వికీపీడియా:ఇటీవలి అధికారులు
మీ మద్దతు ఇక్కడ తెలుపుము (సెప్టెంబర్ 21, 2006) ఆఖరి తేదీ : (సెప్టెంబర్ 28, 2006)
Chaduvari (చర్చ • దిద్దుబాట్లు) - తెలుగు వికీలో చదువరి గురించి తెలియని వారుండరు కానీ కొత్తవారి కోసము క్లుప్తముగా; ఆరువేలకు పైగా దిద్దుబాట్లు చేసిన వికివీరుడు. సముదాయానికి పందిరేసినాడు. తెలుగు వికిలో ఏ మూలకెల్లినా తెలుగు కనిపిస్తుందంటే చదువరి చలవే. ఇంటర్ఫేజును చాలా మటుకు తజుమా చేసింది ఈయనే. తెలుగు వికీ చర్చా పేజీల్లో తెలుగులో రాయాలని ఒక ఒరవడి సృష్టించిన ఆద్యుడు. అనేక విధములైన నిర్వాహాక భాద్యతలను నిర్వర్తించడమే కాకా అనేక సమగ్రమైన వ్యాసాలు కూడా రాశాడీయన. అధికారహోదాకు అన్ని విధాల అర్హుడు. ఈయన వికిసేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాధారణముగా అధికార హొదాకు స్వయం ప్రతిపాదనలే వస్తాయి కానీ మన వికిలో తొలి అధికారిగా ఇది ప్రత్యేకము. --వైఙాసత్య 21:04, 21 సెప్టెంబర్ 2006 (UTC)
చదువరి తన అంగీకారము ఇక్కడ తెలియ చేయవలెను.
- ఈ ప్రతిపాదన నాకంగీకారమే! __చదువరి (చర్చ, రచనలు) 06:00, 22 సెప్టెంబర్ 2006 (UTC)
- సముదాయ మద్దతుతో మీరిప్పుడు అధికారి అయ్యారు --వైఙాసత్య 12:53, 28 సెప్టెంబర్ 2006 (UTC)
మద్దతు
[మార్చు]- నేను మద్దతిస్తున్నాను.--వీవెన్ 05:33, 22 సెప్టెంబర్ 2006 (UTC)
- నేను మద్దతిస్తున్నాను.Chavakiran 05:37, 22 సెప్టెంబర్ 2006 (UTC)
- నేను మద్దతు తెలుపుతున్నాను కాసుబాబు 08:43, 22 సెప్టెంబర్ 2006 (UTC)
- నేను మద్దతు తెలుపుతున్నాను -- శ్రీనివాస 09:06, 22 సెప్టెంబర్ 2006 (UTC)
- నేను మద్దతు తెలుపుతున్నాను --త్రివిక్రమ్ 12:25, 22 సెప్టెంబర్ 2006 (UTC)
- నేను మద్దతు తెలుపుతున్నాను -- కామేష్ 12:51, 22 సెప్టెంబర్ 2006 (UTC)
- నేను మద్దతిస్తున్నాను.--సుజాత 05:33, 22 సెప్టెంబర్ 2006 (UTC)
- నేను కూడా మద్దతు తెలుపుతున్నాను -- Varmadatla 19:05, 22 సెప్టెంబర్ 2006 (UTC)
- నా మద్దతు కూడా --వైఙాసత్య 12:49, 28 సెప్టెంబర్ 2006 (UTC)
- కృతజ్ఞతలు: నన్ను అధికారిని చేసిన మీకందరికీ నా కృతజ్ఞతలు.__చదువరి (చర్చ, రచనలు) 16:12, 28 సెప్టెంబర్ 2006 (UTC)
మీ మద్దతు ఇక్కడ తెలుపుము (మార్చి 13, 2008) ఆఖరి తేదీ : (మార్చి 20, 2008)
మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు) - తెలుగు వికీపీడియాతో నాకు గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. ఇందులో సగం సమయం వ్యాసాలకు పోతే మిగిలిన సమయమంతా నిర్వహణాపరమైన కార్యక్రమంలో పాల్గొనటానికే కేటాయించాను. తెలుగు వికీలో ఇప్పటికే ఉన్న అధికారులకు తోడుగా మరి కొంత మంది ఉంటే సభ్యుల హక్కుల నిర్వహణకు భంగం వాటిల్లకుండా చూసుకోవచ్చు. ఈ క్రమంలో నేను కూడా ఆ భాద్యతలను స్వీకరించడానికి ముందుకొస్తున్నాను. సభ్యులు తమ మద్దతును క్రింద తెలియచేయగలరు. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 17:19, 13 మార్చి 2008 (UTC)
- ఈ ఓటింగు ఇంతటితో ముగిసింది. తత్ఫలితంగా ప్రదీపు తెవికీ అధికారలయ్యారు --వైజాసత్య 15:16, 20 మార్చి 2008 (UTC)
మద్దతిచ్చేవారు
[మార్చు]- మూడు సంవత్సరాల నుంచి తన సహకారాన్ని అందిస్తూ తెలుగు వికీ పురోగతికి పాటుపడుతున్న ప్రదీపు గారికి అధికారికి ఉండవలసిన అన్ని లక్షణాలు ఉన్నాయి. వికీ విధివిధానాలు, మెటావికీ. బాటులపై పూర్తి పట్టు ఉన్న ప్రదీపు గారికి అధికారి హోదాకై నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను.-- C.Chandra Kanth Rao(చర్చ) 18:56, 13 మార్చి 2008 (UTC)
- నిస్సందేహంగా ప్రదీప్ ఈ బాధ్యతను తీసికోవాలి అని నా అభిప్రాయం. సాధారణంగా వ్యాసాలు వ్రాయడంతోబాటు ప్రదీప్ నిర్వహిస్తున్న కొన్ని ముఖ్యమైన పనులు (1) బాట్ల ద్వారా కొన్ని క్లిష్టమైన పనుల యాంత్రికీకరణ (2) బొమ్మల కాపీ హక్కుల విషయమై ప్రత్యేక శ్రద్ధ (3) వ్యాసాల వర్గీకరణపై దృష్టి. - ఇవన్నీ తెలుగు వికీపీడియా నాణ్యతను పెంచే దిశలో చాలా ముఖ్యమైన పనులు. అధికారి బాధ్యత కోసం ప్రదీప్‌కు నా మద్దతు తెలుపుతున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:47, 14 మార్చి 2008 (UTC)
- తెవికీని నడిపించుటలో ప్రధాన భూమికను నిర్వహించే ప్రదీప్ అధికారిక బాద్యతలను సక్రమంగా నిర్వహించి, తెవికీ ఉన్నతికి పాటు పడగలడు. ఆయన ఈ పదవికి తప్పక అర్హుడు కావున ఆయన అభ్యర్ధిత్వానికి నా సంపూర్ణ మద్దతు తెలియచేయుచున్నాను.--విశ్వనాధ్. 03:12, 15 మార్చి 2008 (UTC)
- తెవికీలోని సభ్యులలో సాంకేతికం పై బాగా అవగాహన ఉన్నవారిలో ప్రదీప్ గారు ఒకరు. అధికారి భాద్యతకు 100% అర్హులు. రవిచంద్ర(చర్చ) 12:31, 17 మార్చి 2008 (UTC)
- δευ దేవా 19:33, 18 మార్చి 2008 (UTC)
- తెవికీలో విశేష కృషి చేస్తున్న ప్రదీపు గారి అధికారహోదా విజ్ఞప్తికి నా మద్దతు తెలియచేస్తున్నాను.
