వెంకటేష్ మహా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెంకటేష్ మహా
2018లో కేరాఫ్ కంచరపాలెం సక్సెస్ మీట్ లో వెంకటేష్ మహా
జననం
వృత్తిసినిమా దర్శకుడు
స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు2011 - ప్రస్తుతం

వెంకటేష్ మహా, తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. 2018లో వచ్చిన కేరాఫ్ కంచరపాలెం,[1] 2020లో వచ్చిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలకు దర్శకత్వం వహించాడు.

జీవిత విషయాలు

[మార్చు]

వెంకటేష్ మహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో జన్మించాడు. తన పదహారేళ్ళ వయసులో ఇంటినుండి వచ్చేసిన వెంకటేష్ మహా, వివిధ ఉద్యోగాలలో పనిచేశాడు.

సినిమారంగం

[మార్చు]

2011లో వచ్చిన తీన్ మార్ సినిమాకు స్పాట్ బాయ్ గా పనిచేసిన వెంకటేష్ మహా, అదే సంవత్సరం వచ్చిన ఆకాశమే హద్దు సినిమాలో కూడా నటించాడు. నూతన నటులతో 2018లో కేరాఫ్ కంచరపాలెం సినిమా తీశాడు. ఈ సినిమా మొత్తం కంచరపాలెం గ్రామంలో చిత్రీకరించబడింది.[2][3] ఆ తరువాత, మలయాళ సినిమా మహేశ్‌ ఇంటే ప్రతికారం రిమేక్ గా 2020లో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా తీశాడు.[4] సత్యదేవ్ కంచరాన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎక్కువభాగం అరకులోయలో చిత్రీకరించబడింది.[5][6]

సినిమాలు

[మార్చు]

దర్శకుడిగా

[మార్చు]
సంవత్సరం సినిమా ఇతర వివరాలు
2018 కేరాఫ్ కంచరపాలెం
2020 ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

నిర్మాతగా

[మార్చు]
సంవత్సరం సినిమా ఇతర వివరాలు
2022 అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు [7]
2022 మర్మాణువు

నటుడిగా

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
2006 సుందరానికి తొందరెక్కువ
2011 ఆకాశమే హద్దు నారాయణ స్నేహితుడు
2020 ఉమామహేశ్వర ఉగ్రరూపస్య టీ షాపు ఓనర్ అతిథి పాత్ర
2023 యాంగర్ టేల్స్
2023 మార్టిన్ లూథర్ కింగ్

స్క్రీన్ ప్లే రచయితగా

[మార్చు]
సంవత్సరం సినిమా భాష ఇతర వివరాలు
2021 కేరాఫ్ కాదల్ తమిళం కేరాఫ్ కంచరపాలెం రీమేక్
2023 మార్టిన్ లూథర్ కింగ్

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగం సినిమా ఫలితం మూలాలు
2019 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ దర్శకుడు - తెలుగు కేరాఫ్ కంచరపాలెం నామినేట్ [8]
2021 సైమా అవార్డు ఉత్తమ దర్శకుడు - తెలుగు ఉమామహేశ్వర ఉగ్రరూపస్య నామినేట్

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Dundoo, Sangeetha Devi (February 27, 2018). "Venkatesh Maha bats for original, real-life inspired stories". The Hindu. Retrieved 18 April 2021.
  2. Kavirayani, Suresh (September 9, 2018). "C/o Kancharapalem movie review: This realistic film is worth a watch". Deccan Chronicle. Retrieved 18 April 2021.
  3. "C/o Kancharapalem Movie Review {4/5}: Let these voices raise!". The Times of India. Retrieved 18 April 2021.
  4. Dundoo, Sangeetha Devi (June 5, 2020). "Venkatesh Maha to showcase another close-to-reality story with Satyadev starrer 'Uma Maheswara Ugra Roopasya'". The Hindu. Retrieved 18 April 2021.
  5. Dundoo, Sangeetha Devi (July 13, 2020). "Appu Prabhakar: Venkatesh Maha didn't want anything glossed over". The Hindu. Retrieved 18 April 2021.
  6. "Uma Maheswara Ugra Roopasya movie review: Satyadev Kancharana delivers the goods". July 30, 2020. Retrieved 18 April 2021.
  7. Andhrajyothy (11 January 2022). "యంగ్ డైరెక్టర్ కూడా నిర్మాతగా బిజీ బిజీ". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
  8. "Nominations for the 66th Filmfare Awards (South) 2019". Filmfare. Retrieved 18 April 2021.

బయటి లంకెలు

[మార్చు]