Jump to content

అందం కోసం పందెం

వికీపీడియా నుండి
(అందరికోసం పందెం నుండి దారిమార్పు చెందింది)
అందం కోసం పందెం
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆమంచర్ల శేషగిరిరావు
తారాగణం కాంతారావు,
కాంచన,
భారతి,
విజయలలిత,
రాజనాల,
రాజబాబు
సంగీతం ఎస్.పి. కోదండపాణి
నేపథ్య గానం ఘంటసాల,
పి. సుశీల
నిర్మాణ సంస్థ హృషీకేష్ పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు

[మార్చు]
  • కాంతారావు - మాధవుడు
  • రాజనాల - శాంబరుడు
  • మిక్కిలినేని
  • త్యాగరాజు
  • ధూళిపాళ
  • కాంచన - మాలతి
  • భారతి - చంద్రలోక కన్య
  • జ్యోతిలక్ష్మి - కనికట్టు కన్నెపిల్ల
  • నిర్మల
  • రాజబాబు - యువరాజు
  • విజయలలిత - దేవకన్య
  • రమణారెడ్డి
  • బాలకృష్ణ - ఆస్థానకవి
  • వాసుదేవరెడ్డి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • మాటలు: వీటూరి
  • పాటలు : జి.కె.మూర్తి, వీటూరి, ఆరుద్ర, శ్రీశ్రీ, సి.నారాయణరెడ్డి,
  • సంగీతం: కోదండపాణి
  • దర్శకత్వం: ఆమంచర్ల శేషగిరిరావు
  • ఛాయాగ్రహణం: లక్ష్మణ్ గోరే
  • కళ: చలం, వాలి, భాస్కరరావు
  • నృత్యాలు: కె.ఎస్.రెడ్డి, వెంపటి, పసుమర్తి, జయరాం
  • నిర్మాత: వై.వి.కృష్ణయ్య

పాటలు/పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలు, పద్యాల వివరాలు:[1]

క్ర.సం. పాట గాయకులు రచన
1 అంత సన్నని నడుము అలసిపోవును ఏమో (పద్యం) ఘంటసాల సినారె
2 అట జనకాంచి భూమి సురుడంబర చుంబిత (పద్యం) బి.గోపాలం వీటూరి
3 ఓ ఓ ఓ కన్ను చెదరే కన్నె వయసే వేడి జలపాతం పి.సుశీల బృందం వీటూరి
4 గానమె కళలందుకడు మిన్న అల భువిలో దివిలో పి.సుశీల,
ఎస్.జానకి
ఆరుద్ర
5 నాలోని స్వప్నాల అందాలె నీవు పి.సుశీల,
ఘంటసాల
జి.కృష్ణమూర్తి
6 గురు ఝష ఢులీన కిరినర హరి (పద్యం) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వీటూరి
7 చెలి నీదోయి యీ రేయి ఇక రావోయి ఓ రసపాయి పి.సుశీల వీటూరి
8 పదములు లేజివుళ్ళ చేలువుమ్ముల సొమ్ముల (పద్యం) ఘంటసాల శ్రీశ్రీ
9 పిళ్ళారివారి కోడలు పెళ్ళైన పదేళ్ళ పిదప పిల్లలగన (పద్యం) బి.గోపాలం వీటూరి
10 నింటికి యింటికి విలువ కూర్చునదేది ( సంవాద పద్యాలు ) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
బి. గోపాలం
వీటూరి
11 బల్లిదుండు రామ పార్ధివుడు తొల్లి (పద్యం) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వీటూరి
12 దోమలు కుట్టిన దేహము దోమలు సంగీతము ( పద్యం ) బాలకృష్ణ ,
రాజబాబు
13 వదనము పారిజాతమౌ పదముల లేజివుళ్ళ (పద్యం) ఘంటసాల సి. నారాయణ రెడ్డి
14 విరబూసెడు పూవులనెవ్వరు కాదనగలరు (పద్యం) ఘంటసాల సినారె
15 వదలగ రాని వెన్నెల వేళ.. చెలి నీదోయి ( బిట్ ) పి. సుశీల వీటూరి
16 రా రా రా అంది వెన్నెల కూ కూ కూ అంది కోయిల ఎస్.జానకి శ్రీశ్రీ
17 నందనము తలదన్ను మందారవనమందు(పద్యం) ఘంటసాల సినారె
18 హోయ్ మావా కన్ను కొట్టి కొంగూ పట్టీ తేరగ రమ్మంటే ఎల్.ఆర్.ఈశ్వరి వీటూరి
19 పిల్లి లాంటి రావణుండు బల్లి లాగ నక్కి నక్కి ( గేయము ) బాలకృష్ణ

మాధవుడు, శాంబరుడు చిన్ననాటి స్నేహితులు. ఒక రోజు వారు తోటి మిత్రులతో కలిసి బిళ్ళంగోడు ఆడుతున్న సమయంలో ఆ వైపే వెళ్తున్న యువరాజుకు బిళ్ళ తగిలి గాయపడ్డాడు.

దానికి మహారాజు వారిరువురినీ కఠినంగా శిక్షిస్తాడు. ఇద్దరికీ మహారాజుపైన, యువరాజు పైన ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక చెలరేగింది. శాంబరుడు ఒక మాంత్రికుని ఆశ్రయించి మంత్ర విద్యలన్నీ నేర్పమని కోరుతాడు. మాధవుడు తన తల్లిదగ్గరే అన్ని విద్యలూ నేర్చాడు.

ఒక సందర్భంలో మాధవుడు రాజాస్థానంలో సాహిత్యం, సాహస పోటీలలో నెగ్గి ఒకనాడు తనను శిక్షించిన మహారాజు చేతనే గౌరవం పొందుతాడు. అతని శూరత్వానికీ, పాండిత్యానికి ఆకర్షింపబడిన మహారాజు మేనకోడలు మాలతి మాధవుని ప్రేమిస్తుంది. కాని యువరాజు ఆమెను బలవంతంగానైనా పెళ్ళాడేందుకు నిశ్చయిస్తాడు.

ఇంతలో మాయమంత్రాలు నేర్చిన శాంబరుడు రానే వస్తాడు. తనను శిక్షించిన మహారాజును, యువరాజును అవమానించి తన పగ తీర్చుకుంటాడు. ఆ తర్వాత అతని దృష్టి మాలతి మీద పడింది. ఆమె తన మిత్రుడు వలచిన యువతి అని తెలిసి కూడా ఆమెను చేపట్టుతానని ప్రతిన బూనుతాడు. స్నేహితుల మధ్య వైరం ప్రారంభమౌతుంది. ఆ అమ్మాయి అందం పొందడం కోసం పందెం వేస్తారు. అందులో ఎవరు నెగ్గుతారు? మాలతి ఎవరికి దక్కుతుంది? అనేది మిగిలిన కథ.[2]

మూలాలు

[మార్చు]
  1. కొల్లూరి, భాస్కరరావు. "అందం కోసం పందెం - 1971". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 10 మార్చి 2020. Retrieved 10 March 2020.
  2. వీరా (12 December 1971). "చిత్రసమీక్ష - అందం కోసం పందెం" (PDF). విశాలాంధ్ర దినపత్రిక. Archived from the original (PDF) on 11 నవంబరు 2022. Retrieved 11 November 2022.