సలీం చిష్తీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షేక్ సలీం చిష్తీ - చిష్తియా తరీకా.

సలీం చిష్తీ : Salim Chishti (1478 – 1572) (హిందీ: सलीम चिश्ती, Urdu: سلیم چشتی ) చిష్తీ తరీకాకు చెందిన ఒక సూఫీ సంతుడు. దక్షిణాసియా లోని మొఘల్ సామ్రాజ్యానికి చెందిన వాడు.

జీవన విశేషాలు

[మార్చు]

సలీముద్దీన్ చిష్తీ, సాధారణంగా సలీం చిష్తీ పేరుతో ప్రసిద్ధి.

కొన్ని కథనాల ప్రకారం సలీం చిష్తీ అనేక కరామతులు (మహిమలు) చూపేవారు. మొఘల్ చక్రవర్తి అక్బర్కు సంతానం లేదు, అతను "అష్రఫ్ జహాంగీర్ సెమ్నాని ఆస్తానా (ఆశ్రమం) కు వెళ్ళదలచాడు, మార్గమధ్యన సలీంచిష్తీ ఆస్తానాకు కూడా దర్శనానికి వెళ్ళాడు. సలీం చిష్తీ ఆస్తానాకు అక్బర్ పాదరక్షలు లేకుండా నడచి వెళ్ళాడు. తనకు మగసంతానము కలగాలని అల్లాహ్ కు ప్రార్థించాలని సలీం చిష్తీని కోరాడు. సలీంచిష్తీ అక్బర్ కు ఆశీర్వదించి, అల్లాహ్ దర్బారులో అక్బర్ కొరకు ప్రార్థించాడు. ఆ తరువాత అక్బర్ కు సంతానం పుత్రరూపంలో కలిగింది. అక్బర్ తన తొలి సంతానానికి సలీం అనేపేరు పెట్టాడు, ఇతడే పెద్దయ్యాక జహాంగీరు అయ్యాడు.

అక్బరు, సూఫీసంతుడైన సలీం చిష్తీని అమితంగా గౌరవించేవాడు. సలీంచిష్తీ ఆస్తానా దగ్గరే ఫతేపూర్ సిక్రీ నగరాన్ని నిర్మించాడు.

సలీం చిష్తీ సమాధి

[మార్చు]

ప్రధాన వ్యాసం : సలీం చిష్తీ సమాధి

సలీం చిష్తీ సమాధి మొదట ఎర్ర ఇసుకరాతి కట్టడం, ఆతరువాత పాలరాతితో సుందరంగా తీర్చిదిద్దారు. సలీం చిష్తీ మజార్ (సమాధి) భారత్, ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ సిక్రీ కోటలోని చక్రవర్తి ప్రాంగణం మధ్యలో చూడవచ్చును.

సలీం చిష్తీ దీవెనలతో సంతానప్రాప్తి పొందిన అక్బర్ దీనిని సలీం చిష్తీ గౌరవార్థం కట్టించాడు. 1571 లో ప్రారంభమైన ఈ కట్టడం 15 సంవత్సరాలకు పూర్తయింది. నేటికినీ మొఘలుల నిర్మాణ కౌసల్యానికి ఒక నిదర్శనం.

చిత్రమాలిక

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]