విగ్రహారాధన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అపిస్ విగ్రహం. ప్రాచీన ఈజిప్టు.

విగ్రహ ఆరాధన: మనిషి తయారు చేసిన ఒక రాతి బొమ్మనో, మూర్తినో, మరో రూపాన్నోపట్టుకొని దేవుడిగా, దేవుని ఆత్మ ఆవహించిన దివ్యావతారంగానో భావించి పూజంచడం, లేదా దయ్యపు శక్తులున్న అవతారంగా విశ్వసించడం .

'ఆవు' 'ఎద్దు' విగ్రహాలు

ఈజిప్టులో పూర్వం 'ఎద్దు విగ్రహాన్ని' పూజించేవారు.మోషే కొండపైకెళ్ళి దేవుని దగ్గరనుండి తెచ్చిన పది ఆజ్ఞలు చెక్కిన రాతి పలకలను అతని జాతి ప్రజలు 'ఆవు'ను పూజించడం చూచి సహించలేక పగలగొడతాడు.

గ్రీకు , రోమన్లలో విగ్రహారాధన

1572 నాటి 'జియస్ విగ్రహం' చిత్రం.
రోమన్ 'కూర్చున్న జియస్' పాలరాతి విగ్రహం. హెర్మిటేజ్ సంగ్రహాలయం.

పార్థియన్లు 'అథేనా' అను విగ్రహానికి పూజించేవారు, ఈ దేవత గ్రీకుల నాగరికత , 'యుద్ధ దేవత'. దీనిని 'ఫిడియాస్' శిల్పకారుడు రూపొందించాడు. ఏథియన్ మందిరంలో గల ఈ విగ్రహం వద్ద 'మతపరమైన బలి కార్యక్రమాలు' నిర్వహించేవారు. గ్రీకు , రోమన్ మతవిశ్వాసాల అనుసారం, 'పల్లాడియమ్' అనే విగ్రహం నగరశ్రేయస్సును కాపాడే విగ్రహంగా భావించేవారు.

అబ్రహామిక మతాలన్నీ విగ్రహారాధనకు వ్యతిరేకం

అబ్రహామిక మతాలైన యూదు మతం, క్రైస్తవ మతం , ఇస్లాం మతం విగ్రహారాధనను నిషేధించాయి .యూదులు, ముస్లిములు విగ్రహారాధన చేయరు. క్రైస్తవ మతంలో విగ్రహారాధన నిషిద్ధమైనా, కొన్ని చర్చీలలో ముఖ్యంగా కేధలిక్ చర్చిలలో 'మేరీమాత, 'యేసుక్రీస్తు' , 'శిలువ' విగ్రహాలకు మొక్కుతారు.

ఫ్రాన్స్ హోగెన్ బర్గ్, విగ్రహారాధనా నిర్మూలనా కార్యక్రమం పేరుతో 1566 ఆగస్టు 20 లో చర్చిలో వున్న 'మేరీమాత' 'యేసు క్రీస్తు' , ఎనో 'సంతు'ల విగ్రహాలను కూలగొట్టారు. ఇలాంటి విషయాలే రోమన్ లో 'సంస్కరణ'ల పేరుతో జరిగాయి.

క్రైస్తవులు లేఖనాలు విగ్రహారాధనకు వ్యతిరేకం. ఏ ప్రతిమనూ చేసుకోకూడదని, ఏఆకారానికీ మొక్కకూడదని దేవుడు పది ఆజ్ఞలు రాతిపలకలపై చెక్కి మోషేకిస్తాడు.కానీ కొన్ని డినామినేషన్లకు చెందిన క్రైస్తవులు విగ్రహాలను ఇండ్లలోనూ వీధులలోనూ చర్చీలలోనూ వుంచి వాటికి మొక్కుతారు కూడా. విగ్రహారాధకులని చిత్ర హింసలు పెట్టి చంపిన యూదుల ప్రవక్త మోషేని క్రైస్తవులు కూడా ప్రవక్తగా నమ్ముతారు కానీ మోషే ప్రవచనాలకి విరుధ్ధముగా క్రైస్తవులు కూడా విగ్రహారాధన చేస్తూ తమ ప్రవక్త ఆశయాలకి తామే పోటు పొడుస్తున్నారు.