--t.sujatha 04:17, 19 మార్చి 2008 (UTC)
- ప్రదీపు అధికార బాధ్యతలు చక్కగా నిర్వర్తించగలరన్న నమ్మకం నాకుంది. నా మద్దతు కూడా --వైజాసత్య 15:14, 20 మార్చి 2008 (UTC)
వ్యతిరేకించేవారు
[మార్చు]తటస్థులు
[మార్చు]స్టెవార్డు పేజీలో అభ్యర్థన పై వ్యాఖ్యల ప్రకారం 15 మద్దతు వోట్లు కావాలి. అందుకని గడువు తేదీని పొడిగించడమైనది.
మీ మద్దతు ఇక్కడ తెలుపుము (డిసెంబర్ 27, 2011) ఆఖరి తేదీ : (జనవరి 22, 2012)
ప్రస్తుత అధికారులు క్రియాశీలకంగా లేరు. కనుక నేనే స్వతంత్రించి అధికార హోదా కొరకు విజ్ఞప్తి చేస్తున్నాను. నాగురించి చెప్పాలంటే గత నాలుగేళ్లుగా తెవికీలో పనిచేస్తున్నాను. వికీ అకాడమీలు నిర్వహించాను. తెవికీ వార్త ను ప్రారంభించి ఇప్పటికి రెండు సంవత్సరాలు (8 సంచికలు) తోటి వికీపీడియన్ల సాయంతో వెలువరించాను. వికీ భారతదేశం అధ్యక్షునిగా ప్రస్తుతం సేవచేస్తున్నాను. ఇంకేదైనా ప్రశ్నలుంటే చర్చాపేజీలో రాయండి, నేను స్పందిస్తాను--అర్జున 13:42, 27 డిసెంబర్ 2011 (UTC)
- మద్దతు(In favour)
- అర్జున రావు గారికి నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. వికీ విధి విధానాలు బాగా తెలిసిన వారు. వికీ అకాడమీ లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.--జె.వి.ఆర్.కె.ప్రసాద్ 14:44, 27 డిసెంబర్ 2011 (UTC)
- అర్జున రావు గారికి నా సంపూర్ణ మద్దతు. మమ్ములను చెయ్యిపట్టుకొని ముందుకు తీసుకువెళ్ళగల సమర్ధులు.--రాధాకృష్ణ 8:12, 28 డిసెంబర్ 2011 (IST)
- అర్జున రావు గారికి నా సంపూర్ణ మద్దతు - ఛైతన్య భాను
- పలు వికీపీడియా కార్యక్రమాలలో క్రియాశీలకంగా ఉన్న అర్జునరావు కృషి, వికీ అభివృద్ధికి తోడ్పడగలదని నమ్ముతాను.cbrao 04:45, 28 డిసెంబర్ 2011 (UTC)
- తెలుగు వికీపీడియాని భారతీయ భాషలతో ఉన్నతంగా తీర్చిదిద్దడానికి సవ్యసాచి వలె కృషిచేస్తున్న అర్జునరావు గారొకి నేను హృదయపూర్వకంగా మద్దతు తెలియజేస్తూ క్రియాశీలక సభ్యునిగానే కాకుండా, నిర్వహకునిగా అధికార హోదా ఉంటే ఇంకా మనసుపెట్టి మన అభివృద్ధిలో మార్గదర్శిగా నిలుస్తారని ఆశిస్తున్నాను.Rajasekhar1961 06:41, 28 డిసెంబర్ 2011 (UTC)
- ప్రస్తుత సమయంలో అధికార బాధ్యతలు స్వీకరించిన వారు చురుకుగా లేనందున కొత్తగా అధికార బాధ్యతలు చేపట్టడానికి స్వయంగా ముందుకు వచ్చి ఈ బాధ్యతలు చేపట్టదలచడం శుభసూచకం. ఇటీవలి కాలంలో అర్జునరావు గారు తెవికీ కార్యక్రమాలపై చురుగ్గా ఉంటూ ముందుకు నడిపిస్తున్న తరుణంలో అధికార బాధ్యతలు చేపట్టడంకై నేను మద్దతు ప్రకటిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:24, 31 డిసెంబర్ 2011 (UTC)
