విశాఖపట్నం వార్డులు
- విశాఖపట్నం మునిసిపాలిటీలో (50 వార్డులు ఉండేవి). ఈ మునిసిపాలిటీ, మహా విశాఖ నగరపాలక సంస్థగా ఎదిగిన తరువాత 72 వార్డులుగా విభజించి ఎన్నికలు జరిపారు.[1] ఒక్కొక్క వార్డు తాలుకా కార్పొరేటరు, వారి ఎన్నికల వివరాలు, జనాభా, ఆడ, మగ వివరాలు, హద్దులు, పాఠశాలలు, ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థలు, నీటి సౌకర్యం, రోడ్ల వివరాలు వగైరా చేర్చటం జరిగింది.
- 2007 ఫిబ్రవరి 21 నాటి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల వివరాలు.గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్లో 72 వార్డులు ఉన్నాయి. ఎన్నికలలో, ఆయా వార్డు లలో గెలిచిన వారిని కార్పొరేటర్లు అంటారు.
6 జోన్లు - 72 వార్డులు
[మార్చు]- మహా విశాఖపట్నం నగర పాలక సంస్థలో ఉన్న 98 వార్డులను, 7 జోన్లుగా చేసి, పాలన చేస్తున్నారు.[1]
జోన్ నెంబరు | జోన్ కేంద్రం పేరు | జోన్ లో ఉన్న వార్డులు | ఫోన్ నెంబరు | సహాయ పట్టణ ప్రణాళికాధికారులు (ఎ.సి.పి) | తేది |
---|---|---|---|---|---|
జోన్ 1 | మధురవాడ | 1 నుంచి 6 వార్డులు | షణ్ముఖ రెడ్డి (జి.వి.ఎమ్.సి. ప్రకటనల విభాగంనుంచి బదిలీ) | 2011 జూలై 21 | |
జోన్ 2 | టి.ఎస్.ఆర్. కాంప్లెక్సు | 7 నుంచి 18 వార్డులు | విజయ భాస్కర్ (జోన్ 4 నుంచి బదిలీ) | 2011 జూలై 21 | |
జోన్ 3 | సూర్యాబాగ్ | 19 నుంచి 30 వార్డ్లులు | వెంకటరత్నం (మార్పు లేదు) | 2011 జూలై 21 | |
జోన్ 4 | జ్ఞానాపురం | 31 నుంచి 49 వార్డ్లులు | జయరాం (జోన్ 5 నుంచి బదిలీ) | 2011 జూలై 21 | |
జోన్ 5 | గాజువాక | 50 నుంచి 65 వార్డులు | మధు కుమార్ (జోన్ 1 నుంచి బదిలీ) | 2011 జూలై 21 | |
జోన్ 6 | పెందుర్తి | 66 నుంచి 72 వార్డులు | శ్రీనివాసరావు (మార్పు లేదు) | 2011 జూలై 21 |
జోన్ 1 - మధురవాడ .- 1 నుంచి 6 వార్డులు
[మార్చు]- 1వ వార్డు : కార్పొరేటరు : కె. సుశీల (స్వతంత్ర). వోటర్లు 11287 (మగ 5602 స్త్రీలు:5662) మెజారిటీ : 321.
- వార్డు హద్దులు : చిన గదిలి, ఆంజనేయ స్వామి గుడి నుంచి దార పాలెం వరకు ఆరిలోవ రెండవ సెక్టార్ లో వున్న హిందీ భవన్ నుంచి ఆరిలోవ ఐదవ సెక్టార్ వరకు హద్దులు. కోలనీలు: ఆరిలోవ ఆపరేషన్ కోలనీ, దుర్గానగర్, విద్యానగర్, జై భీమ్ నగర్, భగత్ సింగ్ నగర్, ఆరిలోవ 3,4,5 సెక్టార్లు, ఛిన గదిలి, సంతపాలెమ్, ముడసరలోవ, సిద్ధార్ధ బి.సి. కోలనీ, దీనదయాళపురమ్, రామకృష్ణాపురం, అంబేద్కర్ కోలనీ, సంతపాలెమ్, శ్రీకృష్ణా పురం, పైన్ ఏపిల్ కోలనీ, దార పాలెం, దుర్గా నగర్, దుర్గా బజారు, ఆరిలోవ కోలనీ.
- 2వ వార్డు : కార్పొరేటర్ : ఒమ్మి సన్యాసి రావు (తెలుగు దేశం) మెజారిటీ : 613 ఓట్లు.
- 3వ వార్డు : కార్పొరేటర్ : నల్లూరి భస్కర రావు (తెలుగు దేశం) మెజారిటీ : 1528
- 4వ వార్డు : కార్పొరేటర్ : ఎమ్. సోమయ్య (తెలుగు దేశం) ఓటర్లు : 16,423 పోలు అయిన ఓట్లు : 8490 మెజారిటీ : 121 ఓట్లు 7.
