అంబెల్లిఫెరె
వికీపీడియా నుండి
| Carrot family | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||
|
|||||||||||
|
|
|||||||||||
| Apium లిన్నేయస్ |
|||||||||||
|
|
|||||||||||
including:
|
అంబెల్లిఫెరె కుటుంబంలో దాదాపు 300 ప్రజాతులు, 3000 జాతులు ఉన్నాయి. ఇవి అన్ని ప్రాంతాలలో వ్యాపించి ఉన్నప్పటికి, సమశీతోష్ణ ప్రాంతాలలో విస్తారముగా ఉన్నాయి. భారతదేశంలో 53 ప్రజాతులు, 200 జాతులను గుర్తించారు.
విషయ సూచిక |
[మార్చు] కుటుంబ లక్షణాలు
- ఏకవార్షిక లేదా ద్వివార్షిక గుల్మాలు.
- కాండము బోలుగా ఉంటుంది.
- మొక్క బాగాలలో షైజోజనస్ తైల గ్రంధులు ఉంటాయి.
- ఏకాంతర, సంయుక్త పత్రాలు, పుచ్ఛ రహితము.
- తొడుగు వంటి పత్రపీఠము.
- పుష్ప విన్యాసము సరళ లేదా సంయుక్త గుచ్ఛము.
- ద్విలింగ పుష్పాలు, పంచభాగయుతము, అండకోశోపరికము, సౌష్టవయుతము.
- మకరందమును ఉత్పత్తిచేసే స్టైలోపోడియం.
- ద్విఫలదళ, సంయుక్త, ద్విబిలయుత నిమ్న అండాశయము.
- లోలాకార అండాలు, స్తంభ అండాన్యాసము.
- ఫలము క్రీమోకార్ప్.
[మార్చు] ఆర్ధిక ప్రాముఖ్యత
- కారట్ వేరు దుంపలను కూరగాయలు గా వాడతారు.
- ధనియాలు, వాము, జీలకర్ర విత్తనాలను సుగంధ ద్రవ్యాలుగా వాడతారు.
- కోరియాండ్రమ్ మొక్కలను కొత్తిమిర గా వాడతారు.
- ఫెరులా ఎసఫీటిడ కాండం, వేరు నుండి లభించే రెసిన్ ను ఇంగువగా వాడతారు. దీనిని వంటలలోను, అజీర్తికి, దగ్గుకు మందుగా వాడతారు.
- బ్రాహ్మి పత్రాలు జ్ఞాపకశక్తిని వృద్ధిపరచడానికి, చలువచేయడానికి ఉపయోగపడతాయి.
- కొన్ని జాతులను అందం కొరకు తోటలలో పెంచుతారు.
[మార్చు] ముఖ్యమైన ప్రజాతులు, మొక్కలు
- డాకస్ (Daucus) - కారెట్
- ఫెరులా (Ferula) - (ఇంగువ)
- కొరియాండ్రమ్ (Coriandrum) - ధనియాలు
- కుమినమ్ (Cuminum) - జీలకర్ర
- కారమ్ - వాము
- ఫీనిక్యులమ్ (Foeniculum) - సోంపు
- సెంటెల్లా (Centella) - బ్రాహ్మి లేదా సరస్వతీ ఆకు
[మార్చు] మూలాలు
- బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.