వితికా శేరు
వితిక షేరు | |
---|---|
జననం | ఫిబ్రవరి 3, 1993 |
ఇతర పేర్లు | వితిక రావు కీర్తి |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2008–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | వరుణ్ సందేశ్ |
పిల్లలు | రుద్ర, మహేష్ |
వితిక షేరు దక్షిణ భారతదేశ చలనచిత్ర నటి. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించింది.
జననం - విద్యాభ్యాసం
[మార్చు]వితిక 1993, ఫిబ్రవరి 3న భీమవరంలో జన్మించింది. ముంబై, హైదరాబాదుల్లో స్కూల్ విద్యను పూర్తిచేసిన వితిక, హైదరాబాదులోని లోహిత ఇన్సిట్యూట్ ఆఫ్ డిజైన్ కళాశాల నుండి డిప్లొమా పట్టా అందుకుంది.[1]
వివాహం
[మార్చు]సినీనటుడు వరుణ్ సందేశ్ తో 2016, ఆగస్టు 19న వితిక వివాహం జరిగింది.
సినిమారంగ ప్రస్థానం
[మార్చు]వితిక 11 సంవత్సరాల వయస్సులో బాలనటిగా తన నటన జీవితాన్ని ప్రారంభించి, 15వ ఏట 2008లో అంతు ఇంతు ప్రీతి బంతు (తెలుగు సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వేరులేలో కలర్స్ స్వాతి పాత్ర) కన్నడచిత్రంతో సినీరంగ ప్రవేశంచేసింది.[2] తన అత్తతో సినిమా షూటింగుకు వెళ్ళిన వితికను చూసిన దర్శకుడు కన్నడ సినిమాలో చిన్న పాత్రను ఇచ్చాడు.[1] ఆ తరువాత 2009లో ఉల్లాస ఉత్సాహ సినిమాలో నటించింది.[3]
తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించి 2008, 2009లలో ప్రేమించు రోజుల్లో,[4] ఛలో 123,[5] మై నేమ్ ఈజ్ అమృత[6] వంటి తక్కువ బడ్జెట్ తెలుగు చిత్రాలలో కీర్తి పేరుతో నటించింది. తరువాత ఝుమ్మందినాదం, భీమిలి కబడ్డీ జట్టు చిత్రాలలో సహాయనటిగా, ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో ప్రధానపాత్రలో నటించింది. ఈ చిత్రంలో కళాశాల విద్యార్థి పాత్రను పోషించింది.[7] కాస్ట్యూమ్ స్టైలింగ్ కూడా చేసింది.[8] 2014లో ఉయిర్ మోజి సినిమాతో తమిళ సినిమారంగంలోకి ప్రవేశించిన వితిక, ఈ చిత్రంలో అంధురాలైన అమ్మాయిగా నటించింది..[9] ఈ సినిమాలోని పాత్రకోసం బ్రెయిలీని నేర్చుకోవడమేకాకుండా, చాలారోజులు కళ్ళకు గంతలు కట్టుకొని సాధన చేసింది.[10]
2015లో మహేష్ ఉప్పుటూరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో ఆమె ప్రధానపాత్రలో నటించింది, ఈ చిత్రం కోసం తన స్వంత దుస్తులను తానే రూపొందించుకుంది.[11] తన రెండవ తమిళ చిత్రం మహాబలిపురంలో నటించింది.[1] విదార్థ్‌తో వేదిక్కై అనే తమిళ చిత్రంలో నటించింది.[12]
ఆర్కేస్ గ్రాండ్ మాల్, భార్గవి ఫ్యాషన్స్, భీమా జ్యువెలరీ, తస్యాహ్ వంటి బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది.
నటించిన చిత్రాలు
[మార్చు]'సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
2008 | అంతు ఇంతు ప్రీతి బంతు | కన్నడ | ||
2009 | ఉల్లాస ఉత్సాహ | కన్నడ | ||
2009 | ప్రేమించు రోజుల్లో | తెలుగు | కీర్తి | |
2010 | సందడి | తెలుగు | కీర్తి | |
2010 | ఝుమ్మందినాదం | తెలుగు | ||
2010 | భీమిలి కబడ్డీ జట్టు | తెలుగు | ||
2013 | ప్రేమ ఇష్క్ కాదల్ | సరయు | తెలుగు | |
2014 | ఉయిర్ మోజీ | ప్రియ | తమిళం | |
2015 | పడ్డానండి ప్రేమలో మరి | శ్రావణి | తెలుగు | |
2015 | మహాబలిపురం | మహాలక్ష్మీ | తమిళం |
టివీరంగం
[మార్చు]బాలనటిగా టెలివిజన్ ధారావాహికల్లో నటించింది.[12] 2019లో టెలివిజన్ రియాలిటీ కార్యక్రమమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 పోటీలో పాల్గొన్నది.
సంవత్సరం | కార్యక్రమం | పాత్ర | ఛానల్ | భాష | Exit | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|---|
2019 | బిగ్ బాస్ 3 | పోటిదారుడు | స్టార్ మా | తెలుగు | టివి రియాలిటి కార్యక్రమం |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Gupta, Rinku (16 November 2013). "Playing the innocent girl next door". The New Indian Express. Archived from the original on 13 ఏప్రిల్ 2014. Retrieved 29 August 2019.
- ↑ "Beauty, talent essential for long career: Vithika Sheru (With Image)". Business Standard. 17 May 2013. Retrieved 29 August 2019.
- ↑ "Beauty, talent essential for long career: Vithika Sheru (With Image)". Sify.com. 17 May 2013. Archived from the original on 29 ఆగస్టు 2019. Retrieved 29 August 2019.
- ↑ "'Preminche Rojullo' second schedule complete - Telugu Movie News". Indiaglitz.com. 29 January 2008. Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 29 August 2019.
- ↑ "Chalo 1..2..3..' is ready for censoring - Telugu Movie News". Indiaglitz.com. 23 April 2009. Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 29 August 2019.
- ↑ "'My Name is Amrutha' ready for release". The New Indian Express. 10 October 2009. Archived from the original on 13 ఏప్రిల్ 2014. Retrieved 29 August 2019.
- ↑ sangeetha devi dundoo (8 December 2013). "Love, sex and dhoka". The Hindu. Retrieved 29 August 2019.
- ↑ "Vithika turns stylist for 'Prema Ishq Kaadhal' - IBNLive". Ibnlive.in.com. 21 May 2013. Archived from the original on 18 మార్చి 2014. Retrieved 29 August 2019.
- ↑ K. R. Manigandan (4 August 2012). "Confident strides". The Hindu. Retrieved 29 August 2019.
- ↑ "Vithika on a roll". Deccan Chronicle. 6 January 2014. Archived from the original on 13 ఏప్రిల్ 2014. Retrieved 29 August 2019.
- ↑ http://www.deccanchronicle.com/140915/entertainment-tollywood/article/offers-pouring-vithika-sheru
- ↑ 12.0 12.1 Ians (21 May 2013). "Vithika turns stylist for 'Prema Ishq Kaadhal'". Entertainment.in.msn.com. Archived from the original on 13 ఏప్రిల్ 2014. Retrieved 29 August 2019.
ఇతర లంకెలు
[మార్చు]ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వితికా శేరు పేజీ