- 5వ వార్డు : కార్పొరేటరు : పోతిన హనుమంతరావు (స్వతంత్ర), మొత్తం ఓటర్లు 16385 (మగ 6243 స్త్రీలు 8142) మెజారిటి : 606
- వార్డు హద్దులు : పరదేశి పాలెం (కొంత భాగం), మారికవలస కొండ ప్రాంతం, వికలాంగుల కోలనీ, కార్పెంటర్ కోలనీ, డ్రైవర్స్ కోలనీ, అయ్యప్ప నగర్, వివేకానంద కోలనీ, శివశక్తి నగర్, గణేష్ నగర్, బొట్టవాని పాలెం, స్వతంత్ర నగర్, మధురవాడ (కొంత భాగం), నాగ పాలెం, మల్లయ్య పాలెం, చందం పాలెం, మిధిలాపురి వుడా కోలనీ, వాంబే కోలనీ, పిలకవాని పాలెం, లా కళాశాల వరకూ, ఈ వార్డు వ్యాపించి ఉంది.
- 6వ వార్డు: కార్పొరేటర్ : కొఠారి దొరబాబు (కాంగ్రెస్). మొత్తం ఓటర్లు : 17774 (మగ 8985 స్త్రీలు 8789) మెజారిటీ: 2784.
సామాజిక వర్గాలు: తెలగ కాపు 15%, వాడ బలిజ 18%; రెడ్డి 10%, కమ్మ 5%, క్షత్రియ 8%, బ్రాహ్మణులు 10%, ఇతరులు 14%. పోటీ చేసిన ఇతరులు: ఛెట్టుపల్లి శంకర రావు (తెలుగు దేశం), అల్లూరి రాజేంద్ర ప్రసాద్ మరో నలుగురు (స్వతంత్ర)
జోన్ 2 - టి.ఎస్.ఆర్. కాంప్లెక్స్ - 7 నుంచి 18 వార్డులు
[మార్చు]- 7వ వార్డు : కార్పొరేటర్ : పేర్ల విజయ చంద్ర (కాంగ్రెస్). మెజారిటీ : 641 ఓట్లు.
- 8వ వార్డు : కార్పొరేటర్ : సిహెచ్. వి. పట్టాభి రాం (తెలుగు దేశం) మెజారిటీ : 2244 ఓట్లు.
- 9వ వార్డు : కార్పొరేటర్ : అల్లూరి నారాయణ రాజు (కాంగ్రెస్). మెజారిటీ : 1894
- 10వ వార్డు: కార్పొరేటర్ : మొల్లి లక్ష్మి (తెలుగు దేశం). మొత్తం ఓటర్లు : 21920 (మగ 11175 స్త్రీలు : 10745) మెజారిటీ : 808
- వార్డు హద్దులు: ఇసుక తోట, భాను నగర్, కృష్నా కాలెజి, మద్దిలపాలెమ్, కె.ఆర్.ఎమ్. కోలనీ, సీతమ్మ ధార రైతు బజారు, ఎమ్.ఆర్.ఓ. కార్యాలయం ఎదురుగా వున్న అపార్ట్ మెంట్ (బహుళ అంతస్తుల భవనం)
- 11వ వార్డు: కార్పొరేటర్ : పి అప్పల నరసింహ రాజు (తెలుగు దేశం) మొత్తం ఓటర్లు : 13688 (మగ 7050 స్త్రీలు : 6638. మెజారిటీ : 898
- వార్డు హద్దులు : సీతమ్మ ధార, పి అండ్ టి (పొస్టల్ అండ్ టెలెగ్రాఫ్స్) కోలనీ, టి.పి.టి (టౌన్ ప్లానింగ ట్రస్టు) కోలనీ, బాలయ్య శాస్త్రి లే అవుట్, రాధాకృష్ణ లే అవుట్, గాంధీ నగర్, గ్రీన్ పార్క్ కోలనీ, పోర్ట్ స్టేడియం (కొంత భాగం), నార్త్ ఎక్స్ టెన్షన్ (కొంత భాగం).
- 12వ వార్డు: కార్పొరేటర్ : పోతు నాగమణి (కాంగ్రెస్) మెజారిటీ: 85 ఓట్లు
- 13వ వార్డు : కార్పొరేటర్ : జి.వి. రవిరాజు (కాంగ్రెస్) మెజారిటీ : 13 ఓట్లు.
- 14వ వార్డు : కార్పొరేటర్ : గుడ్ల రమణి (కాంగ్రెస్) జనాభా: 13488 ఓటర్లు (మగ: 6997 స్త్రీలు:6791 మెజారిటీ: 872 ఓట్లు. పోటీ చేసిన ఇతరులు: ఎమ్. వరలక్ష్మి (తెలుగు దేశం), గుడ్ల మంగమ్మ రెడ్డి (స్వతంత్ర).
వార్డు హద్దులు: రామా టాకీసు, మద్దిల పాలెం, టి.బి. హాస్పిటలు రోడ్డుకి రెండు ప్రక్కలా వున్న ప్రాంతం. కోలనీలు:రేసపు వాని పాలెం, క్రాంతి నగర్, ఛైతన్య నగర్, నక్కవాని పాలెం, వినాయక నగర్, తులసి పేట, టి.బి. ఆసుపత్రి ప్రాంతంలోని కోలనీలు.
