హైదరాబాదు రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైదరాబాదు రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు

హైదరాబాదు రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. హైదరాబాదు జిల్లాలోని 2 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలనలో 9 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం హైదరాబాదు పట్టణంలో ఉంది.[2] 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఇది హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలోని నాంపల్లి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

వివరాలు[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[4]

పరిపాలన[మార్చు]

హైదరాబాదు డివిజన్‌లోని మండలాలు:[5]

క్ర.సం హైదరాబాదు రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 అంబర్‌పేట్ మండలం 4 రెవెన్యూ గ్రామాలు
2 హిమాయత్‌నగర్ మండలం 4 రెవెన్యూ గ్రామాలు
3 నాంపల్లి మండలం 2 రెవెన్యూ గ్రామాలు
4 ఆసిఫ్‌నగర్ మండలం 5 రెవెన్యూ గ్రామాలు
5 సైదాబాద్ మండలం 5 రెవెన్యూ గ్రామాలు
6 బహదూర్‌పుర మండలం 6 రెవెన్యూ గ్రామాలు
7 బండ్లగూడ మండలం 7 రెవెన్యూ గ్రామాలు
8 గోల్కొండ మండలం 3 రెవెన్యూ గ్రామాలు
9 చార్మినార్ మండలం 3 రెవెన్యూ గ్రామాలు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Suryapet district" (PDF). New Districts Formation Portal. Archived from the original (PDF) on 11 October 2016. Retrieved 2022-10-31.
  3. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-10-31.
  4. "Revenue Divisions | Hyderabad District, Government of Telangana | India". hyderabad.telangana.gov.in. Archived from the original on 2022-09-27. Retrieved 2022-11-05.
  5. "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2022-10-31.