- ప్రస్థుతానికి అధికారభాద్యతలను నిర్వహిస్తున్న వారు చురుకుగా లేనందువలన తెవీకీకి అధికారులు లేని కొరత ప్రస్పుటముగా కనిపిస్తుంది. అర్జునరావుగారు అధికారిగా ఉంటే బాగుంటుందని నేను చాలా రోజులుగా అనుకుంటున్నాను. వారే ఈ ప్రతిపాదాన చెయ్యడం ముదావహం. నిర్వాహకులుగా అత్యంత చురుకుగా నూతనవ్యూహాలతో చురుకుగా పనిచేస్తున్న అర్జునరావుగారు అధికారిగా వారికి వారే సాటి అనిపించుకోగలిన సమర్ధులు. వారు ఈ బాధ్యతలను స్వీకరించి తెవీకీని మరింత అభివృద్ధిపధంలోకి నడిపించగలరు. వారికి నా హృదయపూర్వక మద్దతు తెలియజేస్తున్నాను. t.sujatha 03:04, 2 జనవరి 2012 (UTC)
- అర్జునరావుగారికి నా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాను కాసుబాబు 17:41, 2 జనవరి 2012 (UTC)
- నా వైపు నుండి కూడా అర్జున రావు గారికి పూర్తి మద్దతును అందజేస్తున్నాను. శశి 10:20, 8 జనవరి 2012 (UTC)
- అర్జునరావు గారికి నా మద్దతు. — వీవెన్ 14:05, 8 జనవరి 2012 (UTC)
- అర్జునరావుగారికి నా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాను. రమేష్ రామయ్య చర్చ 17:02, 9 జనవరి 2012 (UTC)
- అర్జునరావుగారికి నా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాను. YVSREDDY
- అర్జున రావు గారికి నా మద్దతు --Sridhar1000 07:52, 13 జనవరి 2012 (UTC)
#అర్జునరావుగారికి నా మద్దతును తెలియజేస్తున్నాను. వాడుకరి:NrahamthullaIPs aren't eligible to vote
- అర్జునరావుగారికి నా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాను వాడుకరి:రాజాచంద్ర – previous unsigned edit by User:Rajachandra, 09:14, 13. Jan. 2012
- వ్యతిరేకత(Oppose)
- తటస్థం(Neutral)
- ఫలితం(Result)
వ్యతిరేకించి ఎవరు వోటువెయ్యనందున, అర్జునరావు అధికార హోదా విజ్ఞప్తి సర్వసమ్మతితో అమోదం పొందింది. As there were no votes opposing the bureaucrat election of User:Arjunaraoc, it is hereby declared that his request for election to Bureaucrat is approved through total consensus. అర్జున
- Bureaucrat status is given by Done -- Avi 23:12, 22 జనవరి 2012 (UTC)
మీ మద్దతు ఇక్కడ తెలుపుము (మే 05, 2013) ఆఖరి తేదీ : (మే 12, 2013)
Rajasekhar1961 (చర్చ • దిద్దుబాట్లు) - రాజశేఖర్ గారు, వైద్య విజ్ఞాన రంగానికి సంబంధించిన వ్యాసాలతో ప్రారంభించి, అనేక వేల దిద్దుబాట్లు చేసి దిద్దుబాట్లలో తెలుగు వికీలో మొదటి స్థానంలో ఉన్నారు. చొరవగా జీవశాస్త్రం, తెలుగు ప్రముఖులు తదితర ప్రాజెక్టులను ప్రారంభించి ముందుకు నడిపిస్తున్నారు. ఈయన విజయవంతగా నడిపిన కార్యక్రమాలలో వికీలో మహిళా దినోత్సవం సందర్భంగా ఒక నెలరోజుల పాటు అనేక మంది మహిళలల వ్యాసాలను అభివృద్ధిచేసిన వైనం ఇటీవలి కృషి నుండి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. తెలుగు వికీని అధికారిగా చక్కని కృషితో, అనుభవంతో నడిపించగలరని నాకు నమ్మకం ఉన్నది.