- 15వ వార్డు : కార్పొరేటర్ : కె.వి.లక్ష్మి (తెలుగు దేశం) మెజారిటీ : 1435.
- 16వ వార్డు : కార్పొరేటర్ : బొట్టా నరసాయమ్మ (తెలుగు దేశం) మెజారిటీ : 1325.
- 17వ వార్డు : కార్పొరేటర్ : కందిపల్లి అప్పారావు (కాంగ్రెస్) మెజారిటీ : 131.
- 18వ వార్డు : కార్పొరేటర్ : మహమ్మద్ బద్రిన్నూసా బీగం (స్వతంత్ర) మొత్తం ఓటర్లు;19988 (మగ 10068 స్త్రీలు : 9920 మెజారిటీ : 222. సామాజిక వర్గాలు: బి.సి 30%, ఎస్.సి 25%, ఎస్.టి 3%, ఇతరులు : 42%
- పోటీ చేసిన ఇతరులు: సిమ్మా భూలక్ష్మి (కాంగ్రెస్), పృ ప్రసన్న కుమరి (తెలుగు దేశం), మద్ది ఫణి కుమరి (స్వతంత్ర)
జోన్ 3 - సూర్యాబాగ్ - 19 నుంచి 30 వార్డ్లులు
[మార్చు]- 19వ వార్డు : కార్పొరేటర్ : ఆళ్ల శ్రీనివాసరావు (తెలుగు దేశం) మెజారిటీ : 575
- 20వ వార్డు : కార్పొరేటర్ : బుద్ధ అనూరాధ (తెలుగు దేశం) మెజారిటీ : 917
- 21వ వార్డు : కార్పొరేటర్ : పోలిపల్లి జ్యోతి (కాంగ్రెస్) మెజారిటీ:208
- 22వ వార్డు : కార్పొరేటర్ : సిహెస్. పోతురాజు (కాంగ్రెస్) మెజారిటీ: 895
- 23వ వార్డు : కార్పొరేటర్ : కె. వెంకట రావు (కాంగ్రెస్) మెజారిటీ : 357
- 24వ వార్డు : కార్పొరేటర్ : ఉమా మహేశ్వర రావు (తెలుగు దేశం) మొత్తం ఓటర్లు: 11435 (మగ 5800 స్త్రీలు:5636) మెజారిటీ : 812
వార్డు హద్దులు: బుక్కా వీధి, కంచర వీధి, పప్పుల వారరివీధి, చింతకాయల వారి వీధి, టౌన్ హాల్, సీతారామ గుడి వీధి, చెంగల రావు పేట, కాదంబరి వారి వీద్ధి, మట్టా వెంకప్ప వారి వీధి, వెంపు వారి వీధి, ఛావల వారి వీధి, గాంధీ బొమ్మ వీధి, సోల్జయర్ పేట, శివాలయం వీధి, చిన్నమ్మ వారి వీధి, కురుపాం మార్కెట్, హిందూ రీడింగ్ రూమ్, కనక మహాలక్ష్మి వీధి, బొబ్బిలి వారి వీధి, మొసలికంటి వారి వీధి, గంగాబత్తుల వారి వీధి.
- 25వ వార్డు : కార్పొరేటర్ : ఎమ్. పైడితల్లి (కాంగ్రెస్) మెజారిటీ; 62
- 26వ వార్డు : కార్పొరేటర్ : పి. వరలక్ష్మి (తెలుగు దేశం) మెజారిటీ : 2031
- 27వ వార్డు : కార్పొరేటర్ : తైనాల విజయ కుమార్ (తస్వతంత్ర) మొత్తం ఓటర్లు : 15600 . మెజారిటీ : 525
వార్డు హద్దులు: యల్లమ్మ తోట (జగదాంబ సెంటర్), జి.వి.ఎమ్.సి. ప్రియదర్శిని స్కూలు, సూర్యా బాగ్, డాబా గార్డెన్స్, ప్రేమ సమాజం ప్రాంతం, మాధవ ధార, పూతి వారి మన్యం, కృష్ణా గార్డెన్స్, జైల్ రోడ్, కనకాల దిబ్బ, గొల్ల పాలెం, నీలమ్మ వేప చెట్టు, ఐ.టి (ఇన్ కం టాక్స్) క్వార్టర్స్ ప్రాంతం, పోస్ట్ ఆఫీస్ కోలనీ.
- పోటీ చేసిన వారు:పి. సాయి లక్ష్మి (కాంగ్రెస్), పి. వెంకట రావు (తెలుగు దేశం), వి. రవికుమర్ (స్వతంత్ర)
- 28వ వార్డు : కార్పొరేటర్ :పి. లక్ష్మి (కాంగ్రెస్) మొత్తం ఓటర్లు 14124 (మగ 7104 స్త్రీలు : 7020) మెజారిటీ: 1114.
