స్టియరిక్ ఆమ్లం
పేర్లు | |
---|---|
IUPAC నామము
Octadecanoic acid
| |
ఇతర పేర్లు
C18:0 (Lipid numbers)
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [57-11-4] |
పబ్ కెమ్ | 5281 |
డ్రగ్ బ్యాంకు | DB03193 |
SMILES | CCCCCCCCCCCCCCCCCC(=O)O |
ధర్మములు | |
C18H36O2 | |
మోలార్ ద్రవ్యరాశి | 284.48 g·mol−1 |
స్వరూపం | white solid |
సాంద్రత | 0.847 g/cm3 at 70 °C |
ద్రవీభవన స్థానం | 69.6 °C (157.3 °F; 342.8 K) |
బాష్పీభవన స్థానం | 383 °C (721 °F; 656 K) |
0.0003 g/100 mL (20 °C) | |
వక్రీభవన గుణకం (nD) | 1.4299 |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
స్టియరిక్ ఆమ్లం (Stearic acid ; IUPAC name octadecanoic acid) 18 కార్బనులు కలిగిన సంతృప్త కొవ్వు ఆమ్లం. దీని రసాయన ఫార్ములా : CH3 (CH2) 16CO2H. దీనికి స్టియరిక్ ఆమ్లం అనేపేరు గ్రీకు భాష లోని στέαρ ( "stéatos" అనగా టాలో (Tallow) నుండి వచ్చింది. దీనిలవణాలు, ఎస్టర్లను "స్టియరేట్స్" (Stearates) అంటారు.
స్టియరిక్ ఆమ్లం 18 కార్బనులను కలిగివున్న, ఏటువంటి ద్విబంధాలు లేని, సరళ (straight) హైడ్రొకార్బను శృంఖలం కలిగివున్న మోనోకార్బలిక్ సంతృప్త కొవ్వుఆమ్లం. కొవ్వుఆమ్లం ఒక చివర ఒక కార్బొక్సిల్ప్ గ్రూప్‌ను మాత్రమే కల్గివుండటం వలన కొవ్వు ఆమ్లంలను మోనోకార్బలిక్ ఆమ్లం లందురు. లారిక్, పామిటిక్ సంతృప్త ఆమ్లంల తరువాత విస్తృతంగా జంతు కొవ్వులలో, క్షీరదాల పాలలో, శాకకొవ్వులు/నూనెలలో కన్పించె సంతృప్త కొవ్వు ఆమ్లం స్టియరిక్ ఆమ్లం. జంతుకొవ్వులలో 35-60% వరకు, శాకనూనెలలో 5-45% వరకు స్టియరిక్ ఆమ్లం లభించును. స్టియరిక్ ఆమ్లం తెల్లగా ఘనరూపంలో వుండును. ఉపరితలం మైనంవంటి మెరుపు కల్గివుండును, వేడిచేసిన పారదర్శకంగా ద్రవంగా మారును, శాకకొవ్వులైన కొకోబట్టరు, షియా (shea) బట్టరులో, కొకమ్ (kokam), సాల్వ (sal) కొవ్వులలో అధికమొత్తంలో లభించును.
ధర్మాలు
[మార్చు]'స్టియరిక్ ఆమ్లం భౌతిక రసాయనిక ధర్మాల పట్టిక
భౌతిక/రసాయనిక ధర్మం | విలువలమితి |
అణుభారం | 248.48 |
ద్రవీభవన ఉష్ణోగ్రత | 69.60C |
మరుగు ఉష్ణోగ్రత (512mm/Hg) | 355.20C |
సాంద్రత (800Cవద్ద) | 0.8390 |
వక్రీభవన సూచిక (800C వద్ద) | 1.4299 |
స్నిగ్థత mPa.s (800C వద్ద) | 7.79 |
వెలుగు ఉష్ణోగ్రత | 1910C |
స్వీయదహన ఉష్ణోగ్రత | 3950C |
స్టియరిక్ ఆమ్లంను కలిగివున్న జంతు కొవ్వులు, శాక కొవ్వులు/నూనెలు
[మార్చు]జంతుకొవ్వులు
కొవ్వురకం | శాతం |
మటన్ టాలో | 33-34 |
బీఫ్‌టాలో | 19-20 |
లార్డ్ | 13.5 |
చికెన్‌బ్రెస్ట్, స్కిన్‌లెస్ | 8.3 |
శాకకొవ్వులు/నూనెలు
నూనె | శాతం | నూనె | శాతం | నూనె | శాతం |
కొకొబట్టరు | 35-36 | సాల్‌కొవ్వు | 43-45 | మామిడి పిక్కలు | 35-37 |
కొకమ్ | 80-87 | ధుపా | 45-47 | ఇప్ప నూనె | 20-25 |
హెంప్ (hemp) | 1.0-3.0 | షియా | 40-41 | తంబ | 9-10 |
నువ్వులు | 4-5 | కొపక్ | 5-9 | వేరుశనగ | 1.0-3.0 |
మొక్కజొన్న | 2.0-2.5 | కొబ్బరి | 1.0-3.0 | పత్తిగింజలు | 2.0-2.5 |
స్టియరిక్ ఆమ్లంను ఉత్పత్తి చేయుట
[మార్చు]- జంతు కొవ్వులలో స్టియరిక్ ఆమ్లం ట్రైస్టియరిన్‌గా వుండును. అందుచే జంతుకొవ్వులను 'హైడ్రొలిసిస్' చెయ్యడం వలన స్టియరిన్ ఆమ్లం ఉత్పత్తి అగును. అయితే ఇందులో అల్పప్రమాణంలో ఇతర కొవ్వుఆమ్లాలు వుండును.
