సరస్వతీ ఆకు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| సరస్వతీ ఆకు | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|
|||||||||||||||
| Centella asiatica (లి.) Urban |
|||||||||||||||
|
|
సరస్వతీ ఆకు (Centella asiatica) అంబెల్లిఫెరె కుటుంబానికి చెందిన ఒక ఔషధ మొక్క. ఇవి చెమ్మ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో, నీటివనరులకు దగ్గరలో పెరుగుతాయి. సరస్వతీ ఆకును 'మండూకపర్ణి' యని, సెంటెల్లా (Centella) యని వ్యవహరిస్తారు. 'సంబరేణు' అను వేరొక మొక్క ఇలాంటి కలిగియుంటాయి. దీనిని 'బ్రహ్మీ' యని, బకోపా (Bacopa) యని వ్యవహరిస్తాఅరు.
[మార్చు] లక్షణాలు
- కణుపుల వద్ద అబ్బురపు వేళ్ళున్న సాగిలపడి పెరిగే బహువార్షిక గుల్మము.
- మూత్రపిండాకారంలో గాని, ఇంచుమించు గుండ్రంగా గాని ఉన్న దూరస్థ దంతపుటంచుతో ఉన్న సరళ పత్రాలు. ఇవి పొడవైన కాడలు కలిగివుంటాయి.
- గ్రీవస్థ గుచ్ఛాలలో ఏర్పడిన ఎరుపు రంగుతో కూడిన తెల్లని పుష్పాలు. ఇవి 4-5 ఒకే కాడపై ఉంటాయి.
- గట్లుగాడులు గల క్రీమోకార్ప్ ఫలం.
[మార్చు] వైద్యంలో ఉపయోగాలు
ఈ మొక్కను ఉపయోగించి బ్రాహ్మీమాత్రలు, బ్రాహ్మీఘృతము, సరస్వతారిష్ఠము, బ్రాహ్మరసాయనము, బ్రాహ్మీతైలము మొదలగు ఆయుర్వేద ఔషధాలు తయారుచేస్తారు. ఇవి నరాలకు బలాన్ని కలుగజేసి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. ఉన్మాదము, అపస్మారము మొదలగు మానసిన వ్యాధులలో ప్రయోజనకారి.
[మార్చు] మూలాలు
- ఔషధ మొక్కల సాగు - సావకాశాలు: అటవీ శాఖ మరియు శ్రీ శ్రీనివాస ఆయుర్వేద ఫార్మశీ, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2004.