- వార్డు హద్దులు : అల్లిపురం, బంగారమ్మ మెట్ట, వెంకటేశ్వర మెట్ట, సాయిబాబా వీధి, డాబా గార్డెన్స్.
- 29వ వార్డు : కార్పొరేటర్ : జి. గౌరి (కాంగ్రెస్). మెజారిటీ 278
- 30వ వార్డు : కార్పొరేటర్ : బండారు శ్రీనివాసరావు (తెలుగు దేశం) మొత్తం ఓటర్లు : 18437 (మగ 9316 స్త్రీలు : 9121) మెజారిటీ:291.
వార్డు హద్దులు: దక్షిణ జైల్ రోడ్, నేరెళ్ళ కోనేరు, అల్లిపురం మెయిన్ రోడ్డు, అల్లిపురమ్ మార్కెట్, రైల్వే క్వార్టర్స్, రైల్వే స్టేషను రోడ్.
- పోటీచేసిన వారు: బి. కరుణాకర్ (కాంగ్రెస్), ఎమ్. రామిరెడ్డి (స్వతంత్ర)
జోన్ 4 - జ్ఞానాపురం - 31 నుంచి 49 వార్డులు
[మార్చు]- 31వ వార్డు : కార్పొరేటర్ : గోగినేని సాంబశివ రావు (తెలుగు దేశం) మొత్తం ఓటర్లు : 14564 (మగ 7450 స్త్రీలు : 7204) మెజారిటీ:36.
వార్డు హద్దులు: శివాలయం వీధి, తాటిచెట్ల పాలెం, చాకలి గెడ్డ, ఇందిరా కోలనీ, రైల్వే న్యూ కోలనీ, టి.ఎస్.ఎన్. కోలనీ, సుబ్బలక్ష్మి నగర్, సంగమ్ ఆఫీసు, అక్కయ్య పాలెం *పోటీ చేసిన వారు: హైదర్ ఆలీ సింకా (కాంగ్రెస్), కె.పి.రావు (స్వతంత్ర)
- 32వ వార్డు : కార్పొరేటర్ : బాణాల శ్రీనివాసరావు (కాంగ్రెస్) మొత్తం ఓటర్లు : 17888 (మగ 9089 స్త్రీలు : 8799) మెజారిటీ:1247. పోటీ చేసిన వారు: పి.ఎల్.ఎస్.ఎన్. ప్రసాద్ (తెలుగు దేశం), మళ్ళ వెంకట రావు (బి.జె.పి)
- 33వ వార్డు : కార్పొరేటర్ : వై. హేమలత (టిడిపి). మెజారిటీ: 373
వార్డు హద్దులు : వెంకటేశ్వర కాలనీ, తారకరామ నగర్, తాటిచెట్లపాలెం, నరేంద్ర నగర్, గణేష్ నగర్, రెడ్డి తాటిచెట్లపాలెం, గవర తాటిచెట్లపాలెం, శ్రీనివాసనగర్, నందగిరి నగర్, చెక్కుడు రాయి బిల్డింగ్, మద్దాల వారి వీధి.
- 34వ వార్డు : కార్పొరేటర్ : పైలా ముత్యాల నాయుడు (తెలుగు దేశం) మెజారిటీ : 373. సామాజిక వర్గాలు: బి.సి.లు 50% ఇతరులు 20%
- 35వ వార్డు : కార్పొరేటర్ : కె. కన్నారావు (తెలుగు దేశం) మెజారిటీ: 1042
- 36వ వార్డు : కార్పొరేటర్ : బొట్టా ఈశ్వరమ్మ (సి.పి.ఎమ్) మెజారిటీ: 699
- 37వ వార్డు : కార్పొరేటర్ : కొల్లాబత్తుల వెంగళ రావు (...) మెజారిటీ: 450
- 38వ వార్డు : కార్పొరేటర్ : ఎడ్ల (యడ్ల) విజయ (స్వతంత్ర). మెజారిటీ : 429
వార్డు హద్దులు : మాణిక్యాంబ కాలనీ, ఎన్.జి.ఓ కాలనీ, సత్యా నగర్, అయ్యప్ప నగర్, పి.బి. గార్డెన్, అల్లూరి సీతారామ రాజు నగర్, కె.సి.కె. పాలెం రాంజీ ఎస్టేట్, గిరిజా నగర్, మురళీనగర్, ఎనిమిదవ సెక్టార్ వరకు;
- 39వ వార్డు : కార్పొరేటర్ : సానాపతి సీతా రామాంజనేయులు (తెలుగు దేశం). మెజారిటి - 568. మొత్తం ఓటర్లు : 19450 (మగ 10282, స్త్రీలు : 9168)
వార్డు హద్దులు : మాధవ ధార, మాధవధార వుడా లే ఔట్, మురళీ నగర్, తెన్నేటి నగర్, సీతన్న బిల్డింగ్, కళింగ నగర్, నరసింహా నగర్, గాంధీ నగర్, అయ్యప్ప నగర్, అంబేద్కర్ కాలనీ, రామన్న కాలనీ, నెహతా కాలన్య్, రాజీవ్ నగర్.