- స్టియరిక్ ఆమ్లం అధిక శాతంలో కలిగివున్న శాకకొవ్వుల నూనెలోని కొవ్వుఆమ్లాలను, హైడ్రొలిసిస్ ద్వారా కొవ్వు ఆమ్లాలుగా విడగొట్తి, కొవ్వు ఆమ్లాలను అంశిక స్వేదనం (fractional distillation) చెయ్యడం ద్వారా స్టియరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చెయ్యవచ్చును. నూనెలోని కొవ్వుఆమ్లాల కార్బనుల సంఖ్య తేడా 2 గా వుండటం వలన వాటి మరుగు ఊష్ణోగ్రతలో తేడా తగినంతగా వుండటం వలన అంశీక స్వేదనం వలన వేరు చెయ్యవచ్చును.
- సులభంగా స్టియరిక్ ఆమ్లాన్ని తయారుచేయు మరో పద్థతి 'ఉదజనీకరణ' (hydrogenation). ఒలిక్ ఆమ్లమును సంపూర్ణ ఉదజనీకరణ (Total hydrogenation) చేయడం వలన ఒలిక్ ఆమ్లంలోని ద్విబంధం హైడ్రొజను సంయోగం వలన తొలగింపబడును. శుద్ధీచేసిన ఒలిక్ ఆమ్లంకు, నికెల్ కెటలిస్ట్ సమక్షంలో, వత్తిడిలో హైడ్రొజను కలిపిన, ఉదజనికరణ జరిగి ఒలిక్ ఆమ్లం స్టియరిక్ అమ్లంగా మారును.
- పారిశ్రామిక రంగంలో వంటకు వుపయుక్తం కాని శాకనూనెలను నూనెలను ఉదజనీకరణ చేసి తయారైన ఉదజనికృత కొవ్వు (hydrogenated fat) ను స్టియరిక్ ఆమ్లం పేరుతో అమ్మకం చేస్తారు. ఉదజనీకరణ వలన ఎర్పడిన స్టియరిక్ ఆమ్లం తెల్లగా, గట్టిగా ముద్దగా వుండును. దీనిని పౌడరుగా, లేదా ఫ్లేక్స్‌గా చేసి బస్తాలలో నింపెదరు.
వినియాగం
[మార్చు]- స్టియరిక్ ఆమ్లంతో తయారుచేసిన సబ్బులు (సోడియం స్టియరేట్) గట్టిగా వుండటం వలన టాయ్‌లెట్ సబ్బులు, బార్ సోపులు తయారుచేయుదురు.
- స్టియరిక్ ఆమ్లాన్ని అధిక శాతంలో కలిగివున్న కొకొ బట్టరు, సాల్ బట్టరు, వంటివాటిని, మార్గరినులు, చాకోలెట్‌లు, బేకింగ్ ప్రొడక్ట్స్ తయారిలో వుపయోగిస్తారు.
- రబ్బరును మృదువుగా వుండునట్లు చేయుటకు రబ్బరుపరిశ్రమలో వినియోగిస్తారు.
- ఎక్కువసేపు నిలచి మండేగుణం వుండటం వలన కొవ్వొత్తులతయారిలో వినియోగిస్తారు.
- షేవింగ్ క్రీములలో, ఎయిరొల్ (aerol) లలో బాగానురుగు నిచ్చెటందుకు వాడెదరు.
- మిఠాయి (candies) ల తయారిలోను వాడెదరు.
- బాణాసంచ (fire works) తయారిలో వినియోగిస్తారు.
- మాత్రల (Tablets) తయారిలో 'బైండరు'గా స్టియరిక్ ఆమ్లాన్ని వినియోగిస్తారు. స్టియరిక్ ఆమ్లం మాత్రలలోని ఔషధ పదార్థంలను దగ్గరిగా పట్టివుంఛడమే కాకుండగా, గొంతులో సులువుగా జారెటట్లు చేయును
మూలాలు
[మార్చు]- ↑ Susan Budavari, ed. (1989). Merck Index (11th ed.). Rahway, New Jersey: Merck & Co., Inc. p. 8761. ISBN 9780911910285.