ముహమ్మదుకు పూర్వం మక్కాలో విగ్రహాలు

మహమ్మదు ప్రవక్తకు పూర్వం మక్కా నగరంలో, అరబ్ తెగలు పలు విగ్రహాలను ఆరాధించేవారు. విగ్రహాలకు కేంద్రమైన కాబా గృహంలో లాత్, మనాత్, హుబల్, దులిల్, ఉజ్జా మున్నగు దేవతల విగ్రహాలు మొత్తం 360 విగ్రహాలు దాకా వుండేవని ప్రతీతి. అరేబియా నలుమూలల నుండి పాగన్లు (బహువిగ్రహారాధకులు) ప్రజలు కాబాలోని విగ్రహాలను దర్శించుకోవటానికి తీర్థయాత్రగా వచ్చేవారు. ఇటు తీర్థయాత్ర పూర్తి చేసుకుని, దానితో బాటు వాణిజ్య వర్తక కేంద్రమైన మక్కాలో వ్యాపార వ్యవహారాలు కూడా చూసుకునేవారు. మహమ్మదీయులు ఈ కాలాన్ని పూర్వపరంలో 'అజ్ఞాన కాలం'గా (అరబ్బీ : جاهلية ), వ్యవహరిస్తారు.

ముహమ్మద్, ఇస్లాం మత సారాన్ని ప్రకటించి, విగ్రహారాధన సరికాదని బోధించారు. తౌహీద్ లేదా ఏకేశ్వరోపాసనను సరియైన మతంగా ప్రకటించి, విగ్రహారాధనను నిషేధించారు. మక్కా ముస్లింల వశమైనప్పుడు, కాబాగృహంలోని విగ్రహాలన్నీ తొలగించారు.

ముస్లింలలో విగ్రహారాధన

ముస్లింలు విగ్రహాలు తయారుచేసి వాటిని పూజించరు. కానీ దక్షిణ ఆసియా , పర్షియన్ , షియా మతం యొక్క ప్రభావాలు ఎక్కువగా వున్న ప్రాంతాలలో క్రింది విషయాలు గోచరిస్తాయి. భారతదేశంలోని ముస్లిం సమాజాలలో వీటి ప్రవేశం ఎలా జరిగిందంటే, నవాబులు దాదాపు షియా మతానికి చెందినవారు. ఉదాహరణకు లక్నో నవాబు, అవధ్ నవాబు, బెంగాల్ నవాబు, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీ వంశము, ఆసఫ్ జాహీ వంశము, టిప్పూ సుల్తాన్, ఆర్కాడు నవాబు, మదురై నవాబు, వీరందరూ షియాలే. వీరి పరిపాలనా కాలంలో చాలా దర్గాలు, ఆషూర్ ఖానాలు, ముహర్రం పీర్ల పండుగలు, (నేటికినీ లక్నో , హైదరాబాదు నగరాలలో చూడవచ్చును), ఫాతెహా ఖ్వానీలు, కుండోంకే ఫాతెహా (రజబ్ నెలలో ఇమాం జాఫర్-ఎ-సాదిక్ మన్నత్ లేదా నోము), ఘడీ కే ఫాతెహా, చరాగోంకే ఫాతెహా (దీపాల మన్నత్), దర్గాల వద్ద 'షిఫా ఖానా' లు, చెరువులు గుంటలు, కొలనులలో మునగడం లాంటి విషయాలు, వెలసాయి. ఇలాంటి అంధవిశ్వాసాల నుండి మానవాళికి కాపాడడానికే ఇస్లాం అవతరించింది. కానీ నేటికినీ చాలా మంది ముస్లింలు 'అజ్ఞాన కాలం'లోనే విహరిస్తున్నారనే భావన నేటి లోకం భావిస్తున్నది. పెద్ద పెద్ద ముస్లిం సుల్తానులు ఔలియాల వద్ద నోములు నోచితే (ఉదాహరణకు అక్బర్ తనకు సంతానం లేదని సలీం చిష్తీ అనే సూఫీ ఔలియా సమాధి వద్ద మన్నత్ (నోము) చేశాడు) సాధారణ జనం అలాంటి చక్రవర్తులకు అనుకరించడంలో అతిశయోక్తిలేదు.