- 40వ వార్డు : కార్పొరేటర్ : పి.వి. నర్స కుమారి (టిడిపి) మొత్తం జనాభా: 21000. మొత్తం: 16336 (మగ : 7826 స్త్రీలు: 8510. మెజారిటీ: 1698.
వార్డు హద్దులు: జ్యోతి నగర్ నుంచి కరాసా గెడ్డ వరకు (దుర్గాలమ్మ, బంగారమ్మ గుడి), కాలనీలు: మర్రిపాలెం, సాయి నగర్, జ్యోతినగర్, చిన్న మర్రిపాలెం, రైల్వే క్వార్టర్స్, భాస్కర్ గార్డెన్స్, ఆంధ్ర కేసరి నగర్, హుస్సేన్ నగర్, మహారాణి వీధి, మర్రిపాలెం మెయిన్ రోడ్, లక్ష్మినగర్, మర్రిపాలెం మెయిన్ రోడ్ క్వార్టర్స్, రాం నగర్ కాలనీ, శివనగర్, ఎఫ్.సి.ఐ. కాలనీ, పార్వతీనగర్, రామానాయుడు కాలనీమ్ బుఛ్చిరాజు పాలెం,
- 41వ వార్డు : కార్పొరేటర్ : పెంటకోట వరలక్ష్మి (తెలుగు దేశం) మెజారిటీ 1251........ సాకేతపురం
- 42వ వార్డు : కార్పొరేటర్ : జియ్యాని శ్రీధర్ (స్వతంత్ర) మెజారిటీ : 775
- వార్డు హద్దులు: గురజాడనగర్,
- 43వ వార్డు : కార్పొరేటర్ : కంపా హనూక్ (కాంగ్రెస్) మెజారిటీ :2359
- 44వ వార్డు : కార్పొరేటర్ : ఫతీమా రాణి (కాంగ్రెస్) మెజారిటీ :1170
- 45వ వార్డు : కార్పొరేటర్ : గల్లా శ్రీనివాస్ (కాంగ్రెస్) మెజారిటీ :1764
వార్డు హద్దులు: యారాడ గ్రామం
- 46వ వార్డు : కార్పొరేటర్ : అంగ ఛంద్ర కళ (కాంగ్రెస్). మొత్తం ఓటర్లు : 11691 (మగ 5887 స్త్రీలు 5804 ) మెజారిటీ: 988
- వార్డు హద్దులు : జింక్ క్వార్టర్స్, ములగాడ (అంగన్వాడి వుంది), ఛిన ములగాడ, ఎదురువాని పాలెం, గొందేశివాని పాలెమ్, శ్రీరామ నగర్, కుంచమ్మ కోలనీ, శాంతినగర్, పిలకవాని పాలెం, రాజ్ కమల్ దేవి కోలనీ, శ్రీనివాస కోలనీ, కోడి పందేల దిబ్బ, శ్రీనివాసనగర్, శ్రీహరిపురం (ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. శ్రీహరిపురంలో ప్రైవేటు విద్యాసంస్థలు ఎక్కువగా వున్నాయి), రామ్ నగర్, అన్నమ్మ కోలనీ, గుల్లల పాలెం, ఉప్పర కాలనీ. 46, 47, 48 వార్డులకు వైద్య సేవలు అందింఛటానికి, గుల్లల పాలెంలో 10 పడకల ఆస్వత్రి 1991 నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్వడింది. ఇందులో ఎక్ష్-రే యూనిట్ కూడా ఉంది. ఇక్కడే ఈ-సేవా కేంద్రం ఉంది. గుల్లల పాలెం మార్కెట్టులో నగరపాలక సంస్థ కట్టిన షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. హిందూస్థాన్ జీంక్ లిమిటెడ్, కోరమాండల్ ఇంటర్నేషనల్ సంస్థలు ఇక్కడకు దగ్గర్లోనే ఉన్నాయి. జింక్ ఆంజనేయ స్వామి ఆలయం, సాయిబాబా గుడి మెయిన్ రోడ్డు ప్రక్కనే ఉన్నాయి.
- 47వ వార్డు :కార్పొరేటర్ : పీలా సుహాసిని (తెలుగు దేశం) మొత్తం ఓటర్స్ 15132 (మగ 7620 స్త్రీలు 7512) మెజారిటీ : 824. పోటీ చేసిన ఇతరులు: పీలా ఉమా రాణి ( కాంగ్రేస్).
