సత్యభామ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్యభామ

సత్యభామ సత్రాజిత్తు కుమార్తె. శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకరు. ఈమె భూదేవి అవతారం అని విశ్వసిస్తారు. గోదాదేవి సత్యభామ అవతారం అని అంటారు.

భాగవతం దశమ స్కంధంలో సత్యభామ వృత్తాంతంలో నరకాసుర వధ ప్రముఖంగా చెప్పబడిన విషయాలు - శ్యమంతకోపాఖ్యానం, నరకాసుర వధ, పారిజాతాపహరణం, శ్రీకృష్ణ తులాభారం.

శ్యమంతకోపాఖ్యానం

[మార్చు]
సత్యభామ శ్రీకృష్ణుల వివాహము

వినాయక వ్రత కల్ప విధానములో చదివే వ్రతకథలోని శ్యమంతకోపాఖ్యానం ద్వారా సత్యభామ పరిణయవృత్తాంతం హిందువులకు సుపరిచితం. సత్రాజిత్తు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించాడు. సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అడవికి వెళ్ళినాడు. సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయింది. నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు (అంతకు పూర్వం కృష్ణుడు ఆ మణిని రాజునకిమ్మని చెప్పినందున). ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది. అడవిలో అన్వేషణ సాగించి, జాంబవంతుని ఓడించి, మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యథార్థమును వివరించి నిందబాపుకున్నాడు శ్రీకృష్ణుడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు. అలా సత్యభామను కృష్ణునికిచ్చి పెళ్ళి చేసినందుకు కోపించిన శతధన్వుడు తరువాతి కాలంలో సత్రాజిత్తును సంహరించాడు. (సత్యభామను కృతవర్మ బంధువులకిచ్చి వివాహం చేస్తానని పూర్వం ఇచ్చిన మాటను సత్రాజిత్తు తప్పినందుకు కారణంగా).

సత్యభామ సంతతి

[మార్చు]

శ్రీకృష్ణునికి సత్యభామయందు కలిగిన సంతతి - భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, కలిభానుడు, శ్రీభానుడు.

నరకాసుర వధ

[మార్చు]
సత్యభామా సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురునితో యుద్ధం ఛేయడం - మెట్రొపాలిటన్ మ్యూజియంలో ఉన్న చిత్రం

నరకాసుర వధలో సత్యభామ పాత్ర గురించి వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి. తెలుగునాట అధిక ప్రచారంలో ఉన్న కథ ప్రకారం నరకాసురుడు తన తల్లి తప్ప వేరొకరిచే మరణం లేకుండా వరం పొందాడట. ఈ సంగతి తెలిసిన కృష్ణుడు యుద్ధం మూర్ఛపోయినట్లు నటించగా, భూదేవి అవతారం అయిన సత్యభామ ధనుస్సు ఎక్కుపెట్టి వదలిన బాణంతో నరకుడు మరణించాడు. మరికొన్న చోట్ల ఉన్న కథ ప్రకారం యుద్ధం చూడాలనే కుతూహలంతో సత్యభామ కృష్ణుని కూడా వెళ్ళింది కాని కృష్ణుడే చక్రాయుధంతో నరకుని కడతేర్చాడు.

తెలుగు సాహిత్యంలో సత్యభామ పాత్ర చిత్రణ

[మార్చు]

శ్రీకృష్ణుని అష్టభార్యలలో సత్యభామ పాత్ర చిత్రణ తెలుగునాట సాహిత్యంలో విశిష్టమైన పాత్ర సంతరించుకొంది. స్వాధీనపతికయైన నాయుక గాను, సరస శృంగారాభిమానవతిగాను, విభునికి తనపైనున్న ప్రేమకారణంగా గర్వం మూర్తీభవించినదానిగాను సత్యభామ పాత్రను చిత్రీకరించారు.

పోతన భాగవతం

పోతన భాగవతంలో నరకాసుర వధ సందర్భంగా సత్యభామ పాత్రను అందమైన పద్యాలలో చిత్రీకరించాడు. యుద్ధం సమయంలో ఆమె హరునికి ప్రియశృంగారమూర్తిగాను, శత్రువుకు భీకర యుద్ధమూర్తిగాను ఒకేమాఱు దర్శనమిచ్చిందట..

నంది తిమ్మన పారిజాతాపహరణం
తులాభారం
కూచిపూడి నాట్యం, భామా కలాపం
తెలుగు సినిమాలలో

శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణసత్య, దీపావళి అంటి అనేక తెలుగు సినిమాలు సత్యభామ పాత్ర ప్రాముఖ్యతతో వెలువడినాయి.

గోదాదేవి కథ

[మార్చు]

మూలాలు

[మార్చు]

వనరులు

[మార్చు]
  • శ్రీమద్భాగవతము సరళాంధ్ర పరివర్తన - ఏల్చూరి మురళీధరరావు - రామకృష్ణమఠం ప్రచురణ

ఇతర విశేషాలు

[మార్చు]

సత్య భామ సాంత్వనం

"https://te.wikipedia.org/w/index.php?title=సత్యభామ&oldid=4062178" నుండి వెలికితీశారు