రాజశేఖర్ గారు తమ అంగీకారము ఇక్కడ తెలియ చేయవలెను.
- వైజాసత్యగారికి నమస్కారము. నాకు అంతగా సాంకేతిక జ్ఞానము లేదు; అయినా ఎలాగో మీ అందరి సహకారంతో వికీలో చిన్న చిన్నవైనా ఎన్నో వ్యాసాల్ని తయారుచేశాను. నన్ను అధికారిగా ప్రతిపాదించినందుకు నా ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 05:21, 6 మే 2013 (UTC)
మద్దతు
[మార్చు]- -- కె.వెంకటరమణ చర్చ 08:10, 7 మే 2013 (UTC)
- --రహ్మానుద్దీన్ (చర్చ) 22:38, 7 మే 2013 (UTC)
- .పాలగిరి (చర్చ) 01:18, 8 మే 2013 (UTC)
- అర డజను సంవత్సరాల నుంచి అలుపెరగకుండా కృషిచేస్తూ, అరలక్ష దిద్దుబాట్లను పూర్తిచేసి అందరికీ ఆదర్శంగా నిలిచి, అనుక్షణం తెవికీకై పరితపిస్తూ, తెవికీ తపస్విగా పేరునొందిన రాజశేఖర్ గారు అధికారి హోదా స్వీకరించుటకు నా మద్దతు తెలియజేయకుండా ఉండలేను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:39, 8 మే 2013 (UTC)
- --రెండు మూడు సంవత్సరాల క్రిందట తెవికీ చర్చలలో అంతగా పాల్గొనని రాజశేఖర్ గారు ఇటీవల కాలంలో చురుకుగాపాల్గొనటము, భౌతిక సమావేశాల నిర్వహణకు, ప్రాజెక్టులలో పనికి ముందునిలబడడం నాకు ఆనందాన్నిచ్చింది. తెవికీలో అలుపెరుగని కృషి చేస్తున్న రాజశేఖర్ గారి తెవికీ అధికారి అభ్యర్థిత్వానికి నా పూర్తి మద్దతునిస్తున్నాను. --అర్జున (చర్చ) 04:17, 9 మే 2013 (UTC)
- సంయమనం పాటించేవాడు, అలుపెరుగక కృషిచేసే నిర్వాహకులు, ఓర్పు , సహనం కలిగిన వారు, స్నేహశీలి అయిన రాజశేఖర్ గారి ఆధికార హోదాకు మద్ధతు తెలుపుతున్నాను. --t.sujatha (చర్చ) 04:47, 9 మే 2013 (UTC)
- రాజశేఖర్ గారికి నా సంపూర్ణ మద్దతుతెలియజేస్తున్నాను Bhaskaranaidu (చర్చ) 09:50, 9 మే 2013 (UTC)
- నేనున్నూ ..విశ్వనాధ్ (చర్చ) 15:34, 9 మే 2013 (UTC)
- YVSREDDY (చర్చ) 02:50, 11 మే 2013 (UTC)
- వీవెన్ (చర్చ) 10:25, 11 మే 2013 (UTC)
వ్యతిరేకత
[మార్చు]తటస్థం
[మార్చు]ఫలితం
[మార్చు]- సముదాయంలో క్రియాశీలక సభ్యులలో అధికశాతం మద్దతు ప్రకటించారు. మరియు ఎవరూ వ్యతిరేకత వ్యక్తం చేయలేదు కాబట్టి రాజశేఖర్ గారికి అధికారహోదా ప్రతిపాదన విజయవంతమైనది. --వైజాసత్య (చర్చ) 05:30, 13 మే 2013 (UTC)