- వార్డు హద్దులు: హిమాఛల్ నగర్, మారుతి (గణపతి) నగర్, ఎన్.జి.ఓ (నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్) కోలనీ, గణపతి నగర్, ములగాద హౌసింగ్ కొలనీ, ఎక్ష్-సర్వీస్ మెన్ కోలని (మాజీ సైనికుల కాలనీ) (సామాజిక భవనం వుంది), శాంతి నగర్, పాత ఛెక్ పోస్ట్ ఏరియా, నక్కవాని పాలెం, వాయుపుత్ర నగర్, హనుమాన్ నగర్, నెహ్రూ నగర్, వుడా కోలనీ, హనుమాన్ సంజీవ కోలనీ, ఎగువ శ్రీహరిపురం, గంగా నగర్.కొత్తనక్కవాని పాలెం (బాల్వాడి కెంద్రం వుంది), చైతన్య నగర్, శాంతిగిరి కాలనీ. గుల్లలపాలెంలో మార్కెట్టు, ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నాయి. ఈ ఆసుపత్రిలో మందుల కొరత అధికం. సెలైన్ సీసాలు, ఇంజక్షన్లు, పారాసెటమాల్ వంటి మాత్రల కొరత ఉంది. నిత్యం 250మందికి పైగా ఔట్ పేషెంట్లు (రోగులలు) అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తారు.
- 48వ వార్డు : కార్పొరేటర్ : పిళ్ళా కనక రాజు (కాంగ్రెస్). మొత్తం ఓటర్లు : 15015 (మగ 7669 స్త్రీలు 7346) మెజారిటీ: 1287.
- సామాజిక వర్గాలు : గవర్లు 40%, పాలీలు (?) 20%; కాపులు 20%, ఇతరులు 10%. వార్డు హద్దులు: మల్కాపురం, రామకృష్ణాపురం (ప్రభుత్వ పాఠశాల్ వుంది), ఇందిరాకాలనీ -1 (ఆధునిక కళ్యాణ మండపం వుంది, ఇందిరా కాలనీ-2, జనతా కాలనీ (కళ్యాణ మండపం వుంది), అంబేద్కర్ కాలనీ (కమ్యూనిటీ భవనం వుంది), బాబూజీ కాలనీ (సామాజిక భవనం వుంది) ప్రియదర్శిని కాలనీ, జవహర్ నగర్, పవనపుత్ర నగర్. టిడిపి (తెలుగు దేశం) కాలనీ (ప్రభుత్వ పాఠశాల వుంది), కొండ ప్రాంతాలు అచ్ఛినాయుడు లోవ, జనతా కాలనీ, అశోక్ నగర్, వెంకన్నపాలెం కాలనీ.
48వ వార్డు ఇండస్ట్రియల్ కాలనీలోని మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకు మరమ్మతుల పనులను ఛెసారు. శిథిలావస్థకు చేరుకుంటున్న నిర్మాణాలను బాగు చేయడానికి ర్.3 లక్షల నిధులు మంజూరయ్యాయి.
- 49వ వార్డు : కార్పొరేటర్ : దాడి సత్యనారాయణ (కాంగ్రెస్) మెజారిటీ : 3566 ఓట్లు .
- వార్డు హద్దులు: కాకరలోవ, చింతల లోవ, దుర్గానగర్ (ప్రాథమిక పాథశాల వుంది), గుడివాడ అప్పన్న కాలనీ, త్రినాధపురం, ఎ.ఎస్.ఆర్. కాలనీ,
జోన్ 5 - గాజువాక - 50 నుంచి 65 వార్డులు
[మార్చు]- 50వ వార్డు : కార్పొరేటర్ : పులుసు జనార్ధన రావు (కాంగ్రెస్) మెజారిటీ: 1030 . సంజీవ కాలనీ (శ్మశాన వాటిక ఉంది. సామాజిక భవనం ఉన్నది), గంగవరం (గంగవరం పోర్టు ఇక్కడే ఉంది) (సామాజిక భవనం ఉంది), బాపూజీ కాలనీ (సామాజిక భవనం ఉంది), నేతాజీ కాలనీ (సామాజిక భవనం ఉంది), ఉప్పర కాలనీ (సామాజిక భవనం ఉంది). వాంబే కాలనీ, వికాస్ నగర్ (పార్కు వుంది), దిబ్బపాలెం పునరావాస కాలనీ. ఈ వార్డులో మూడు దోభీఖానాలు ఉన్నాయి.. భానోజీ తోట, జరాజీవ్ మార్గం, కాకతీయనగర్, గొడ్డువానిపాలెం, కొంగపాలెం, వెమ్కన్నపాలెం, యాత పాలెం ప్రియ దర్శిని కాలని, (సిటిజన్స్ రిసోర్స్ సెంటర్ ఉంది), వికాస్ నగర్, గంగవరంలో 100 కిలోలీటర్లు పట్టే మూడు రెజర్వాయర్లను నిర్మిస్తున్నారు. ఇండొర్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మిస్తున్నారు. ఈ వార్డులో, నీటికి ఇబ్బంది పడకుండగా గంగవరంలో మూడు, భానోజీ తోట, గిరిజా కాలనీ, బాపూజీ కాలనీ, సంజీవగిరి కాలనీ, కొంగ పాలెం, వాంబే కాలనీలలో ఒక్కొక్కటి చొప్పున రక్షిత మంచినీటి సదుపాయాన్ని కల్పించారు.