  • దర్గాలు
  • జెండా మానులు (జెండాలు తగిలించిన వృక్షాలు)
  • పంజాలు (మొహర్రంలో ప్రతిష్ఠించే పీర్లు)
  • ఔలియాల నషాన్లు (ఔలియాల పేరును తగిలించి అక్కడక్కడా ప్రతిష్ఠానాలు)

పైనుదహరించిన విషయాలు ఇస్లాం ప్రబోధించినవా కావా అనే వాటి గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ సరైన విషయాలేనని సున్నీ బరేల్వీ జమాత్, సరైనవి కావు అని తబ్లీగీ జమాత్ పరస్పర ప్రకటనలు , బోధనలు చేపడుతూనేవున్నవి. అప్పుడప్పుడూ వీరిమధ్య అడపాదడపా వాగ్వాదాలు, చిన్న చిన్న కొట్లాటలు, , ఒకరికి వ్యతిరేకంగా ఒకరి దూషణలు సర్వ సాధారణం.

కాబాలోని రాయి (అస్వాద్)

ముహమ్మదు ప్రవక్త ఈ నల్లని రాయిని హజ్ యాత్రలోభాగంగా ముద్దుపెట్టుకున్నాడు. కాబా గోడలో అమర్చిన రాయిని పరలోకం నుండి వచ్చిన రాయిగా భావించి ముస్లింలు కూడా అలాగే ముద్దు పెట్టుకుంటారు.

ఇస్లాం విగ్రహారాధనకు వ్యతిరేకం

ఇస్లాం విగ్రహారాధనకు వ్యతిరేకం. చనిపోయి దర్గాలలో (సమాధులలో) పెట్టబడిన ఔలియాల (ముస్లిం భక్తులు) ఆశీస్సులు పొందడం కోసం, వారి సమాధుల వద్ద జియారత్ చేయడాన్ని ఇస్లాం విగ్రహారాధనగా భావిస్తుంది. ఇస్లాం ఈ క్రింది పనుల్ని విగ్రహారాధనగా భావించి నిషేధించింది:

ఔలియాల సమాధులకు సాష్టాంగ ప్రమాణాలు చేయటం, సమాధులలో వున్న వారి పీర్లతో నోములు నోయటం, ఔలియాలకే ప్రార్థనలు చేయటం, సమాధుల చుట్టూ ప్రదక్షిణలు చేయటం, దర్గాల దగ్గర స్తోత్రగానాలు చేయటం, దర్గాలే సర్వస్వం, అల్లాహ్ ను పొందుటకు ఇవే స్వర్గద్వారాలు అనుకోవటం, తల నీలాలు సమర్పించటం, తావీజులు, తాయెత్తులు ధరించటంలాంటివి విగ్రహారాధనగా భావించి నిషేధించినా భారతదేశంలో లాంటి కొన్నిదేశాలలో ఈ ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇస్లాం విగ్రహారాధనను నిషేధిస్తుంది. సమాధులను గౌరవ భావంతో సందర్శించేందుకు అనుమతి ఇస్తుంది. కానీ వాటికి మొక్కటాన్ని ఆరాధించటాన్ని నిషేధిస్తుంది.

హిందూమతం

విగ్రహారాధన హిందూ మత సంస్కృతిలో విడదీయలేని భాగం. ఇప్పుడు షిరిడీ సాయి బాబా, సత్య సాయి బాబాల పేర్లతో కొత్త కొత్త దేవాలయాలు కట్టి విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. గతంలో ప్రతి ఊరికి ఒక రామాలయం ఉండేది. ఇప్పుడు ఊరూరా సాయిబాబా ఆలయాలు వెలుస్తున్నాయి.[ఆధారం చూపాలి]

ఆర్యసమాజం

హిందు మతంలో సంస్కరణోద్యమాలుగా ప్రారంభమైన ఆర్యసమాజం , బ్రహ్మసమాజం విగ్రహారాధన (మూర్తిపూజ) ను వ్యతిరేకిస్తాయి.

జైనమతం

జైన మతంలో తీర్థాంకరుల విగ్రహాలకు పూజా పునస్కారాలు చేపట్టడం తక్కువగాను, వీటిని గౌరవించడం ఎక్కువగా చూస్తాము. అయిననూ విగ్రహాలకు 'అభిషేకం' చేయడం ఆనవాయితీ.[1]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-06-28. Retrieved 2008-05-31.