శ్రీలక్ష్మి కనకాల
శ్రీలక్ష్మి కనకాల | |
---|---|
జననం | శ్రీలక్ష్మి కనకాల జూన్ 20 |
మరణం | ఏప్రిల్ 6, 2020 |
విద్య | ఎం.ఏ. (ఆంగ్లం) |
వృత్తి | టెలివిజన్ నటి |
జీవిత భాగస్వామి | డా. పెద్ది రామారావు |
పిల్లలు | ప్రేరణ, రాగలీన |
తల్లిదండ్రులు | దేవదాస్ కనకాల, లక్ష్మీదేవి కనకాల |
బంధువులు | రాజీవ్ కనకాల (అన్నయ్య), సుమ కనకాల (వదిన) |
శ్రీలక్ష్మి కనకాల తెలుగు టెలివిజన్ నటి. దూరదర్శన్ లో వచ్చిన రాజశేఖర చరిత్రము అనే ధారావాహిక ద్వారా నటనలోకి అడుగుపెట్టిన శ్రీలక్ష్మి, అనేక ధారావాహికల్లో నటించింది.[1]
జననం - కుటుంబ నేపథ్యం
[మార్చు]శ్రీలక్ష్మి జూన్ 20న దేవదాస్ కనకాల (రంగస్థల, చలనచిత్ర నటులు, దర్శకులు, నట శిక్షకులు), లక్ష్మీదేవి కనకాల (రంగస్థల, చలనచిత్ర నటి, నట శిక్షకురాలు) దంపతులకు హైదరాబాదులో జన్మించింది. నటుడు రాజీవ్ కనకాల, టెలివిజన్ వ్యాఖ్యాత సుమ కనకాలలు శ్రీలక్ష్మికి అన్నావదినలు.[2]
విద్యాభ్యాసం - ఉద్యోగం
[మార్చు]చదువులో చురుగ్గా ఉండే శ్రీలక్ష్మి పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలనుకుంది. విద్యోదయ హైస్కూల్ లో తన పాఠశాల విద్యను చదివిన శ్రీలక్ష్మి, మద్రాస్ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. (ఆంగ్లం) పూర్తిచేసింది. ఆ తరువాత కొన్ని సంవత్సరాలు ప్రైవేటు ఉపాధ్యాయురాలుగా పనిచేసింది.
వివాహం - పిల్లలు
[మార్చు]2002, మార్చి 31న కవి, తెలుగు కథా రచయిత, రంగస్థల అధ్యాపకులైన డా. పెద్ది రామారావుతో శ్రీలక్ష్మి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు (ప్రేరణ, రాగలీన).[3]
నటజీవితం
[మార్చు]దూరదర్శన్ లో వచ్చిన రాజశేఖర చరిత్రము అనే ధారావాహిక ద్వారా టీవిరంగంలోకి ప్రవేశించింది. ఆ తరువాత తన తండ్రి దర్శకత్వం వహించిన ధారావాహికలతోపాటు, ఇతర ధారావాహికలలో నటించింది. అంటేకాకుండా ఒక కన్నడ టెలీఫిలిం, ఒక హిందీ చిత్రంలో నటించింది.
నటించిన ధారావాహికలు
[మార్చు]జెమిని టీవిలో వచ్చిన అగ్నిపూలు ధారావాహికలో ప్రధానపాత్ర పోషించింది.[4]
- దూరదర్శన్ - రాజశేఖర చరిత్రము, స్వయంవరం
- జెమినీ టీవీ - చిన్నారి, కొత్త బంగారం, అగ్నిపూలు, కలియుగ రామాయణం, అరుందతి, స్వాతి, ఆకాశగంగ, అగ్నిపూలు, నేను ఆయన నలుగురు అత్తలు, సూపర్ మామ్
- ఈటీవి - ప్రియాంక, ఋతుధార
పురస్కారాలు
[మార్చు]- జెమిని స్పెషల్ బెస్ట్ యాక్టర్ అవార్డు (అగ్నిపూలు)
మరణం
[మార్చు]శ్రీలక్ష్మీ క్యాన్సర్ కారణంగా 2020, ఏప్రిల్ 6న హైదరాబాదులో మరణించింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ నెట్ టీవి 4 యూ. "Srilakshmi Kanakala". www.nettv4u.com. Retrieved 4 July 2017.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ సాక్షి, సినిమా (6 April 2020). "రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మీ కనకాల మృతి". Sakshi. Archived from the original on 6 April 2020. Retrieved 7 April 2020.
- ↑ The Hans India, Entertainment (6 April 2020). "Rajiv Kanakala's sister passes away in Hyderabad". www.thehansindia.com (in ఇంగ్లీష్). Roja Mayabrahma. Archived from the original on 6 April 2020. Retrieved 7 April 2020.
- ↑ The Times of India, Entertainment (6 April 2020). "Suma Kanakala's sister-in-law and TV actress Srilakshmi Kanakala passes away battling cancer". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 6 April 2020. Retrieved 7 April 2020.
- ↑ 10TV. "సుమ ఇంట విషాదం.. రాజీవ్ కనకాల చెల్లెలు హఠాన్మరణం." www.10tv.in (in ఇంగ్లీష్). Archived from the original on 6 April 2020. Retrieved 6 April 2020.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)