- 51వ వార్డు : కార్పొరేటర్ : కోన తాతారావు ( తెలుగు దేశం) :
- 52వ వార్డు : కార్పొరేటర్ : జియ్యాని శ్రీధర్ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) మెజారిటీ
- 53వ వార్డు : కార్పొరేటర్ : గొర్లె వెంకు నాయుడు (తెలుగు దేశం) మెజారిటీ : 198 మొత్తం ఓటర్లు 14861 (మగ 7792 స్త్రీలు 7069)
- వార్డు హద్దులు : కణితి, వడ్లపూడి, లక్ష్మిపురం కోలనీ, కాశీ పాలెమ్, ఉప్పర పాలెం, దుగ్గపు వాని పాలెం, వడ్లపూడి రైల్వే క్వార్టర్స్, సి.ఐ.ఎస్.ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) క్వార్టర్స్, పోలీసు క్వార్టర్స్, గణేష్ నగర్ ప్రాంతాలు.
- 54వ వార్డు : కార్పొరేటర్ : కె.విమల (సి.పి.ఎమ్) మెజారిటీ ; 1210
- 55వ వార్డు : కార్పొరేటర్ : తిప్పల నాగిరెడ్డి (స్వతంత్ర) మెజారిటీ: 1342
- 56వ వార్డు : కార్పొరేటర్ : డి. లక్ష్మి (కాంగ్రెస్) మెజారిటీ : 948
- 57వ వార్డు : కార్పొరేటర్ : చొప్పా నాగ రాజు (కాంగ్రెస్ ) మెజారిటీ: 429
- 58వ వార్డు : కార్పొరేటర్ : లేళ్ళ కోటేశ్వర రావు (తెలుగు దేశం) మొత్తం ఓటర్లు : 17245 (మగ 8358 స్త్రీలు: 8889) మెజారిటీ : 506.
వార్డు హద్దులు :యాదవ జగ్గరాజు పేట (పూర్వం గొల్ల జగ్గరాజు పేట. 'గొల్ల' పేరును 'యాదవ' గా మార్చారు), కాపు జగ్గరాజు పేట, ఫకీర్ తకయా (తక్యా), సిద్ధార్ధ నగర్, కూర్మన్న పాలెం, వుడా ఫేజ్ -7, రాసాలమ్మ కోలనీ, రాజీవ్ నగర్, యాత పాలెం, ఉప్పర కోలనీ, ఉక్కు నగరం లోని సెక్టార్ 2, 3 తదితర కోలనీలు. పోటీచేసిన ఇతరులు: వి.వి.ఎన్.ఎమ్. రాజా (కాంగ్రెస్), వెలుగుల పరశురాముదు (స్వతంత్ర).
- 59వ వార్డు : కార్పొరేటర్ : గోపిశెట్తి కృష్ణారావు (స్వతంత్ర). మెజారిటీ : 825
- 60వ వార్డు : కార్పొరేటర్ : ఉరుకూటి అప్పా రావు (కాంగ్రెస్) మెజారిటీ : 1086
- 61వ వార్డు : కార్పొరేటర్ : ఎ.జె.స్టాలిన్ (సి.పి.ఐ) మొత్తం ఓట్లు : 20073 (మగ 10325 స్త్రీలు : 9748) మెజారిటీ : 112
- వార్డు హద్దులు: శ్రీనగర్, సుందరయ్య కోలనీ, కర్ణవాని పాలెం, అఫీషియల్ కోలనీలు.
- 62వ వార్డు : కార్పొరేటర్ : ఎమిలి జ్వాల (స్వతంత్ర) మెజారిటీ: 30
- 63వ వార్డు : కార్పొరేటర్ : మహమ్మద్ రఫీ (తెలుగు దేశం) మెజారిటీ :1697
- 64వ వార్డు : కార్పొరేటర్ : పల్లా శ్రీనివాసరావు (తెలుగు దేశం) మెజారిటీ :506
- 65వ వార్డు : కార్పొరేటర్ : గుడివాడ అమర్ నాద్ (తెలుగు దేశం) మెజారిటీ: 865.
