకు విజ్ఞప్తి
- ఏదైనా ప్రాజెక్టుపై నిర్వాహక బాధ్యతలనుండి స్వయంగా తప్పుకోవడానికై విజ్ఞప్తులకు m:అనుమతులకై విజ్ఞప్తి చూడండి.
- ఎవరైనా సభ్యుని బాట్ గా గుర్తించాలంటే వికీపీడియా:Bot లో సర్వామోదం లభించాక వికీపీడియా:Bot/Requests for approvals లో చేయవచ్చు.
- నిర్వాక హక్కులను దురుపయోగం చేసే సంభావ్యత గురించి వ్యాఖ్యానానికై విజ్ఞప్తి చూడండి.
ఈ పేజీలో మార్పులు సరిగా జరగక పోతే, మీ కేష్ ను తొలగించండి లేదా ఇక్కడ నొక్కండి.