జోన్ 6 - పెందుర్తి - 66 నుంచి 72 వార్డులు
[మార్చు]- 66వ వార్డు : కార్పొరేటర్ : ఐతంశెట్టి సత్యవతి (తెలుగు దేశం) మెజారిటీ: 1034 . ఎల్లపువాని పాలెం, చంద్ర నగర్, మహాత్మ ఆదర్శ నగర్, కొత్తపాలెం, గణపతి నగర్ (కొత్తపాలెం పరిధి గణపతి నగర్ లో శ్రీ మారుతి ఆలయం వుంది) డి.ఎ.ఆర్ నగర్, సంతోష్ నగర్, ఖారవేల నగర్, సూర్యనగర్, వెంకటాపురం, కంపరపాలెం (కంచరపాలెం సరిచూడాలి), ఎన్.సి.బి.సి. కాలనీ, నందమూరి నగర్, పద్మనాభ నగర్,
- 67వ వార్డు : కార్పొరేటర్ : చెంగల వెంకట లక్ష్మి (తెలుగు దేశం) మెజారిటీ : 1629
- 68వ వార్డు : కార్పొరేటర్ : బెహరా భాస్కర రావు (కాంగ్రెస్) మొత్తం ఓటర్లు : 22000 (మగ 17596 స్త్రీలు : 8442) మెజారిటీ : 4599
- వార్డు హద్దులు: గోపాలపట్నం మెయిన్ రోడ్డుకు రెండు ప్రక్కలా వున్న కోలనీలు, పాత గోపాల పట్నం. కోలనీలు: పాత గోపాలపట్నం, నెతాజీ కోలనీ, నాయుడు క్వార్టర్స్, అంగద వీధి, ప్రశాంతి నగర్, శ్రీరామ నగర్, రజక కోలనీ, శ్రీను బాబు నగర్, బాపూజీ, టైలర్స్ కోలనీ, అజంతా పార్క్, అర్. ఆర్.వి. పురమ్, ఇందిరా నగర్, నరసింహ నగర్, గణేష్ నగర్, రామకృష్ణ నగర్, లక్ష్మి నగర్. జువ్వమాంబ కాలనీ (ఇక్కడ జువ్వమాంబ గుడి వుంది). గోపాలపట్నంలో 30 పడకల ఆస్పత్రి ఉంది.
- 69వ వార్డు: కార్పొరేటర్ : రాపర్తి శైలజ (స్వతంత్ర). మొత్తం జనాభా ; 27000 ఓటర్లు : 16830 (మగ 8522 స్త్రీలు: 8308. మెజారిటీ: 1976.
- వార్డు హద్దులు: ప్రహ్లాద పురం నుంచి వేప గుంట వరకు. కోలనీలు: ముత్యమాంబ కోలనీ, బి.సి. (బేక్ వార్డ్ క్లాస్) కోలనీ, ప్రశాంత నగర్, శివాలయంమెట్ట, గౌతమ్ నగర్, గంగిరెడ్ల కోలనీ, నాయుడు తోట, కృష్ణా నగర్, దుర్గా నగర్, విరాట్ నగర్, శ్రీ సాయి మాధవ నగర్ తో పాటు పల్లి నారాయణ పురమ్ తదితర కోలనీలు. ముత్యమాంబకాలనీలో 2010 జూలై 21 వరకు రూ.20 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయి. కాలనిలో రూ.11 లక్షలతో నిర్మించనున్న సామాజిక భవనానికి 2010 జూలై 21 తేదీన శంకుస్థాపన చేసారు. మరో మిరికినీటి (ఎస్.డబల్‌యు) డ్రైనేజీని త్వరలో నిర్మిస్తారు.
- 70వ వార్డు :కార్పొరేటర్ : సానాపతి వసంత (తెలుగు దేశం) మొత్తం ఓటర్లు : 20408 (మగ 10192 స్త్రీలు: 10218) మెజారిటీ: 1509
వార్డు హద్దులు: ఛిన ముషిడివాడ, సుజాత నగర్, లక్ష్మి పురం, పాపయ్య రాజు పాలెం, పురుషోత్తమ పురం, పురుషోత్తమ పురమ్ కోలనీ, చీపురుపల్లిలో కొంత భాగం, పొర్లు పాలెంలో కొంత భాగం.
- 71వ వార్డు : కార్పొరేటర్ : ఎస్.సిహెచ్. అప్పల నాయుడు (కాంగ్రెస్).మెజారిటీ: 1861
- 72వ వార్డు : కార్పొరేటర్ : పాశర్ల వసంత కళ్యాణి (తెలుగు దేశం) జనాభా: 26000 మొత్తం ఓటర్లు: 18303 (మగ 9100 స్త్రీలు: 9203) మెజారిటీ:2311. పోటీ చేసిన ఇతరులు: లోగిశ పైడితల్లి (కాంగ్రెస్), దాసరి భవాని లక్ష్మి (బి.జె.పి).
నియోజక వర్గాలు
[మార్చు]- విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
- శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గం
- భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం - సింహాఛలం (కొంత భాగం), భీమిలి (భీమునిపట్నం) మునిసిపాలిటీ, భీమిలి మండలం, పద్మనాభం, ఆనందపురం.
- తూర్పు విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గం - 1 నుంచి 11 వార్డులు.
- దక్షిణ విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గం - 12 నుంచి 34, 42, 43 వార్డులు.
- పశ్చిమ విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గం - 35 నుంచి 49, 66 నుంచి 69 వార్డులు.
- ఉత్తర విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం - 26 నుంచి 33 వార్డులు.
- గాజువాక శాసనసభ నియోజకవర్గం - గాజువాక, పెద గంట్యాడ మండలాల్లో వున్న 50నుంచి 65 వార్డులు.
- అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
- పెందుర్తి శాసనసభ నియోజకవర్గం - 69 నుంచి 72 వార్డులు. పెందుర్తి, సింహాచలం మండలంలు.